




Best Web Hosting Provider In India 2024

OTT Suspense Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. భయపెట్టేలా ట్విస్టులతో..
OTT Suspense Horror Thriller: ఖౌఫ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఓ పోస్టర్ కూడా రివీల్ అయింది.

ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ జానర్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. బాగా వ్యూస్ దక్కుతాయి. అందుకే ఈ జానర్ కంటెంట్‍ను ప్లాట్‍ఫామ్‍లు వరుసగా తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలో ‘ఖౌఫ్’ అనే వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో మోనికా పవర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ నేడు అధికారికంగా వెల్లడైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఖౌఫ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (ఏప్రిల్ 8) అధికారికంగా వెల్లడించింది. “కొన్ని గదుల్లో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ దీంట్లో భయం ఉంటుంది. ప్రైమ్‍లో ఏప్రిల్ 18 నుంచి కౌఫిర్” అని అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఖౌఫ్ సిరీస్‍కు స్మితా సింగ్ కథను అందించటంతో పాటు షోరన్నర్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‍కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. మోనిక పవర్‌తో పాటు రజత్ కపూర్, అభిషేక్ చౌహాన్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా ఈ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు.
గదిలో భయం..భయం
ఖౌఫ్ వెబ్ సిరీస్ మధు (మోనిక పన్వర్) అనే అమ్మాయి చుట్టూ సాగుతుంది. తన గతాన్ని మరిచిపోయేందుకు కొత్త సిటీకి మధు వస్తుంది. ఓ హస్టల్‍లో చేరుతుంది. ఆ హస్టర్ ఉండే భవనానికి ఓ భయానక చరిత్ర ఉంటుంది. దీంతో ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ హాస్టల్ రూమ్‍లో మధుకు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏదో అతీత శక్తి వేధిస్తూ ఉంటుంది. జీవితం పీడకలలా మారుతుంది. ఈ మిస్టరీ ఏంటి? మధుకే ఎందుకు ఇలా జరిగింది? ఆమె గతమేంటి? చివరికి తప్పించుకుందా? అనే విషయాలు ఖౌఫ్ సిరీస్‍లో ఉంటాయి. భయపెట్టేలా పక్కా హారర్ థ్రిల్లర్ సిరీస్‍గా ఇది రూపొందింది.
ఖౌఫ్ సిరీస్‍ను మాచ్‍బాక్స్ షాట్స్ పతాకంపై సంజయ్ రౌట్రే, సరితా పాటిల్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా ఉండనుంది. ఏప్రిల్ 18 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ హారర్ వెబ్ సిరీస్‍ను చూడొచ్చు.
ఈ వారమే ‘చోరీ 2’
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ వారమే చోరీ 2 సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సీక్వెల్ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం