




Best Web Hosting Provider In India 2024

Heat Wave Remedies: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వడదెబ్బ నుంచి తప్పంచుకోవడం ఎలాగో తెలుసుకోండి, ఇది IMD హెచ్చరిక!
Heat Wave Remedies: ఇండియన్ మీటెరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ నుండి రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం రండి.

ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి, వేడి తీవ్రత కూడా పెరుగుతోంది. ఇండియన్ మీటెరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం రానున్న రోజుల్లో ఢీల్లీలో ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఎండీ అంచనాల ప్రకారం.. భారతేదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడ ఈ ఏడాది భారీ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్లు, ఏప్రిల్ నుండి జూన్ వరకు వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయట. దీని వలన వేడి మరింత పెరగవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలు వేడి తాపానికి అనారోగ్యం పాలవచ్చు.
రానున్న రోజుల్లో వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని IMD ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ, వేడి కారణంగా తలెత్తే ఇతర సమస్య నుండి రక్షించుకోవడానికి ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఇండియన్ మీటెరాలాజికల్ డిపార్ట్‌మెంట్ సూచనల మేరు వేడి కారణంగా వచ్చే సమస్యలు, వడదెబ్బ నుంచి తప్పంచుకోవడంయ కోసం కొన్ని ఇంటి చిట్కాలు మీరు చాలా బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకోండి.
IMD జారీ చేసిన హెచ్చరికలు
IMD జారీ చేసిన యెల్లో అలర్ట్ ప్రకారం.. రానున్న రోజుల్లో పిల్లలు, వృద్ధులు వేడి నుండి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించింది. ఉదాహరణకు తేలికపాటి రంగుల డ్రెస్సులు ధరించడం, తలను కాటన్ వస్త్రంతో కప్పడం, బయటకు వెళ్ళేటప్పుడు టోపీ లేదా ఛత్రం వాడటం, అనవసరంగా బయటకు వెళ్ళకుండా ఉండటం, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు. మరిన్ని సూచనలేంటంటే..
వేడి నుండి రక్షించుకోవడానికి ఇంటి చికిత్సలు:
నిమ్మరసం
వేసవిలో వచ్చే వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం నిమ్మరసం చాలా బాగా పని చేస్తుంది. కుండలోని నీటితో నిమ్మరసం తయారు చేసుకుని ఒక్కో గ్లాసు చొప్పు రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ల లోపాన్ని పూడ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉల్లి రసం
ఉల్లి రసం శరీరంలో వేడిని తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. ఇది వేసవి వేడిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వేడికి సంబంధించిన అలసటను తగ్గిస్తుంది. వేసవిలో నీటి లోపం కారణంగా డీహైడ్రేషన్ జరుగుతుంది. ఉల్లి రసం తాగడం వల్ల శరీరానికి తగినంత నీరు అందుతుంది, తద్వారా చర్మం తేమగా ఉంటుంది. ఒక చిన్న ఉల్లిపాయ రసాన్ని తీసి నెత్తి మీద రాసుకోవగడం వల్ల కూడా శరీరం చల్లదనానికి గురవుతుంది.
మజ్జిగ
వేసవిలో మజ్జిగ తాగడం శరీరాన్ని చల్లగా ఉంచి డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్ణం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో శక్తిని కాపాడుతుంది. వేడితో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ మజ్జిగ తాగడం చర్మాన్ని కూడా తేమగా ఉంచుతుంది.
పుదీనా నీరు
పుదీనా నీరు తాగడం శరీరాన్ని చల్లగా ఉంచి వేడితో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పుదీనాలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శ్వాసను తాజాగా ఉంచుతాయి. వేడి కారణంగా వచ్చే తలనొప్పి, వికారం, మైకం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో హైడ్రేషన్‌ను మెరుగుపరచి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
కొబ్బరి నీరు
వేసవిలో కొబ్బరి నీరు తాగడం శరీరాన్ని చల్లగా ఉంచి డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. పొటాషియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీరు శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు అసౌకర్యం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచి వేసవి వేడిలో శరీరానికి తక్షణ ఉపశమనం ఇచ్చే సహజ పానీయం ఇది.
తగినంత నీరు త్రాగాలి
శరీరంలో నీటి లోపాన్ని తీర్చడానికి రోజంతా తగినంత నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
సోంపు నీరు
వేసవిలో సోంపు నీరు తాగడం శరీరాన్ని చల్లగా ఉంచి వేడి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్ణం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. సోంపులోని ఆంటీ ఆక్సిడెంట్లు శరీర డీటాక్సిఫికేషన్‌లో సహాయపడతాయి. తలనొప్పి, వికారం వంటి వాటిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ రాత్రి ఒక టీస్పూన్ సోంపును నీటిలో నానబెట్టి ఉదయాన్నే వడకట్టి త్రాగాలి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం