




Best Web Hosting Provider In India 2024

Telugu Comedy OTT: ఓటీటీ ట్రెండింగ్‍లో తెలుగు నయా కామెడీ చిత్రం.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
OTT Comedy: 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా ఓటీటీలోకి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. నెలలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

యువ నటుడు అంకిత్ కొయ్య, శ్రీయా కొంతం హీరోహీరోయిన్లుగా నటించిన ‘14 డేస్ – గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ సినిమా ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. థియేటర్లలో అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ సక్సెస్ కాలేదు. అయితే, ఓటీటీలో ఈ 14 డేస్ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
ట్రెండింగ్‍లోకి..
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సినిమాల ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేసింది. ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 4) ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‍లోకి వచ్చింది లోబడ్జెట్ కామెడీ చిత్రం.
నాలుగు భాషల్లో..
14 డేస్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల ఆడియోల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ తర్వాత మంచి రెస్పాన్సే వస్తోంది.
14రోజులు గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో చిక్కుకుపోతే..
14డేస్ సినిమా రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీహర్ష. కామెడీ బాగా వర్కౌట్ అయింది. గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో అబ్బాయి చిక్కుకొని.. వారి కుటుంబ సభ్యులకు కనిపించకుండా పడే తంటాలు చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది.
14డేస్ చిత్రంలో అంకిత్, శ్రీయా, వెన్నెల కిశోర్‌తో పాటు ఇంద్రజ, లక్ష్మి సుజాత, నేహా కృష్ణ, ప్రశాంత్ శర్మ, సాయి సతీశ్, సాయి వినిత కీలకపాత్రలు పోషించారు. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం చిత్రాలతో బాగా పాపులర్ అయిన అంకిత్ ఈ 14డేస్ చిత్రంలోనూ తన కామెడీ టైమింగ్‍తో మెప్పించారు. ఈ ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. ఈ మూవీని సత్య కోమల్ ప్రొడ్యూజ్ చేశారు.
14డేస్ స్టోరీలైన్
సినీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న హర్ష (అంకిత్ కొయ్య)కు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవుతుంది ఆహాన (శ్రీయ కొంతం). ఇంట్లో వాళ్లు పెళ్లికి ఊరెళ్లడంతో హర్షను ఇంటికి పిలుస్తుంది అహాన. అయితే, అనుకోని పరిస్థితుల్లో అహాన ఇంట్లోనే హర్ష 14 రోజులు చిక్కుకుపోతాడు. ఆ సమయంలో హర్షకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడిని దాచేందుకు అహాన ఎలాంటి తిప్పలు పడింది? హర్ష బయటపడ్డాడా? చివరికి ఏమైంది? అనే విషాలు 14డేస్ సినిమాలో ఉంటాయి.
సంబంధిత కథనం