




Best Web Hosting Provider In India 2024

Zee Telugu Serial Review: జీ తెలుగు కొత్త సీరియల్‌కు అదిరిపోయిన రివ్యూలు.. తొలి ఎపిసోడే హిట్ అంటున్న ఫ్యాన్స్
Zee Telugu Serial Review: జీ తెలుగులో ప్రారంభమైన కొత్త సీరియల్ తొలి ఎపిసోడ్ కే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. కొందరైతే ఇది ప్రైమ్ టైమ్ సీరియల్ అని సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.

Zee Telugu Serial Review: జీ తెలుగు సోమవారం (ఏప్రిల్ 7) నుంచి సరికొత్త సీరియల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటలకు టెలికాస్ట్ కానుంది. తొలి ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు తమ రివ్యూలను పంచుకున్నారు.
దీర్ఘసుమంగళీభవ సీరియల్ తొలి ఎపిసోడ్
జీ తెలుగు ఛానెల్లో సోమవారం నుంచి దీర్ఘసుమంగళీభవ సీరియల్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సీరియల్ చూసిన కొందరు ప్రేక్షకులు దీనికి మంచి రివ్యూలు ఇచ్చారు. ఓ ఇన్‌స్టా పేజ్ లో ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ ఎలా ఉందన్న అభిప్రాయం కోరగా.. స్పందించిన వాళ్లందరూ పాజిటివ్ రివ్యూలే ఇవ్వడం విశేషం.
సూపర్ అంటున్న ఫ్యాన్స్
తొలి ఎపిసోడ్ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు. చాలా బాగుంది అని ఒకరు.. సూపర్ ఆల్ ద బెస్ట్ అని మరొకరు.. ఇది కచ్చితంగా ప్రైమ్ టైమ్ సీరియల్ అని, మధ్యాహ్నం ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారో అని ఇంకొకరు కామెంట్స్ చేయడం విశేషం. ఇలా ఓ కొత్త సీరియల్ తొలి ఎపిసోడ్ కే అన్ని పాజిటివ్ రివ్యూలు రావడం నిజంగా విశేషమే. మరి మేకర్స్ దీనిని ఇలాగే కొనసాగిస్తారేమో చూడాలి.
దీర్ఘసుమంగళీభవ సీరియల్ కథేంటంటే?
అమ్మమ్మ అమర్నాథ్ యాత్ర కలను సాకారం చేసేందుకు అహల్య చేసే ప్రయత్నం, విధికి బలైన అహల్య, ఇంద్ర జీవితాలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. బంధాలు, బంధుత్వాల మధ్య ఉద్వేగభరితంగా సాగే సీరియల్ ఇది. అహల్య (మహీ గౌతమి) టైలర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కలలు కంటుంది.
అక్కడ ఇంద్ర (పవన్ రవీంద్ర) అనే సైనికుడితో ప్రేమలో పడుతుంది. ఇంద్ర మాత్రం తన గతంతో పోరాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇంద్ర మరణంతో వారి ప్రేమ విషాదకరంగా ముగుస్తుంది. ప్రేమ, విధికి మధ్య బంధీ అయిన అహల్య భవిష్యత్తు ఎలా ఉంటుంది? అహల్య జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే దీర్ఘ సుమంగళీ భవ సీరియల్‌ను చూడాల్సిందే.
స్టార్ మా ఛానెల్లో బ్రహ్మముడి సీరియల్ ప్రసారమయ్యే సమయంలోనే జీ తెలుగులో ఈ దీర్ఘసుమంగళీభవం వస్తోంది. తొలి ఎపిసోడ్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో బ్రహ్మముడికి గట్టి పోటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టైమ్ మార్పు వల్ల టీఆర్పీ రేటింగ్ కోల్పోయిన బ్రహ్మముడి.. ఈ కొత్త పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం