




Best Web Hosting Provider In India 2024

OTT Horror Movies: ఈ వారం ఓటీటీల్లో మూడు హారర్ చిత్రాలు.. ఒకటి డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Horror Movies: ఈ ఒక్క వారంలోనే ఓటీటీల్లో మూడు హారర్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఇందులో ఓ సినిమా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇస్తోంది. ఓ తెలుగు హారర్ కామెడీ చిత్రం కూడా రానుంది.

ఓటీటీల్లో కొత్త హారర్ చిత్రాలను చూడాలనుకునే వారికి ఈ వారం ఏకంగా మూడు ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మూడు హారర్ సినిమాలు ఈ ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. పక్కా హారర్ థ్రిల్లర్ మూవీ చోరీ 2 ఈ వారంలో నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది. ఓ తమిళ మూవీ తెలుగులోనూ రానుంది. ఓ తెలుగు హారర్ కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూడు హారర్ సినిమాలు ఏవంటే..
చోరీ 2
హిందీ నటి నుష్రత్ బరూచా ప్రధాన పాత్రలో చోరీ 2 సినిమా వస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ వారంలోనే ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు.
చోరీ 2 చిత్రం పక్కా హారర్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. అతీత శక్తులు, మూఢనమ్మకాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది. చోరీ 2 స్టోరీ బలంగా ఉంటుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నుష్రత్ చెప్పారు. ఈ మూవీలో సోహా అలీ ఖాన్, గష్మిర్ మహారజానీ, సౌరభ్ గోయల్ కీలకపాత్రలు పోషించారు. చోరీ 2 మూవీని ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
కింగ్‍స్టన్
తమిళ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా ‘కింగ్‍స్టన్’ ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ హారర్ మూవీ మార్చి 7న థియేటర్లలో రిలీజైన నిరాశపరిచింది. ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. సుమారు రూ.20కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.6కోట్ల కలెక్షన్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ కింగ్‍స్టన్ చిత్రాన్ని ఏప్రిల్ 13 నుంచి జీ5లో వీక్షించొచ్చు.
టుక్ టుక్
తెలుగు హారర్ కామెడీ సినిమా ‘టుక్ టుక్’ ఈ గురువారం ఏప్రిల్ 10వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. స్కూటర్‌లో దెయ్యం ఉండడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో హర్ష్ రోహణ్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన టుక్ టుక్ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. 20 రోజుల్లోగానే ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్