OTT Romantic Comedy: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బిగ్‌బాస్ బ్యూటీ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే

Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బిగ్‌బాస్ బ్యూటీ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే

Nelki Naresh HT Telugu
Published Apr 08, 2025 11:48 AM IST

OTT: బిగ్‌బాస్ బ్యూటీ ఆషురెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి మూవీ మంగ‌ళ‌వారం ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ప్ర‌వీణ్ రాజ్ కుమార్, శ‌శికా టిక్కూ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

రొమాంటిక్ కామెడీ మూవీ
రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Romantic Comedy: బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తెలుగు మూవీ ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ద్వారా ప్ర‌వీణ్ రాజ్ కుమార్, శ‌శికా టిక్కూ హీరోహీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సంజ‌య్ రెడ్డి బంగార‌పు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌…

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో మ‌ధునంద‌న్‌, భూపాల్ రాజ్‌, మ‌హేష్ విట్టా, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు.

సిటీలో జాబ్‌…

చ‌క్రి రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చి సిటీలో జాబ్ చేస్తుంటాడు. త‌మ ఊరికే చెందిన స‌త్య‌తో చ‌క్రికి చిన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంటుంది. స‌త్య‌కు సిటీలో జాబ్ రావ‌డానికి చ‌క్రి సాయం చేస్తాడు. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. స‌డెన్‌గా స‌త్య జాబ్ రిజైన్ చేసి ఊరికి వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ స‌త్య కూడా ప‌ల్లెటూరికి వ‌స్తాడు.

స‌త్య గురించి చ‌క్రికి ఎలాంటి నిజాలు తెలిశాయి? ఆ ఊరికే చెందిన స్కూల్ టీచ‌ర్ ప‌ద్మ తాగుబోతు అయిన కోటిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆ ఊరిపై ద్వేషంతో ర‌గిలిపోయే బ్యాంక్ మేనేజ‌ర్ ప్ర‌సాద్ క‌థేమిటి? స‌త్య ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం స‌త్య ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఉన్నా…

2024 జూన్ నెల‌లో ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఉన్నా క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఫెయిల్యూర్‌గా నిలిచింది.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 3తో…

సిటీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ల‌లో ద‌ర్శ‌కుడు సంజ‌య్ ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి సినిమాను తెర‌కెక్కించాడు. ఈ మూవీలో ఆషురెడ్డి గ‌త సినిమాల‌కు భిన్నంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. బిగ్‌బాస్ సీజ‌న్ 3తో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది ఆషురెడ్డి. 35వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఛ‌ల్ మోహ‌న రంగ‌, పీకే, ఏవ‌మ్‌, త్రిముఖ‌, ఫోక‌స్‌, స్పార్క్‌తో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. కొన్ని టీవీ షోస్‌, వెబ్‌సిరీస్‌ల‌లో మెరిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024