Brahmamudi April 7th Episode: గుడిలో రాజ్‌ను చూసిన దుగ్గిరాల కుటుంబం- దంపతులుగా రామ్, కావ్య- యామిని షాక్, రుద్రాణి గొడవ!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 7th Episode: గుడిలో రాజ్‌ను చూసిన దుగ్గిరాల కుటుంబం- దంపతులుగా రామ్, కావ్య- యామిని షాక్, రుద్రాణి గొడవ!

Sanjiv Kumar HT Telugu
Published Apr 07, 2025 07:33 AM IST

Brahmamudi Serial April 7th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 7 ఎపిసోడ్‌లో కావ్య, దుగ్గిరాల కుటుంబం అంతా సీతారాముల కల్యాణానికి వెళ్తారు. గుడిలో రుద్రాణి గొడవ చేస్తుంది. యామిని, రాజ్ అదే గుడికి వస్తారు. కల్యాణంలో పీటలపై రాజ్, కావ్య దంపతులుగా కూర్చుంటారు. అక్కడే రాజ్‌ను చూసిన రుద్రాణి అందరికి చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 7వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 7వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాల్లో అందరికి కావ్య హారతి ఇస్తుంది. ఇవాళ శ్రీరామనవమి. ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు జరిపిస్తున్నాం కదా. వెళ్దామని కావ్య చెబుతుంది. గతేడాది మా వదిన గొప్పలకు పోయి మీ ఇద్దరి చేతుల మీదుగా జరిపించింది. ఇప్పుడు మీ కొడుకు ఏడని అడిగితే ఏమని సమాధానం చెబుతారు అని రుద్రాణి అంటుంది.

సపోర్ట్ చేస్తున్నానని కాదు

ఆ సమాధానాలు నేను చెబుతాను. మావయ్య అన్నీ రెడీ అయ్యాయి. అందరూ రెడీ అవ్వమని కావ్య అంటుంది. ఇప్పుడెందుకు ఇవన్నీ చేస్తున్నావ్. ఇంటి పరువు తీయడానికి కాకపోతే అని రుద్రాణి అంటుంది. కావ్య ఎప్పుడు అలా చేయదని సుభాష్ అంటాడు. రుద్రాణికి సపోర్ట్ చేస్తున్నానని కాదు తను చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పటివరకు మనమధ్యే ఉన్న రాజ్ విషయం నలుగురిలోకి వెళితే అది పరువు సమస్య అవుతుంది కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ప్రకాషం కూడా అలాగే అంటాడు. అందరికీ సమాధానం నేను చెబుతాను అని చెబుతున్నా కదా అని కావ్య అంటుంది. ఏం చెబుతావ్. ఇంట్లో చెప్పినట్లే చెబుతావా. ప్రూఫ్స్ అడిగితే ఏం చూపిస్తావ్ అని రాహుల్ అంటాడు. కావ్య ఇంట్లోవాళ్లను పిచ్చోళ్లను చేసినట్లు బయటివాళ్లను చేస్తానని చూస్తే నిన్ను పిచ్చిదానిని చూసినట్లు చూస్తారు. రాజ్ లేకుండా గుడికి వెళ్లి ఉన్న పరువు తీసుకుందామా అని రుద్రాణి అంటుంది. గుడికి వెళ్తే కొత్తగా పోయే పరువేముండదు. అందరం కలిసి వెళ్దామని ఇందిరాదేవి అంటుంది.

బాధలో కూడా కోడలికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటో అని రుద్రాణి అంటుంది. ఇంటి పరువు సంగతి నేను చూసుకుంటా. ఈ కల్యాణం జరిపిస్తున్నదే ఆయన తిరిగి ఇంటికి రావాలని. అందరం వెళ్దాం రండి అని కావ్య అంటుంది. కావ్య లేడంటే రాజ్ తిరిగిరావడానికి అంటావేంటీ. మీరంతా కావ్య మాయలో పడ్డారు అని రుద్రాణి అంటుంది. సీతారామయ్య కూడా గుడికి వెళ్దామని చెబుతాడు. దాంతో అంతా రెడీ అవ్వడానికి వెళ్తారు.

చాలా బాగున్నావ్

మరోవైపు యామిని ఇంట్లో కూడా గుడికి వెళ్లడానికి రెడీ అవుతారు. ఏంటీ యామిని ఇంత ట్రెడిషనల్‌గా తయారయ్యావ్. ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాజ్ అంటాడు. ఇన్నాళ్టీకైనా నేను వేసుకున్న డ్రెస్ గుర్తు పట్టావ్. ఇన్నిరోజులుగా నీ నుంచి ఒక్క కాంప్లిమెంట్ రాలేదు అని యామిని అంటుంది. ఈ ట్రెడిషనల్ డ్రెస్సులో చాలా బాగున్నావ్ అని రాజ్ అంటాడు. శ్రీరామ నవమికి వెళ్లి సీతారాముల కల్యాణం జరిపిస్తే ఎలాంటి ఆటంకాలు రావని. మాతోపాడు గుడికి రమ్మని యామిని అంటుంది.

రాజ్ రానని, వేరే వర్క్ ఉందని అంటే.. అవన్నీ పక్కన పెట్టమని యామిని చెబుతుంది. వైధేహి కూడా బతిమిలాడుతుంది. కళావతి గారిని కలుద్దామనుకున్నానే అని రాజ్ అనుకుంటాడు. రెండు గంటల్లో వెళ్లొచ్చేద్దామని యామిని తండ్రి అంటాడు. దాంతో రాజ్ ఒప్పుకుంటాడు. దుగ్గిరాల కుటుంబం అంతా గుడికి వెళ్తారు. ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ కల్యాణం జరిపించమని కావ్య మొక్కుకుంటుంది. రాహుల్ ఏడని ఇందిరాదేవి అడుగుతుంది.

ఈపాటి దానికి ఎందుకని నేనే వద్దాన్నానని రుద్రాణి చెప్పడంతో స్వప్న సైటెర్లు వేస్తుంది. పోయినసారి రాజ్, కావ్య చేతుల మీదుగా జరిపించాం. ఇప్పుడు మీ అబ్బాయి కనిపించడం లేదు. రాలేదా అని పంతులు అడిగితే.. రాలేడు అని రుద్రాణి అంటుంది. ఊరేళ్లాడా అని పంతులు అడుగుతాడు. వెళ్లాడు. కానీ ఎక్కడికి వెళ్లాడో తెలియదు. వస్తాడో రాడో కూడా తెలియదు అని రుద్రాణి అంటుంది. దాంతో ఇందిరాదేవి తిడుతుంది.

ఏ గొడవలు లేకుండా

ఇందాకే కుటుంబ పరువు అని నువ్ మాట్లాడేదేంటీ అని సుభాష్ అంటాడు. ఇక్కడ ఏం మాట్లాడకు అని వేడుకున్నాను కదా అని అపర్ణ అంటుంది. ఒక్కొక్కరు రుద్రాణిని తిడతారు. గుడిలోకి ఇలా అడుగుపెట్టామో లేదో అప్పుడే మీరు గొడవలు మొదలు పెట్టేసారా. ప్లీజ్ కల్యాణం అయ్యేవరకు అయినా ఏ గొడవలు లేకుండా ఉండండి అని కావ్య అంటుంది. రాజ్ లేడని చెప్పాను. ఎప్పుడు నన్ను నిందించడమే అని రుద్రాణి అంటుంది.

