






Best Web Hosting Provider In India 2024

Foods For Oral Health: ఆపిల్ నుంచి ఉల్లిపాయ వరకూ పంటి ఆరోగ్యానికి మేలు చేసే టాప్ 10 ఆహారాలు ఇవిగో!
Foods For Oral Health: ఆపిల్, వెల్లుల్లి, చీజ్, గ్రీన్ టీ వంటి ఆహారాలు లేదా వాటితో చేసిన పానీయాలు మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. పోషకాహార నిపుణులు తాన్యా ఖన్నా చెప్పిన దాని ప్రకారం.. చూడగానే చక్కగా కనిపించి, మీ ముఖ సౌందర్యాన్ని పెంచే పళ్ల కోసం కొన్ని ఆహారపదార్థాలు తప్పక తీసుకోవాలట.

నోటి పరిశుభ్రత, తెల్లని పళ్ళు కలిగి ఉండటానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, నాలుకను శుభ్రం చేయడం, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కానీ ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా కూడా మీరు నోటి పరిశుభ్రతను మెరుగుపరచగలరని మీకు తెలుసా? HT లైఫ్‌స్టైల్‌తో ఇంటర్వ్యూలో, ఆలైవ్ హెల్త్‌లో పోషకాహార నిపుణురాలు అయిన తాన్యా ఖన్నా, మీరు తీసుకునే ఆహారం మీ పళ్ళు, చిగుళ్ళ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా, కొన్ని ఆహారాలు, పానీయాలు నోటి ఆరోగ్యాన్ని చురుకుగా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు.
పోషకాహార నిపుణులు తాన్యా ఖన్నా చెప్పిన దాని ప్రకారం, మీ నోటి ఆరోగ్యానికి మంచివిగా ఉండే 10 ఆహారాలు, పానీయాలు గురించి తెలుసుకుందామా..
1. చీజ్
పరిశోధనలు చూపించిన విధంగా, చీజ్ తినడం వల్ల నోటిలో pH స్థాయి పెరుగుతుంది. దీనివల్ల అది తక్కువ ఆమ్లంగా మారుతుంది. పళ్ళు పాడవడానికి ఆమ్ల క్షయం ప్రధాన కారణం కాబట్టి ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా, చీజ్‌లో కాల్షియం, ఫాస్ఫేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు దంతాల ఎనామెల్‌ను కాపాడటంలో సహాయపడతాయి. నోటిలో క్రియేట్ అయ్యే యాసిడ్ల నుండి పళ్లకు హాని కలగకుండా బలపరుస్తాయి.
2. గ్రీన్ టీ
తాన్యా చెబుతున్న దాని ప్రకారం, బరువు తగ్గడానికి ప్రజలు ఎక్కువగా ఎంచుకునే గ్రీన్ టీ అనేది కేటెకిన్స్‌ను అధికంగా కలిగి ఉంటుంది. ఇవి బ్యాక్టీరియా నిరోధక, యాంటీ- ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. గ్రీన్ టీ ప్లాక్, చిగుళ్ళ వ్యాధులతో సంబంధం ఉన్న బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. తీపి లేని గ్రీన్ టీ ఆరోగ్యకరమైన నోటి మైక్రోబయోమ్‌కు సహకరిస్తుందని, పైగా ఒక రిఫ్రెష్‌మెంట్ గా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు.
3. ఉల్లిపాయలు
నిమ్మకాయ, ఉల్లిపాయలు శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. పోషకాహార నిపుణులు వివరించిన దానిని బట్టి ఈ సమ్మేళనాలు పళ్ళు పాడవడం, చిగుళ్ళ వ్యాధులతో సంబంధం ఉన్న వాటితో సహా వివిధ నోటి బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి, మీ సలాడ్‌లో వీలైతే కొద్దిగా నిమ్మరసం, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకోవడం వల్ల రుచి కంటే ఎక్కువ లాభాలు లభిస్తాయి.
4. లవంగాలు
లవంగాలు యూజెనోల్‌ను కలిగి ఉంటాయి. ఇది నొప్పి నివారణ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న సహజ సమ్మేళనం. ఇవి పళ్ళ నొప్పులను తగ్గించడానికి, నోటి వ్యాధికారకాలతో పోరాడటానికి ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. లవంగాల నూనె (తగినంతగా కలిపినది) లేదా లవంగాలను నమలడం వల్ల పళ్ళ నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది.
5. పెరుగు (సాదా, తీపి లేనిది):
సాదా, తీపి లేని పెరుగులో ప్రోబయోటిక్స్ అని పిలువబడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నోటి మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేయడానికి, ప్లాక్ ఏర్పడటాన్ని అడ్డుకోవడానికి, చిగుళ్ళ వ్యాధి/జింజివైటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
6. ఆపిల్స్
ఆపిల్స్ నోటి నుండి లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మీరు నమిలేటప్పుడు పళ్ళను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఆపిల్స్‌లో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఆపిల్ తొక్కలో పాలీఫినాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి.
7. డార్క్ చాక్లెట్
అధిక కోకో కంటెంట్ (కనీసం 70 శాతం) ఉన్న డార్క్ చాక్లెట్ కొన్ని నోటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎందుకంటే అందులో టానిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను పళ్ళకు అంటుకోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కోకోలో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయట. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి.
8. క్యారెట్లు
“ఆపిల్స్ లాగానే, క్యారెట్లు నమలడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. పాచితో పాటు పళ్ల మధ్య ఇరుక్కున్న వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. అవి బీటా-కెరోటిన్‌కు మంచి మూలం కూడా, దీనిని శరీరం విటమిన్ Aగా మారుస్తుంది. ఇది నోటిలో ఆరోగ్యకరమైన శ్లేష్మ పొరలను నిర్వహించడానికి అవసరమైన పోషకమని పోషకాహార నిపుణులు చెప్పారు.
9. వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ సమ్మేళనం. ఇది నోటి బ్యాక్టీరియాను చంపడానికి, చిగుళ్ళ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పెరియోడోంటైటిస్‌తో సంబంధం ఉన్న బ్యాక్టీరియా పోర్ఫైరోమోనాస్ జింజివాలిస్‌కు వ్యతిరేకంగా అల్లిసిన్ చర్యను చూపిస్తుంది.
10. క్రాన్‌బెర్రీస్ (తీపి లేనివి)
చివరగా, తీపి లేని క్రాన్‌బెర్రీస్‌లో ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోయాంథోసైనిడిన్లు బ్యాక్టీరియాను పళ్ళ ఉపరితలాలకు అంటుకోకుండా నిరోధిస్తాయి. ఇది ప్లాక్ ఏర్పడటాన్ని తగ్గించడానికి, పళ్ళు పాడవకుండా చేసి, చిగుళ్ళ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
సంబంధిత కథనం