Karthika Deepam Today Episode April 8: జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టి నిలదీసిన పారు.. కుట్రను వినేసిన కావేరి

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode April 8: జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టి నిలదీసిన పారు.. కుట్రను వినేసిన కావేరి

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 08, 2025 07:36 AM IST

Karthika Deepam 2 Serial Today Episode April 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. గౌతమ్ విషయంలో ఏం చేసినా తనకు చెప్పాలని దీపతో మాట తీసుకుంటుంది కాంచన. సత్తిపండును కలిసి నిజం తెలుసుకుంటుంది పారిజాతం. జ్యోత్స్నను నిలదీస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam April 8 Today: జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టి నిలదీసిన పారు.. కుట్రను వినేసిన కావేరి.. జ్యో మరో ప్లాన్
Karthika Deepam April 8 Today: జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టి నిలదీసిన పారు.. కుట్రను వినేసిన కావేరి.. జ్యో మరో ప్లాన్

కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపకు గౌతమ్ వార్నింగ్ ఇచ్చి వెళతాడు. గౌతమ్ గురించి నువ్వు చెప్పినదంతా నిజమే దీప అని కాంచన అంటుంది. గౌతమ్ బలుపుతో వచ్చాడని, అందుకే బెదిరించాడని దీప అంటుంది. అవసరంగా ఆపావని దీప అంటే.. ఇప్పటికీ ఉన్న చెడ్డ పేరు చాలని అనసూయ చెబుతుంది. ఎక్కడో ఏదో జరుుతోందని, లేకపోతే గౌతమ్ వచ్చి దీపకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంచన అంచనా వేస్తుంది. తన పనికి దీప అడ్డుపడకుండా జాగ్రత్త పడుతున్నాడని అంటుంది.

మాట తీసుకున్న కాంచన

మీ నాన్న మనసు మార్చుకొని మనవరాలి పెళ్లి వీడితో చేయడు కదా అని సరిగ్గా ఊహిస్తుంది అనసూయ. ఇంత జరిగాక అలా చేయడని కాంచన అంటుంది. అలాకాకపోతే వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడని అనసూయ అంటుంది. అసలు గౌతమ్ ఎందుకు వచ్చినట్టు అని మనసులో అనుకుటుంది దీప. గౌతమ్ విషయంలో ఏం చేసినా ముందు తనకు చెప్పాలని దీపను అడుగుతుంది కాంచన. చెప్పకుండా చేస్తే నా మీద ఒట్టే అని అంటుంది. నా కోడలికి అన్యాయం జరగకూడదని అంటుంది. చేతిలో చేయి వేయించుకొని మాట తీసుకుంటుంది. గౌతమ్ విషయంలో చెప్పకుండా ఏం చేయనని మాటిస్తుంది దీప.

పారిజాతానికి అనుమానం

జ్యోత్స్న టెన్షన్‍గా ఉండగా.. పారిజాతం అక్కడి హుషారుగా వస్తుంది. షాపింగ్‍కు వెళదామని అడుగుతుంది. ఇంతలో దీపను బెదిరించేననేలా ఫినిష్ అని గౌతమ్ నుంచి జ్యోత్స్నకు మెసేజ్ వస్తుంది. దీంతో జ్యో నవ్వుతుంది. ఎలా రెచ్చగొడితే వెళ్లి దీప మీద పడతావో తెలుసు కదా అని మనసులో అనుకుంటుంది. కలుద్దామని గౌతమ్ మరో మెసేజ్ చేస్తాడు. నీలో ఉన్న వేరియేషన్లు చూడలేకున్నానని పారుజాతం అంటుంది. ఇప్పటి వరకు ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా ఉండి.. సడెన్‍గా మెసేజ్ రాగానే నవ్వావని, ఈ మార్పుకు కారణం ఏంటని అడుగుతుంది. ఫ్రెండ్ మెసేజ్ చేసిందని జ్యోత్స్న అబద్ధం చెబుతోంది. “నువ్వు ఏదో దాస్తున్నావ్. ఎంగేజ్‍మెంట్ ఆగిపోయిన తర్వాత గదిలో నిన్ను చూసినప్పుడే అనుమానం మొదలైంది. మరొకరి మీద అనుమానం మొదలైంది. దాన్ని తీర్చుకుంటే నీ మీద ఉన్న అనుమానం తీరుతుంది” అని అనుకుంటుంది పారిజాతం.

పారిజాతానికి నిజం చెప్పిన సత్తిపండు

స్వప్న భర్తను అంటూ నాటకం ఆడిన సత్తిపండును పారిజాతం కలుస్తుంది. నిజం చెప్పాలని అడుగుతుంది. రమ్య నా భార్యే, తన కడుపులోని బిడ్డకు తండ్రి నేనే అని మళ్లీ అబద్ధం చెబుతాడు సత్తిపండు. సుత్తి కొట్టొద్దని, రమ్య చేయి నొక్కి నువ్వు మాట్లాడినప్పుడే అనుమానించానని చెబుతుంది. దీంతో నిజం చెప్పడానికి రూ.20వేలు ఇస్తానంటూ డబ్బును సత్తిపండు చేతిలో పెడుతుంది.

అప్పటికి సత్తిపండు నిజం చెప్పకపోవడంతో.. మరింత డబ్బు చూపిస్తుంది పారిజాతం. దీంతో సత్తిపండు నిజం చెప్పేస్తాడు. “రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు.. రమ్య నా పెళ్లాం కాదు” అని పారిజాతానికి నిజం చెప్పేస్తాడు సత్తిపండు.

జ్యోత్స్ననే చెప్పమంది.. పారు షాక్

రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు సత్తిపండును పారిజాతం అడుగుతుంది. ఆ విషయం తనకు తెలియదని, తనకు చెప్పాలని అడిగిన వాటినే చెప్పానని సత్తిపండు అంటాడు. దీంతో ఎవరు చెప్పమన్నారు అని పారిజాతం అడుగుతుంది. ఇచ్చిన డబ్బుకు ఇంతే చెబుతానని సత్తిపండు అంతే.. మరో డబ్బు కట్ట ఇస్తుంది పారు. జ్యోత్స్ననే తనతో నాటకం ఆడించిందని సత్తిపండు చెప్పేస్తాడు. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. సత్తిపండు అక్కడి నుంచి వెళతాడు.

దీప చెప్పినట్టు రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమే తండ్రా అని పారిజాతం అనుమానిస్తుంది. “జ్యోత్స్నా.. ఈ నాటకాలు అన్నీ ఏంటో నీతోనే తేల్చుకుంటా” అని పారిజాతం అనుకుంటుంది.

రెస్టారెంట్‍లో కావేరి.. జ్యో, గౌతమ్ ఎంట్రీ

ఓ రెస్టారెంట్‍లో శ్రీధర్, కావేరి తింటుంటారు. కార్తీక్ రెస్టారెంట్ అయితే బాగుండేదని కావేరి అంటుంది. శ్రీధర్ కౌంటర్లు వేస్తుంటాడు. ఇద్దరూ వాదులాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫోన్ రావటంతో శ్రీధర్ పక్కకు వెళతాడు. ఇంతలో అదే రెస్టారెంట్‍లోకి గౌతమ్, జ్యోత్స్న కలిసి వస్తారు. వీళ్లదరికి పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, మళ్లీ కలిసి తిరుగుతున్నారేంటి అని కావేరి అనుకుంటుంది.

కావేరికి డౌట్

ఇంతలో కావేరి వెనుకే కూర్చుంటారు జ్యోత్స్న, గౌతమ్. దీపకు వార్నింగ్ ఇస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందనుకుంటున్నావా అని జ్యోత్స్న అంటే.. దీప మళ్లీ నా పర్సనల్ విషయాల్లోకి రాదని గౌతమ్ అంటాడు. వీళ్లేంటి దీప గురించి మాట్లాడుకుంటున్నారని, ఎంగేజ్‍మెంట్‍లో వీడిని కొట్టింది కదా అని కావేరి అనుమానిస్తుంది. మీ తాతతో పెళ్లి గురించి మాట్లాడానని, ముహూర్తాలు పెట్టాలని చెప్పానని గౌతమ్ అంటాడు. దీప అంత ఈజీగా వదిలిపెట్టదని జ్యో అంటుంది. నేను చాలా వైలైంట్, కానీ ఫ్యామిలీ డిస్ట్రబ్ అవకూడదని జస్ట్ వార్నింగ్ ఇచ్చానని గౌతమ్ అంటాడు. తప్పు చేశావా అని జ్యో.. అడితే లేదంటాడు గౌతమ్.

