


Best Web Hosting Provider In India 2024
TG High Court: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు
TG High Court: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఖరారు చేసింది. ఐదుగురు నిందితులు మరణశిక్షను ధృవీకరించింది.
TG High Court: దిల్ సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు 2016లో ఎన్‌ఐఏ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, జియా ఉర్ రెహ్మాన్ , అజాజ్ షేక్, తహసిన్ భత్కల్‌లకు ఎన్‌ఐఏ హైకోర్టు గతంలోనే మరణశిక్ష విధించింది. తాజాగా కింద కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.
2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట బాంబు పేలుళ్లలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. 131మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సూత్రధారులుగా యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్‌లను ఎన్‌ఐఏ గుర్తించింది. ఏ1 రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడని ఎన్‌ఐఏ చెబుతోంది.
మిగిలిన నిందితుల్లో యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నాడని పేర్కొంది. అసదుల్లా అక్తర్, జియా ఉర్ రెహ్మాన్, ఎజాజ్ షేక్, తహసిన్ భత్కల్‌లకు మరణ శిక్ష ఖరారు చేవారు. జియా ఉర్ రెహ్మాన్ పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలోని భత్కళ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితులు దేశ వ్యాప్తంగా ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో అలజడి సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 4వేల పేజీలతో ఛార్జిషీట్ వేశారు. 2016లో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగా దానిని హైకోర్టులో సవాలు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు కోసం చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
నిందితులపై పలు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు.
వేర్వేరు కేసుల్లో విచారణ…
దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్ల ఘటనల్లో కీలక పాత్ర పోషించిన నలుగురు నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 2023లో పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2007 గోకుల్ ఛాట్స్ పేలుళ్లతో పాటు, దేశంలోని పలు నగరాల్లో జరిగిన పేలుళ్ల ఘటనలో నిందితుల ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది.
దేశంలోని పలు నగరాల్లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించడంతో పాటు పేలుళ్లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు అందజేసినందుకు నలుగురికి ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసింది.
శిక్షపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఒబైద్ ఉర్ రహ్మాన్, బిహార్‌లో దర్బంగకు చెందిన డానీష్ అన్సారీ, పూర్ణియా ప్రాంతానికి చెందిన అఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్ ఉన్నారు.
నిందితుల్లో అఫ్తాబ్ ఆలంకు రూ.10 వేలు, డానీష్ అన్సారీకి రూ.2 వేల జరిమానాను విధించింది. నిందితులు నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ సభ్యులైన రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్‌కు సన్నిహితులుగా కోర్టు నిర్దారించింది.
2006 మార్చిలో వారణాసిలో జరిగిన పేలుళ్లు, అదే ఏడాది జులైలో ముంబయిలో వరుస పేలుళ్లతో పాటు 2007లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఘటన, ఫైజాబాద్, లఖ్‌నవూ కోర్టుల్లో వరుస పేలుళ్లు, 2008లో జైపుర్, దిల్లీ, అహ్మదాబాద్‌లలో వరుస పేలుళ్లు, 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పేలుళ్లకు నిందితులు ఆయుధాలు, పేలుడు సామాగ్రి సరఫరా చేశారు.
2007, 2013 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లలో కూడా వీరిపాత్ర ఉందని తేల్చింది. లుంబినీ పార్కుతో పాటు గోకుల్‌చాట్ పేలుళ్లలో కూడా నిందితులు సహకరించినట్లు అభిప్రాయపడింది.
2013 జనవరి -మార్చి మధ్య కాలంలో నిందితులను అరెస్టు చేశారు. నలుగురితో పాటు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహ్మాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీతో పాటు మరో ఇద్దరిపై ఈ ఏడాది మార్చి 31న అభియోగాలు నమోదు చేశారు. వీరిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్