



Best Web Hosting Provider In India 2024
Petrol Diesel Price hike: పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 2 పెంచిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ నుండి ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ప్రకారం, పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు 2 రూపాయలు పెంచారు. దీని కారణంగా, పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయలకు, డీజిల్ పై 10 రూపాయలకు పెరిగింది.
ఈ మార్పులు 2025 ఏప్రిల్ 8వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ మార్పులు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎక్సైజ్ చట్టం, 1944 మరియు ఫైనాన్స్ చట్టం, 2002 ప్రకారం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబందించిన గతంలో ఉన్న నోటిఫికేషన్ లలో మార్పులు చేస్తూ ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు.
రీటైల్ ధరలు పెరగవు
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది.
‘ఈ రోజు ఎక్సైజ్ డ్యూటీ రేట్లు పెరిగినప్పటికీ, పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి..’ అని వివరించింది.
Best Web Hosting Provider In India 2024
Source link