పారు రాకతో జ్యో కంగారు

పారిజాతం అదే రెస్టారెంట్‍కు వచ్చేస్తోంది. దీంతో గ్రానీ ఏంటి ఇక్కడికి వస్తోందని జ్యోత్స్న కంగారు పడుతుంది. కావేరి కూడా ఏంటి ఈవిడ వస్తోందని అనుకుంటుంది. గౌతమ్‍తో జ్యోత్స్న ఉన్న విషయాన్ని పారు చూసేస్తుంది. గౌతమ్ మళ్లీ మట్లాడదామని అతడిన పంపించేస్తుంది జ్యోత్స్న. పారిజాతాన్ని గౌతమ్ పలుకరిస్తాడు. నేను ఇక్కడున్నట్టు ఎలా తెలుసు అని జ్యో అడిగితే.. ఇంత కంటే పెద్ద విషయాలే తెలుసుకున్నానని పారిజాతం అంటుంది.

పారు మాటకు జ్యో షాక్

గౌతమ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా.. ఇప్పుడు నేరుగా వచ్చి ఎందుకు కలిశావని పారిజాతం ప్రశ్నిస్తుంది. పెళ్లి అనుకుంటున్నాం కదా అందుకే అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఈ పెళ్లి జరగనివ్వవు కదా అని పారిజాతం అంటుంది. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. “ఎందుకు అంటే.. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు గౌతమ్ గాడే కాబట్టి” అని పారు అంటుంది. దీంతో నిజం ఎలా తెలిసిందని జ్యో షాక్ అవుతుంది. ఈ మాటలు వింటున్న కావేరి కూడా అవాక్కవుతుంది. నిజం ఎలా తెలిసిందని ముఖంలో రంగులు మారాయా అని నవ్వుతుంది పారిజాతం.

సత్తిపండు చెప్పాడు.. నిలదీసిన పారిజాతం

ఈ విషయం నీకెలా తెలిసింది, రమ్య చెప్పిందా అని జ్యోత్స్న అడుగుతుంది. సత్తిపండు చెప్పాడని పారిజాతం అంటుంది. ఈ సత్తిపండు ఎవరబ్బా అని కావేరి అనుకుంటుంది. “రమ్యను గౌతమ్ మోసం చేశాడని దీప చెప్పిందంతా నిజమే. మరి నువ్వెందుకే అదేదో అబద్ధం అయినట్టు అంత బిల్డప్ ఇచ్చావ్. నీ ఎంగేజ్‍మెంట్ దీప చెడగొట్టిందా.. చెడగొట్టేలా నువ్వే చేశావా” అని పారిజాతం నిలదీస్తుంది. గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి ఎందుకు సైలెంట్‍గా ఉన్నావని అడుగుతుంది.

గౌతమ్ అంటే నీకు ఇష్టం లేదని నాకు అర్థమైందని, మరి వాడు పిలిస్తే ఎందుకు వచ్చావని జ్యోత్స్నను పారిజాతం ప్రశ్నిస్తుంది. గౌతమ్‍ను ఎందుకు కాపాడావని అంటుంది. నిజాలు చెప్పేందుకు పారిజాతాన్ని పక్కకు తీసుకెళుతుంది జ్యోత్స్న. ఏదో పెద్ద కుట్రే జరుగుతోంది, ఏదో తెలుసుకోవాలని కావేరి కూడా వారి మాటలు వినేందుకు వెళుతుంది. చాటుగా మాటలు వింటుంది.

పెళ్లిని దీపే ఆపుతుంది

గౌతమ్‍ను ఎందుకు కాపాడావని జ్యోను మళ్లీ అడుగుతుంది పారిజాతం. గౌతమ్ చెడ్డవాడని ప్రూవ్ అయితే దీప అందరి దృష్టిలో మంచిదవుతుందని, అది నాకు ఇష్టం లేదంటుంది జ్యోత్స్న. మరి ఈ పెళ్లి చేసుకుంటావా, ముహూర్తాలు పెడుతున్నారని పారు అంటే.. ఈ పెళ్లి జరగదని జ్యోత్స్న నమ్మకం చెబుతుంది. ఏం చేసినా ఈ పెళ్లి జరగదని అంటుంది. ఎలా ఆపుతావే అని పారు అడిగితే.. పెళ్లి ఆపేది నేను కాదు.. దీప అని జ్యోత్స్న అంటుంది. దీప ఎలా ఆపుతుందని పారు అడుగుతుంది. అది తెలియాలంటే ఈ ఆట ఎలా మొదలైందో తెలియాలని జ్యో అంటుంది.