పంతులు గారు ఆయన ఇప్పుడు రాకపోవడానికి కారణం ఉంది. ఆయన తిరిగి రావడానికి కల్యాణం జరిపిస్తున్నాం. ఆయన వచ్చాక మేము వచ్చి దర్శనం చేసుకుంటాం అని కావ్య చెబుతుంది. శ్రీరాముడిని నమ్ముకున్నవాళ్లకు ఆయన ఏనాడు అన్యాయం చేయడమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినాసరే చివరికి అందరిని ఒక్కటి చేసి సంతోషించేలా చూసుకుంటాడు. మీరు కోరుకుంటున్నట్లుగా మీ అబ్బాయి మీ కళ్లముందుకు వస్తాడు అని పంతులు చెబుతాడు.

మరోవైపు యామిని ఫ్యామిలీ గుడికి వస్తుంది. సీతారాముల కల్యాణం విశిష్టతను యామిని చెబుతుంది. రాజ్ మాత్రం కావ్య గురించి ఆలోచిస్తాడు. ఇవాళ పండుగ కాబట్టి తనకు ఎన్ని పనులు ఉన్నాయో, ఎక్కడుందో అనుకుంటాడు. ఎదుటివాళ్ల పని తెలియకుండా మనకు ఫ్రీ టైమ్ ఇవ్వాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఫ్రీ అయ్యాక తనే చేస్తుంది. లేదా నేను ఫోన్ చేస్తాను అని రాజ్ అనుకుంటాడు. ఏమైంది రామ్ ఏం ఆలోచిస్తున్నాడు అని యామిని అనుకుంటుంది.

యామినికి అనుమానం

నేను చెప్పింది వినలేదా. గుడిలో డిస్టర్బెన్స్ లేదు నీ మనసులో ఉంది అని యామిని అంటుంది. ఇవాళ నా ఫ్రెండ్ కాల్ చేస్తానన్నారు. మన కాలేజ్ ఫ్రెండ్స్ అని రాజ్ అంటాడు. వాళ్లు నేను సృష్టించిన ఫ్రెండ్స్ బావ. నేను చెప్పకుండా ఎందుకు చేస్తారు. నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నట్లు అనిపిస్తుంది. లేకుంటే నేను చెప్పిన అబద్ధమే నాకు ఎందుకు చెబుతావ్ అని అనుమానిస్తుంది యామిని. అన్నీ పక్కన పెట్టి మన గురించి, మన పెళ్లి గురించి ఆలోచించు బావ అని యామిని అంటుంది.

నాకు నచ్చని ఒకే ఒక్క టాపిక్ అదే. దాని గురించి ఎలా ఆలోచించను అని మనసులో అనుకున్న రాజ్ నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావ్‌గా అని అంటాడు. గుడిలోకి యామిని వాళ్లు వెళ్తారు. దంపతులు వెళ్లి అలా కూర్చోండి. కాసేపట్లో కల్యాణం మొదలవుతుంది అని పంతులు అంటాడు. ఇంతలో కారులో వాటర్ బాటిల్ మర్చిపోయాను. తీసుకొస్తాను అని ప్రకాశం వెళ్తాడు. ఆయన మతిమరుపు పోగొట్టమని ధాన్యలక్ష్మీ కోరుకుంటుంది. అంతా పీటలపై కూర్చుంటారు.

నీ కొడుకును ఎందుకు రానివ్వలేదు. మేము కూడా కూర్చునేవాళ్లం కదా. నీ కన్నకొడుకు కాపురం సుఖంగా ఉండటం ఇష్టంలేదా అని రుద్రాణిని అడుగుతుంది స్వప్న. వాడే రానని చెప్పి వెళ్లిపోయాడు అని రుద్రాణి అంటుంది. ఇందిరాదేవి, స్వప్న తిడుతారు. నాకు బుద్ధి లేదు సరే పెళ్లానివి నువ్వైనా చెప్పుకుని తీసుకొచ్చుకుంటేమవు అని రుద్రాణి అంటే.. పెళ్లయినా మీ కొంగుచుట్టే తిప్పుకుంటే ఎలా చెప్పేది అని స్వప్న అంటుంది. ఇలా స్వప్న, రుద్రాణి వాదించుకుంటారు.

