


Best Web Hosting Provider In India 2024
Jagan in Raptadu : ఉద్యోగాలు లేకుండా చేస్తాం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్!
Jagan in Raptadu : ఏపీ పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేరాలు చేసేవారికి కొందరు పోలీస్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మృతుడు లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదన్న జగన్.. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతాం.. ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
బలం లేకున్నా పోటీ..
‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. హింసను ప్రోత్సహిస్తున్నారు. బలం లేకున్నా ఎన్నికలు నెగ్గాలని.. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా. అధికారంలో ఉంటే అన్ని పదవులు వారికే కావాలి అన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులను వాచ్‌మెన్‌లగా హీనంగా వాడుకుంటున్నారు’ అని జగన్ ఆరోపించారు.
రామగిరి ఎస్సైపై ఫైర్..
‘రామగిరి మండలంలో వైసీపీ తరఫున 9 మంది ఎంపీటీసీలు గెలిచారు. టీడీపీ నుంచి ఒకే ఎంపీటీసీ ఉన్నారు. ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తే.. ఒకే ఎంపీటీసి ఉన్న టీడీపీ ఎలా పోటీ చేస్తుంది. ఎన్నిక సమయంలో కోర్టు ఆదేశాలు ఉన్నా.. పోలీసులు సరిగా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. రామగిరి ఎస్సై తన ఫోన్ నుంచి ఇక్కడి ఎమ్మెల్యే, వాళ్ల అబ్బాయికి వీడియో కాల్ చేసి మాట్లాడించాడు. వాళ్లు బెదిరించారు. ప్రలోభాలకు గురిచేశారు. అయినా వైసీపీ సభ్యులు లొంగలేదు’ అని వైసీపీ చీఫ్ వివరించారు.
బీహార్ కంటే దారుణంగా..
‘బీహార్ కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైంది. 20 మంది వచ్చి దాడి చేస్తే.. పోలీసులు కేవలం ఇద్దరి మీద కేసులు పెట్టారు. ఈ హత్యలో క్రీయాశీలకంగా వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే బంధువులు ఈ దాడిలో ఉన్నారు. వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు. వారందర్నీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యలను ప్రోత్సహించే ఎమ్మెల్యే, వాళ్ల అబ్బాయి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని జగన్ వివరించారు.
ఎవరి కోసం పనిచేస్తున్నారు..
‘రామగిరి ఎస్సై సుధాకర్ బెదింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అతని కాల్ డేటా ఎందుకు తీయడం లేదు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా.. టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా. ఎన్నికలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు కల్పించాల్సిన పోలీసులు.. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ.. వైసీపీ ఎంపీటీసీలను బెదిరిస్తున్నారు. మా వారిని కాపాడుకోవడానికి వెళ్లిన ఉషమ్మ, ప్రకాశ్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు. ఇదేం న్యాయం’ అని జగన్ ప్రశ్నించారు.
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన లింగమయ్య ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లెకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్