Best Web Hosting Provider In India 2024

AA22 Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ చిత్రంపై అధికారిక ప్రకటన.. ఊహించని జానర్‌లో.. స్పెషల్ వీడియో చూసేయండి
AA22 Allu Arjun – Atlee Movie: అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్పెషల్ వీడియోతో ఈ ప్రాజెక్టును మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన అప్‍డేట్ వచ్చేసింది. పుష్ప 2 భారీ సక్సస్ తర్వాత ఆయన నెక్స్ట్ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా(AA22 x A6)పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ 43వ పుట్టిన రోజు సందర్భంగా ఈ అదిరే అప్‍డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ స్పెషల్ వీడియో తీసుకొచ్చింది.
సైన్స్ ఫిక్షన్ జానర్‌లో.. స్పెషల్ వీడియో
అల్లు అర్జున్ – అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఓ స్పెషల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. అమెరికా లాస్ ఏంజిల్స్ సిటీలోని ప్రముఖ లోలా వీఎఫ్‍ఎక్స్ సంస్థ కార్యాలయంలో ఈ వీడియోను మూవీ టీమ్ షూట్ చేసింది. అల్లు అర్జున్, అట్లీ ఈ స్టూడియోలోకి వెళ్లి టెక్నిషియన్లతో మాట్లాడారు. స్టూడియోలోని వాటిని, వీఎఫ్ఎక్స్ పనులను పరిశీలించారు. అల్లు అర్జున్‍కు వీఎఫ్‍ఎక్స్ టెస్ట్ , 360 డిగ్రీ 3జీ స్కానింగ్ జరిగింది. ఏ22 స్క్రిప్ట్ అద్భుతమంటూ ఆ వీఎఫ్ఎక్స్ స్టూడియో టెక్నిషియన్ ఒకరు మాట్లాడారు. చాలా హైబడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు ఆ సంస్థ వీఎఫ్ఎక్స్ వర్క్ చేసింది.
ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే ఏఏ22 సినిమా సైన్స్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కనుందని అర్థమవుతోంది. ఈ జానర్ మూవీ చేయడం అట్లీకి ఇదే తొలిసారి. అలాగే, అల్లు అర్జున్‍కు కూడా ఇదే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ కానుంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ అనగానే యాక్షన్ మూవీ అనే అంచనాలు వచ్చాయి. ఊహించని విధంగా సైన్స్ ఫిక్షన్ సినిమా వీరి కాంబోలో రూపొందనుంది. భారీ బడ్జెట్‍తో రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రాజెక్ట్ పేరు.. ఏఏ22xఏ6
అల్లు అర్జున్‍కు 22వ సినిమా.. దర్శకుడిగా అట్లీకి 6 చిత్రం రావటంతో ఈ మూవీ ప్రాజెక్ట్ టైటిల్‍ను ఏఏ22 x ఏ6గా ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
గ్రాండ్ విజువల్స్ పక్కా! సూపర్ హీరోగా..
అల్లు అర్జున్ – అట్లీ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్లు, ఏలియన్స్ లాంటి జీవులు ఈ మూవీలో కనిపిస్తాయని టాక్ ఉంది. సూపర్ హీరోలా అల్లు అర్జున్ కనిపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ల్యాండ్ మార్క్ సినిమాటిక్ ఈవెంట్, మాగ్నమ్ ఓపస్ అంటూ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను సన్‍పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్లోబల్ రేంజ్‍ను మేకర్స్ టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది.
ఈ సినిమాకు తమిళ యంగ్ డైరెక్టర్ సాయి అభయంకర్ సంగీతం అందిస్తారని తెలుస్తోంది. సుమారు రూ.700కోట్ల బడ్జెట్‍ను ఈ మూవీ కోసం సన్ పిక్చర్స్ ఖర్చు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. నటీనటులు, ఇతర టెక్నిషియన్ల వివరాలు క్రమంగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తోనూ అల్లు అర్జున్ ఓ మూవీ చేయనున్నారు. మైథలాజికల్ చిత్రంగా ఉండనుంది. ఇది కూడా భారీ బడ్జెట్‍తోనే ఉండనుందని తెలుస్తోంది.