పిచ్చి పట్టిందని

కావ్య కూర్చోడానికి వెళ్తే.. రుద్రాణి ఆపుతుంది. దంపతులను కూర్చోమన్నారు. మనలాంటి సింగిల్స్‌ని కాదు. మనకు అలాంటి అదృష్టం లేదు కానీ నా పక్కన వచ్చి నిల్చో అని రుద్రాణి అంటుంది. నేను మీ అంత బ్రెయిన్ లెస్ ఫూల్‌ని కాదు. నేను జంటగానే కూర్చుంటాను అని కావ్య చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఏంటీ కలలోనా. ఇన్నాళ్లు నీకు పిచ్చి పట్టిందని ఇంట్లోవాళ్లే అనుకున్నారు. ఇప్పుడు లోకం కూడా అనుకోవాలా అని రుద్రాణి అంటుంది.

గుడిలో ఉన్నాం కదా అని నిన్ను ఏం అనని అనుకోకు. తప్పుగా మాట్లాడితే పళ్లు రాలగొడతాను అని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. రాజ్ లేడుగా పీటలపై జంటగా ఎలా కూర్చుంటావ్ అని అడుగుతున్నాను. కొంపదీసి రాజ్ వచ్చి కూర్చుంటాడని చెబుతావా ఏంటీ అని రుద్రాణి అంటుంది. ఆ రాముడు తల్చుకుంటే ఆయనే వస్తారు. నాతోపాటు ఆయన పీటలపై కూర్చుంటారు అని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో రుద్రాణి సైటెర్లు వేస్తుంది.

అదెలా సాధ్యం అని అపర్ణ అంటుంది. నీ పిచ్చి ప్రత్యక్షంగా చూస్తూ ఎలా నమ్ముతారు. ఇంకాసేపు తను ఇక్కడే ఉంటే ఆ పూజారికి కూడా పిచ్చి ఎక్కించేలా ఉందని రుద్రాణి అంటుంది. రాజ్ కచ్చితంగా వస్తాడా అని సుభాష్ అడుగుతాడు. ఎలా అని రుద్రాణి అంటుంది. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అని కావ్య వెళ్తుంది. ఈలోపు రుద్రాణి తన మాటలతో రచ్చ చేస్తుంది. రాజ్‌ను తీసుకొస్తే మీ గుండె ఆగిపోతుందా ఏంటీ అని స్వప్న అంటే.. నాకు కూడా సంతోషమే కదా అని రుద్రాణి అంటుంది.

రాజ్‌ను చూసిన రుద్రాణి

మీకు ఎంత సంతోషమో మీ మొహం చూస్తేనే తెలుస్తుంది అని స్వప్న అంటుంది. ఇంతలో కావ్య రాజ్ ఫొటో తీసుకొస్తుంది. తర్వాత తన పక్కన రాజ్ ఫొటో పెట్టి దంపతులుగా రాజ్, కావ్య కూర్చుంటారు. ఇంతలోనే యామినివాళ్లతో రాజ్ వచ్చి కల్యాణంలో కూర్చుంటాడు. అక్కడ రాజ్‌ను రుద్రాణి చూస్తుంది. అక్కడే ఉన్న మైక్ తీసుకుని ఇన్నిరోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది అని నేను రాజ్‌ను చూశాను అని అందరికి చూపిస్తుంది రుద్రాణి.

రాజ్‌ను చూసి దుగ్గిరాల కుటుంబం అంతా సంతోషపడుతుంది. రాజ్‌ దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. కానీ, రాజ్ మాత్రం వాళ్లను గుర్తుపట్టడు. దాంతో అపర్ణకు ఏం అర్థం కాదు. కావ్య షాక్ అవుతుంది. యామిని తెగ కంగారుపడిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024