


Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఓటీటీల్లో ఈవారం బ్లాక్‍బస్టర్ చిత్రాల సందడి.. ఓ డిజాస్టర్ కూడా.. స్ట్రీమింగ్‍కు 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు
OTT Top Movies This week: ఓటీటీల్లోకి ఈ వారం కొన్ని బ్లాక్‍బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. థియేటర్లలో అదరగొట్టిన సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయనున్నారు. ఓ హారర్ థ్రిల్లర్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.

ఈ ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి బాగానే ఉండనుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లోకి రానున్నాయి. డిఫరెంట్ జానర్లలో సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బ్లాక్‍బస్టర్లు కోర్ట్, ఛావా ఈ వారంలోనే ఓటీటీలోకి రానున్నాయి. ఓ మలయాళ థ్రిల్లర్ సినిమా కూడా అడుగుపెట్టనుంది. ఓ హిందీ హారర్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ వారం (ఏప్రిల్ 7-13) ఓటీటీల్లోకి రానున్న 7 ముఖ్యమైన చిత్రాలు ఇవే..
కోర్ట్
తెలుగు లీగల్ డ్రామా సినిమా ‘కోర్ట్’ ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ మార్చి 14న థియేటర్లలో రిలీజైంది. రూ.10కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.57కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్‍బస్టర్ సాధించింది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ మూవీని నేచురల్ స్టార్ నాని సమర్పించారు.
ప్రావింకూడు షప్పు
మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రావింకూడు షప్పు చిత్రం ఏప్రిల్ 11వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా జనవరి 16వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.
చోరీ 2
హారర్ థ్రిల్లర్ సినిమ చోరీ 2 సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో నుష్రత్ బరూచా లీడ్ రోల్ చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి విశాల్ పురియా దర్శకత్వం వహించారు.
ఛావా
బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘ఛావా’ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రూ.780కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం ఈవారంలోనే ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్.
పెరుసు
తమిళ కామెడీ డ్రామా సినిమా ‘పెరుసు’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుంది. వైభవ్, నిహారిక లీడ్ రోల్చ్ చేసిన ఈ చిత్రం మార్చి 14న తమిళంలో థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
కింగ్‍స్టన్
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్‍స్టన్ సినిమా జీ5 ఓటీటీలో ఏప్రిల్ 13వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తమిళంలో రూపొందిన ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. కింగ్‍స్టన్ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు.
పైన్‍కిలి
మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం పైన్‍కిలి ఏప్రిల్ 11వ తేదీన మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. సాజిన్ గోపు, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జితూ మాధవ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది.
సంబంధిత కథనం
టాపిక్