




Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda Rashmika: విజయ్‍తో కలిసి రష్మిక బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్నారా! వైరల్ అవుతున్న ఫొటోలు
Vijay Deverakonda – Rashmika Mandanna: రష్మిక రీసెంట్‍గా 29వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఒమన్ వెళ్లి సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో కలిసి ఆమె బర్త్ డే చేసుకున్నారనే రూమర్లు వచ్చాయి. ఫొటోల వల్ల ఈ బజ్ నెలకొంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా రూమర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి చాలాసార్లు వెకేషన్లకు వెళ్లారు. కలిసి పండుగలు చేసుకున్నారు. కానీ తమ రిలేషన్‍ను మాత్రం ఇద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. వారు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలతో.. నెటిజన్లు చాలాసార్లు పట్టేశారు. తాజాగా రష్మిక తన పుట్టిన రోజును విజయ్‍తో కలిసి చేసుకున్నారని తెలుస్తోంది. వారు పోస్ట్ చేసిన ఫొటోలే ఈ రూమర్లకు కారణమయ్యాయి. ఆ వివరాలివే..
ఒమన్ బీచ్‍లో రష్మిక
రెండు రోజుల కింద ఏప్రిల్ 5న తన 29వ పుట్టిన రోజును జరుపుకున్నారు రష్మిక మందన్నా. ఒమన్‍లో సెలెబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా ఒమన్‍లోని ఓ బీచ్‍లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రష్మిక.
విజయ్ కూడా అక్కడే!
ఒక్క రోజు గ్యాప్‍తో విజయ్ దేవరకొండ కూడా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాగీ డ్రెస్ ధరించి బీచ్‍లో నడిచిన, గుర్రం ఎక్కిన, రిలాక్స్ అయిన ఫొటోలను పోస్ట్ చేశారు. రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో, విజయ్ పంచుకున్న ఫొటోల్లోని బీచ్ లొకేషన్ చూసేందుకు ఒకేలా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైట్ సాండ్, చెట్లు ఒకేలా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇద్దరు పోస్ట్ చేసిన ఫొటోల్లో బీచ్ ఒకేలా కనిపిస్తోందని, కలిసి ఒమన్ వెకేషన్‍లో ఉన్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రష్మిక తన పుట్టిన రోజును విజయ్‍తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారని అంటున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మిక అనుకోకుండా హింట్స్ ఇస్తున్నారా.. కావాలనే ఇలా చేస్తున్నారా అనేది మిస్టరీగా ఉంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలా వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేసినా.. ఒకే చోట ఉన్నట్టు హింట్స్ ఇచ్చారు. కానీ తమ బంధాన్ని మాత్రం బయటికి చెప్పడం లేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గీతగోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు రూమర్లు ఉన్నాయి. విజయ్ ఇంటికి కూడా రష్మిక చాలాసార్లు వచ్చినట్టు ఫొటోల ద్వారా తెలిసింది.
సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‍డమ్ మూవీ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్లు రాహుల్ సాంకృతియాన్, రవికిరణ్ కోలాతో సినిమాలకు కూడా విజయ్ ఓకే చెప్పారు.
సల్మాన్ ఖాన్‍తో కలిసి రష్మిక నటించిన సికిందర్ చిత్రం గత నెల 30న విడుదలైంది. కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్, థామా సినిమాలు ప్రస్తుతం రష్మిక లైనప్‍లో ఉన్నాయి.
సంబంధిత కథనం