Bold Horror OTT: ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు బోల్డ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – వ‌ణికించే ట్విస్ట్‌ల‌తో

Best Web Hosting Provider In India 2024

Bold Horror OTT: ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు బోల్డ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – వ‌ణికించే ట్విస్ట్‌ల‌తో

Nelki Naresh HT Telugu
Published Apr 08, 2025 10:01 AM IST

Bold Horror OTT: తెలుగు బోల్డ్ హార‌ర్ మూవీ ఇంటి నెంబ‌ర్ 13 ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. సీనియ‌ర్ యాక్ట‌ర్ ఆనంద్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో న‌వీద్‌బాబు, శివాంగి మెహ్రా హీరోహీరోయిన్లుగా న‌టించారు.

హారర్ మూవీ
హారర్ మూవీ

Bold Horror OTT: టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ఆనంద్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బోల్డ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇంటి నెంబ‌ర్‌ 13 స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో ఈ హార‌ర్ మూవీ అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఈ తెలుగు మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఐఎమ్‌డీబీలో…

ఇంటి నెంబ‌ర్ 13 మూవీలో న‌వీద్‌బాబు, శివాంగి మెహ్రా హీరోహీరోయిన్లుగా న‌టించారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ర‌వివ‌ర్మ‌, స‌త్య కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చి 1న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను ఈ సినిమా 8 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. బోల్డ్ అంశాల‌కు హార‌ర్ ఎలిమెంట్స్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఇంటి నెంబ‌ర్ 13 మూవీ త‌మ‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించాడు. వినోద్ యాజ‌మాన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ర‌న్‌టైమ్ రెండు గంట‌ల కంటే త‌క్కువే.

ఇంటి నెంబ‌ర్ 13లో ఏం జ‌రిగింది…

అర్జున్ ఓ రైట‌ర్‌. అత‌డు రాసిన బుక్ ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా కాపీలు అమ్ముడుపోతుంది. ప‌బ్లిష‌ర్ అత‌డికి ఓ పాత‌కాలం నాటి విల్లాను గిఫ్ట్‌గా ఇస్తాడు. భార్య నిత్య‌, మ‌ర‌ద‌లు మ‌ధుతో క‌లిసి ఆ విల్లాలో అడుగుపెడ‌తాడు అర్జున్‌. ఆ విల్లాలో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి నిత్య వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెడుతుంది.

కొన్ని ఆకారాలు ఆమెను వెంటాడుతుంటాయి. అస‌లు నిత్య‌కు ఏమైంది? ఆ విల్లా గ‌తం గురించి సాగించిన అన్వేష‌ణ‌లో అర్జున్‌కు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? ఈ స‌మ‌స్య నుంచి నిత్యాను కాపాడిన గ‌జానంద్ ఎవ‌రు అన్న‌ది ఇంటి నంబ‌ర్ 13 మూవీలో హార‌ర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ద‌ర్శ‌కుడు చూపించాడు.

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా…

వీఎఫ్ఎక్స్ టెక్సీషియ‌న్ అయిన ప‌న్నా రాయ‌ల్ ఇంటి నంబ‌ర్ ప‌ద‌మూడు కంటే ముందు కాలింగ్‌బెల్‌, రాక్ష‌సి అనే సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సీనియ‌ర్ యాక్ట‌ర్ అయిన ఆనంద్ రాజ్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రెండు వంద‌ల‌కుపైగా సినిమాలు చేశాడు.

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తెలుగులో పెద‌రాయుడు, గ్యాంగ్‌లీడ‌ర్‌, శ‌త్రువు, సూర్య‌వంశం, శుభాకాంక్ష‌లు సినిమాలు ఆనంద్‌రాజ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. త‌మిళంలో బిజీ యాక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024