




Best Web Hosting Provider In India 2024

AC Temperature For Kids: పిల్లలను ఏసీ గదిలో పడుకోబెడుతున్నారా? ఈ 6 జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని తెలుసుకోండి!
AC Temperature For Kids: వేసవి వేడి నుంచి పిల్లలకు కాపాడటానికి ఏసీ గదిలో పడుకోబెడుతున్నారా? ఇలా చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వారి ఆరోగ్యానికి హాని కలుగుతుందిని తెలుసుకోండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏసీ ఉష్ణోగ్రత దుస్తుల వరకు తీసుకోవాల్సిన ముఖ్య 6 జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి.

వేసవి వేడి, ఉక్కపోత కారణంగా పిల్లలు చాలా చికాకుగా ఫీలవుతుంటారు. వేడి గాలులు, చెమట వారిని అయోమయానికి గురి చేస్తాయి. చాలా మంది పిల్లలు సరిగ్గా నిద్రపోవడం మానేస్తారు. ఇలాంటి సమయంలో వారిని రక్షించేది ఏసీలు, కూలర్లే. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఇప్పటికే ఇళ్లలో ఏసీలు, కూలర్లు వాడటం ప్రారంభించారు. ముఖ్యంగా ఏసీలు తీవ్రమైన వేడి నుండి చక్కటి ఉపశమనం కలిగిస్తాయి.
ఏసీ గదిలో పడుకొబ్టగానే పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఉక్కపోత, చెమట కారణంగా చికాకు లేకుండా చలాకీగా ఆడుకుంటారు. కేవలం పిల్లల కోసమే ఇంట్లో ఏసీ పెట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో తప్పు లేదనుకోండి. అయితే.. ఏసీ గదిలో పిల్లలను పడుకోబెట్టేటప్పుడు లేదా రోజంతా వారిని ఏసీ గదిలో ఉంచేటప్పడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లల శరీరం చాలా సున్నితమైనది, వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు కొన్ని ఉష్ణోగ్రత నుంచి దుస్తులు వరకూ కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దా రండి.
పిల్లలను ఏసీ గదిలో ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. ఉష్ణోగ్రత(Temperature):
పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే ఏసీ విషయంలో సరైన ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. ఏసీ గదిలో ఉష్ణోగ్రత 24-26°C మధ్య ఉండేాలా చూసుకోండి. ఈ ఉష్ణోగ్రతలో పిల్లలను ఉంచడం వల్ల వారికి చల్లగా హాయిగా ఉంటుంది. అలాగే చలి అనిపించదు. ఇంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో పిల్లలను ఉంచడం వల్ల వారికి చలిపుడుతుంది. ఎక్కువ ఉంచడం వల్ల ఏసీ ఉపయోగకరంగా ఉండదు.
2. గాలి నేరుగా తాకకుండా చూడండి ( Air Flow)
ఏసీ గాలి నేరుగా పిల్లలపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా చల్లటి గాలి నేరుగా శరీరంపై తాకడం వల్ల జలుబు, తలనొప్పి లేదా కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఏసీ గాలి దిశను సరిచేసి, గదిలో గాలి చలనం ఉండేలా చూడాలి.
3. హైడ్రేషటెడ్‌గా ఉంచండి(Hyderation)
ఏసీ గదిలో తేమ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో నీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి పిల్లలను ఏసీ గదిలో ఉంచుతున్నప్పుడు వారు ఎక్కువ నీరు, పండ్ల రసాలు వంటివి తాగేలా చూసుకోండి. క్రమం తప్పకుండా వారికి నీరు ఇవ్వండి.
4. గాలి ప్రసరణ (Air Circulation)
చాలా మంది ఏసీ గాలి బయటికి పోతుందనీ, రూం చల్లబడాలనీ ఇంట్లోని కిటీకీలు, తలుపులు అన్నీ మూసి ఉంచుతారు. నిజానికి ఇది సరైన పద్ధతి కాదు. ఏసీ పనిచేస్తున్నప్పటికీ గదిలో గాలి మార్పిడి ఉండటం అవసరం. గదిలోకి తాజా గాలి రావడానికి కిటికీ లేదా తలుపు కొంచెం తెరిచి ఉంచాలి. గదిలో గాలి బయటకు వెళ్లడం, బయటి గాలి లోనికి రావడం వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు రావు.
5. బట్టలను సరిగ్గా ఎంచుకోండి
పిల్లలను ఏసీ గాలిలో ఉంచే ముందు వారికి తేలికైన, కాటన్ బట్టలు వేయండి. ఈ రకమైన బట్టలు చర్మంలోకి గాలి వెళ్లేలా చేస్తాయి. ఇవి వారికి సౌకర్యవంతగా కూడా ఉంటాయి.
6. ఏసీ శుభ్రతను కాపాడండి
ఏసీ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఫిల్టర్‌లో ధూళి, బాక్టీరియా, పొడి తేమ వంటివి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. వీటిని శుభ్రం చేయకుండా ఉపయోగించడం పిల్లలలో శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. . కాబట్టి ఏసీ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం