


Best Web Hosting Provider In India 2024

Ajith Cut Out Fall: కుప్పకూలిన 285 అడుగుల అజిత్ కటౌట్.. హీరో చెప్పిన వినని ఫ్యాన్స్.. వీడియో వైరల్!
Ajith Cut Out Fall Down Over Good Bad Ugly Release: తమిళ స్టార్ హీరో అజిత్ 285 అడుగుల భారీ కటౌట్ కుప్పకూలిపోయింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ సందర్భంగా అజిత్ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేస్తున్న సమయంలో అనుకోకూండా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ajith Cut Out Fall Down Over Good Bad Ugly Release: అభిమానుల చేష్టలు ఇతరుల ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ అమితమైన పిచ్చి వల్ల ఇతరులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సంఘటనే మరోసారి జరిగింది.
285 అడుగుల కటౌట్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల విషయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. సుమారు 285 అడుగుల భారీ కటౌట్‌ను ఆయన అభిమానులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అజిత్ కటౌట్‌ను ఏర్పాటు చేసే క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అజిత్ కటౌట్ నేలపై పడుతుండగా అభిమానులు పరుగులు పెట్టారు.
ఈ సంఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న పీఎస్ఎస్ మల్టీప్లెక్స్ వద్ద జరిగింది. అయితే, అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పీఎస్ఎస్ మల్టీప్లెక్స్ వద్ద అజిత్ అభిమానులు ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు.
పరుగులు తీసిన అభిమానులు
కానీ, కటౌట్ భారీగా ఉండటం వల్లో, మరే ఇతర కారణాలతోనో అజిత్ కటౌట్ ఒక్కసారిగా ముందుకు వంగుతూ కూలడం మొదలైంది. అది గమనించిన కటౌట్ తమపై పడకుండా పరుగులు తీశారు. దీంతో అజిత్ అభిమానులెవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కటౌట్ పడిన ప్రమాదం మాత్రం తప్పి ఫ్యాన్స్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అజిత్ 285 అడుగుల భారీ కటౌట్ కుప్పకూలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉండేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అజిత్ మూవీ రిలీజ్‌కు ముందు ఓ దురదృష్టకర సంఘటన అయ్యేదని, హీరోతోపాటు అభిమానులు కూడా బాధపడేవారని అంటున్నారు.
ఇలాంటివి చేయొద్దని
ఇదిలా ఉంటే, తనకు ఇలాంటి వేడుకలు ఇష్టం లేదని హీరో అజిత్ చాలా సార్లు చెప్పారు. ఇలా ప్రమాదకరమైన పనులు తన అభిమానులు ఎప్పటికీ చేయవద్దని చాలా సందర్భాల్లో అజిత్ కోరారు. కానీ, అజిత్ అభిమానులు మాత్రం తమ ప్లాన్స్ తాము వేస్తూ ఇలా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితులను కొనితెచ్చుకుంటున్నారు.
గతంలో తునివు ప్రీమియర్ షో సమయంలో ఓ అభిమాని మరణించాడు. అప్పటి నుంచి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని అభిమానులను కోరారు హీరో అజిత్ కుమార్. అంతేకాకుండా తనను ‘తల’ అని బిరుదు లేదా ముద్దు పేరుతో కూడా పిలవొద్దను అంతకుముందు చెప్పాడు.
ఏప్రిల్ 10న రిలీజ్
అజిత్ ఒక్కరే కాదు చాలా మంది స్టార్ హీరోల అభిమానులు కూడా ఇలానే చేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అభిమానం పేరుతో చేసే ఇలాంటి పనులు పలువురి ప్రాణాలను హరిస్తున్నాయని, ఇలాంటి ఆపేయాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కుమార్ సరసన హీరోయిన్ త్రిష జోడీ కట్టనుంది. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా యాక్ట్ చేస్తోంది. ఎస్‌జే సూర్య, అర్జున్ దాస్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
సంబంధిత కథనం