అందుకే అలా చేశా.. వినేసిన కావేరి

రమ్యను మోసం చేసి బెదిరిస్తుంటే దీప నిలదీసిన విషయాన్ని చెబుతుంది. అప్పుడే తాను గౌతమ్ ఇంటికి వెళ్లి అదంతా చూశానని అంటుంది. “ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోతే నేను దోషి అవుతాను. పెళ్లికి ఒప్పుకున్నాక దీప ద్వారా ఆగిపోతే దీప చెడ్డవి అవుతుంది. నా మీద సంపతీ వస్తుంది. దీపను ఇరికించేలానే వాళ్లకు క్యాటరింగ్ ఇచ్చి.. ఎంగేజ్‍మెంట్‍కు వచ్చేలా చేశా. ఎంగేజ్‍మెంట్‍ను దీప ఆపుతుందని నాకు తెలుసు. ఆ తర్వాత రమ్యను తీసుకొచ్చి తాను చేసింది తప్పు కాదని ప్రూవ్ చేసేందుకు చూసింది. మన ఇంట్లో దీపను మరింత చెడ్డదాన్ని చేసేందుకు మరో ఛాన్స్ దక్కింది. దాన్ని వాడుకున్నా” అని జ్యోత్స్న అంటుంది. ఈ మాటలన్నింటినీ కావేరి వింటూనే ఉంటుంది.

బావ కోసమే..

ఇందతా దేని కోసమే అని పారిజాతం అడుగుతుంది. బావ కోసం అని జ్యోత్స్న అంటుంది. దీంతో పారు షాక్ అవుతుంది. “జ్యోత్స్న బతికితే కార్తీక్ భార్యగానే బతుకుతుంది. చచ్చినా కార్తీక్ భార్యగానే చస్తుంది. మరొకరికి నా జీవితంలో చోటు లేదు గ్రానీ” అని జ్యో అంటుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని పారు కంగారు పడుతుంది. ఇప్పుడు జరిగే దాని వల్ల నష్టం నాకు కాదు.. దీపకు అని జ్యో అంటుంది.

మరో ప్లాన్.. బావకు కూడా దీప దూరమవుతుంది

పెళ్లి ఎలా ఆగుతుందని పారిజాతం అడుగుతుంది. దానికి నా వద్ద మరో ప్లాన్ ఉందని జ్యో చెబుతుంది. దీపతోనే పెళ్లి ఆగిపోయేలా చేస్తా. ఆ దెబ్బతో మన ఇంటికే కాదు. బావకు కూడా దీప దూరమవుతుంది” అని జ్యో అంటుంది. ఆ ప్లాన్ అంటే అని పారిజాతం అడిగితే.. సారీ గ్రానీ నేను ఎవరికీ ఆ ప్లాన్ చెప్పను అంటుంది జ్యో. బావ జీవితంలో దీప, శౌర్య ఉండకూడదని, అదే తన లక్ష్యమని చెబుతుంది.

దీపతో చెప్పేయాలి

ఇదంతా నేను ఆడుతున్న నాటకం అని దీపకు తెలియదు, నిశ్చితార్థం ఆపినట్టే పెళ్లికూడా ఆపుతుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప ఏమవుతుందో నేను చెప్పను అని చెబుతుంది. నువ్వు ఇలాంటి ఆడదానివా, వింటుంటేనే భయమేస్తోంది కదా అని కావేరి ఆశ్చర్యపోతుంది. బావ జీవితంలో దీపను ఎంతో కాలం ఉండనివ్వనని జ్యో అంటుంది. దీపను, బావను వేరే చేసేందుకే ఈ పెళ్లి ముహూర్తాలు అని జ్యో అంటుంది. ఈ విషయాన్నీ వెంటనే దీపతో చెప్పాలని అక్కడి నుంచి వెళుతుంది కావేరి.

“శత్రువుకు ఎదురెళ్లి గెలవలేనప్పుడు వెన్నుపోటు పొడవాల్సిందే గ్రానీ. ఆట మధ్యలో ఉంది. పూర్తి చేయనివ్వు” అని జ్యో అంటుంది. ఇవన్నీ ఇంట్లో తెలిస్తే అని కంగారు పడుతుంది పారిజాతం. తెలిసేలోపు దీప అనే మనిషే ఉండదు అని కసిగా అంటుంది జ్యోత్స్న. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 8) ముగిసింది. జ్యో కుట్ర గురించి కావేరి చెబితే దీప ఏం చేస్తుందో చూడాలి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024