Crime news : ‘6 రోజులు.. 23 మంది రేప్​ చేశారు’- నరకం చూసిన 19ఏళ్ల యువతి!

Best Web Hosting Provider In India 2024


Crime news : ‘6 రోజులు.. 23 మంది రేప్​ చేశారు’- నరకం చూసిన 19ఏళ్ల యువతి!

Sharath Chitturi HT Telugu
Published Apr 08, 2025 06:40 AM IST

వారణాసిలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. తనని 23 మంది, ఆరు రోజుల పాటు అత్యాచారం చేశారని ఓ 19ఏళ్ల యువతి వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వారణాసిలో దారుణం- 19ఏళ్ల యువతిపై అత్యాచారం!
వారణాసిలో దారుణం- 19ఏళ్ల యువతిపై అత్యాచారం!

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల పాటు తనపై 23మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 19ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

కంటోన్మెంట్ అదనపు పోలీసు కమిషనర్ విదుష్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. మార్చ్​ 29న బాధితురాలు కొందరు యువకులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఏప్రిల్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆమెను వెతికి రక్షించారు. కానీ ఆ సమయంలో అత్యాచారం గురించి ఆమె ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు.

అయితే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఏప్రిల్ 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మార్చ్​ 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిందితులు తనను పలు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

గుర్తుతెలియని 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 12 మంది నిందితుల్లో ఆరుగురిని ఆదివారం అరెస్ట్​ చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

“మార్చ్​ 29న నా కూతురు తన ఫ్రెండ్​ ఇంటికి వెళ్లింది. వెనక్కి తిరిగొస్తున్నప్పుడు రాజ్​ విశ్వకర్మ అనే బాలుడు, నా కూతురుని అడ్డుకున్నాడు. కేఫ్​కి తీసుకెళ్లాడు. అతని స్నేహితులతో కలిసి నా కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడు,” అని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.

“మరుసటి రోజు సమీర్​ అనే అబ్బాయిని నా కూతురు కలిసింది. ఆ సమయంలో అతను తన ఫ్రెండ్స్​తో ఉన్నాడు. నా కూతురిని బైక్​ మీద తీసుకెళ్లి చెడు పనులు చేశాడు. తర్వాత ఆమెను నదేశర్​లో వదిలేశాడు,” అని మహిళ వివరించింది.

“మరుసటి రోజు మార్చి 31న ఆయుష్ అనే అబ్బాయి తన ఐదుగురు స్నేహితులైన సోహైల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్లతో కలిసి ఆమెను సిగ్రాలోని కాంటినెంటల్ కేఫ్​కి తీసుకెళ్లి మత్తుమందులు ఇచ్చి ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 1న సాజిద్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆమెను ఓ హోటల్​కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి బయటకు గెంటేశాడు. అక్కడి నుంచి బయటకు వెళుతుండగా మార్గం మధ్యలో ఇమ్రాన్ వచ్చి ఓ హోటల్​లో ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నా కూతురు కేకలు వేయడంతో హోటల్ బయట వదిలేశాడు,” అని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఏప్రిల్ 2న రాజ్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను హుకుల్​గంజ్​లోని తన ఇంటి పైకప్పు వద్దకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి యత్నించాడు. యువతి కేకలు వేయడంతో మత్తులో ఉన్న యువకులు ఆమెను అస్సీ ఘాట్​కు తీసుకెళ్లి అక్కడే వదిలేశారని ఆమె తల్లి ఆరోపించారు.

ఏప్రిల్ 3న డానిష్ అనే వ్యక్తి ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి అక్కడ సోహైల్, షోయబ్, మరో బాలుడు కలిసి ఆమె కూతురికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చౌక్ఘాట్ సమీపంలో వదిలేశారు. మరుసటి రోజు ఏప్రిల్ 4న తన కూతురు ఇంటికి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పిందని ఆ మహిళ వివరించింది.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహైల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్​గా గుర్తించారు.

భారతీయ న్యాయ సంహితలోని 70, 74, 123, 126, 127, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link