




Best Web Hosting Provider In India 2024

Best Thriller Movies on Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలోతెలుగులో ఉన్న టాప్ 7 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఇవే
Best Thrillers on Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో కొన్ని తెలుగు కాగా.. మరికొన్ని డబ్బింగ్ చేసినవి కావడం విశేషం. మరి వీటిలో బెస్ట్ ఏవో ఒకసారి చూద్దాం.

Best Thrillers on Jiohotstar: థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలుసు కదా. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియోహాట్‌స్టార్ లోనూ ఇలాంటి థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏవో తెలుసుకోండి.
కిష్కింధ కాండం
మలయాళం మూవీ కిష్కింధ కాండం గతేడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి. ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా ఓ మిస్సయిన గన్ చుట్టూ తిరుగుతుంది. అయితే గన్ మిస్ కావడం కాదు.. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఈ మూవీలో అసలు ట్విస్ట్. తెలుగులోనూ ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
మంగళవారం
ఓ ఊళ్లో వరుస చావులు, దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకునే ఓ పోలీస్ అధికారి చుట్టూ తిరిగే కథే ఈ మంగళవారం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించింది. జియోహాట్‌స్టార్ లో ఉన్న ఓ మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీ ఇది.
సూక్ష్మదర్శిని
సూక్ష్మదర్శిని కూడా ఓ సూపర్ హిట్ మలయాళం థ్రిల్లర్ మూవీ. బేసిల్ జోసెఫ్, నజ్రియా నటించిన ఈ మూవీ.. ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కామెడీతోపాటు అక్కడక్కడా ఈ సినిమా పంచే థ్రిల్స్ బాగుంటాయి. ఈ ఏడాది జనవరిలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్ సాధించింది.
పొన్‌మ్యాన్
పొన్‌మ్యాన్ ఓ మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇందులోనూ బేసిల్ జోసెఫే నటించాడు. పెళ్లిళ్లలో వధువు కుటుంబానికి బంగారు నగలు ఇచ్చి తర్వాత వచ్చిన చదివింపుల డబ్బు తీసుకునే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. అలా ఓ కుటుంబానికి ఇచ్చిన 25 సవర్ల బంగారానికి సరిపడా డబ్బులు అతనికి తిరిగి రావు. మరి అతడు ఆ బంగారాన్ని తిరిగి ఎలా వసూలు చేశాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
మంజుమ్మెల్ బాయ్స్
మంజుమ్మెల్ బాయ్స్ ఓ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో ఉంది. తాజాగా వచ్చిన ఎల్2: ఎంపురాన్ కంటే ముందు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ ఇది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
రిపీట్
రిపీట్ ఓ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది ఓ మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే కథ. అచ్చూ ఓ నవలలో ఉన్నట్లుగానే ఈ కేసు ఉంటుంది. దీనిని ఛేదించడం పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కుమార్ కు సవాలుగా మారుతుంది. మంచి థ్రిల్ పంచే మూవీ ఈ రిపీట్.
మా ఊరి పొలిమేర
తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి ఈ మా ఊరి పొలిమేర. ఓ ఊళ్లో జరిగే చేతబడులు, తన సోదరుడి హత్యకు న్యాయం కోసం పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. తొలి భాగం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం