




Best Web Hosting Provider In India 2024

Anthology OTT: నాలుగు కథలతో తెలుగు ఆంథాలజీ మూవీ -ఏడాదిన్నర తర్వాత ఓటీటీలో రిలీజ్ -ట్విస్ట్‌లు, టర్న్‌లతో థ్రిల్
Anthology OTT: తెలుగు ఆంథాలజీ మూవీ మూడో కన్ను ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సాయికుమార్, మాధవీలత, దేవీప్రసాద్, నిరోషా కీలక పాత్రలు పోషించారు.

తెలుగు అంథాలజీ మూవీ మూడో కన్ను థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్‌తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నలుగురు దర్శకులు…
మూడో కన్ను మూవీలో సాయికుమార్, శశిధర్, మాధవీలత, నిరోషా, దేవీప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఈ అంథాలజీ మూవీకి మావిటి సాయిసురేంద్రబాబు, డాక్టర్ కృష్ణమోహన్, బ్రహ్మయ్య ఆచార్య, రాంబాబు దర్శకత్వం వహించారు.
స్క్రీన్‌ప్లే టెక్నిక్…
నాలుగు కథలతో హైపర్ లింక్ అనే స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మూడో కన్ను మూవీ తెరకెక్కింది. గత ఏడాది జనవరిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. కానీ కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
మూడో కన్ను మూవీ కథ ఏంటంటే?
ఓ ఫ్యామిలీ పెంపుడు కుక్క ఓ రోజు చనిపోతుంది. ఆ షాక్‌లో ఉండగానే హీరో తల్లి కన్నుమూస్తుంది. ఈ సీరియల్ మర్డర్స్ వెనకున్నది ఎవరన్నది మొదటి కథ.
కృత్రమంగా మాంసాన్ని తయారు చేసే ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత రోజే ఆ ఫార్ములాతో పాటు దానికి సంబంధించిన సీడీ కూడా మిస్సవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మరో కథ.
ఓ పెద్ద క్రైమ్ సాక్షిగా ఓ చిన్నపిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లాడి ద్వారా నేరస్తుడిని ఊహా చిత్రాన్ని గీయాలని పోలీసులు అనుకుంటారు? ఆ క్రైమ్‌కు పిల్లాడికి ఉన్న సంబంధం ఏమిటన్నది మరో కథ.
ఈ మూడు కథలను కలుపుతూ నాలుగో కథ సాగుతుంది. నాలుగో కథ మొత్తం ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుంది.
రన్‌టైమ్ ఎంతంటే?
యథార్థ ఘటనల ఆధారంగా దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8 రేటింగ్ దక్కించుకున్నది. ఈ సినిమా రన్‌టైమ్ గంట నలభై నిమిషాలే కావడం గమనార్హం. ఈ సినిమాకు కథ, డైలాగ్స్ రాజమహి అందించగా, స్వర మ్యూజిక్ సమకూర్చాడు.
సంబంధిత కథనం