




Best Web Hosting Provider In India 2024

AP EdCET 2025: ఏపీ ఎడ్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, జూన్ 5న పరీక్ష
AP EdCET 2025: ఏపీ ఎడ్ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 16వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

AP EdCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎడ్ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మే 14వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2025 ఎడ్‌సెట్‌ను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నిర్వహిస్తుంది.
ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 5న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఏపీ ఎడ్ సెట్ ద్వారా బిఇడి, బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే రెండేళ్ల కోర్సులకు ఎడ్ సెట్ 2025 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎడ్ సెట్ 2025కు దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450 ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎడ్‌సెట్ 2025 ముఖ్యమైన తేదీలు…
ఎడ్ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 8నుంచి ప్రారంభం
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 14
రూ.1000 ఆలస్య రుసుముతో మే 15 నుంచి మే 19 వరకు..
రూ.2వేల ఆలస్య రుసుముతో మే 20 నుంచి మే 23 వరకు…
రూ.4వేల ఆలస్య రుసుముతో మే 24వ తేదీ నుంచి 26వరకు…
రూ.10వేల వరకు మే 27 నుంచి జూన్ 3 వరకు…
దరఖాస్తుల సవరణకు మే 24 నుంచి 28వరకు గడువు…
హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేయడానికి మే 30 నుంచి అవకాశం…
ఏపీ ఎడ్ సెట్ 2025 నిర్వహణ తేదీ జూన్ 6
ప్రాథమిక కీ విడుదలయ్యే తేదీ జూన్ 10
అభ్యంతరాల స్వీకరణకు గడువు జూన్ 13
ఎడ్ సెట్ 2025 ఫలితాల విడుదల జూన్ 21, 2025
సంబంధిత కథనం
టాపిక్