




Best Web Hosting Provider In India 2024

Payal Rajput Father: స్టార్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్.. అయినా షూటింగ్‌లకి..
Payal Rajput Father: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయం చెబుతూ ఆమె మంగళవారం (ఏప్రిల్ 8) ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Payal Rajput Father: తెలుగులో ఆర్ఎక్స్ 100, మంగళవారంలాంటి సినిమాలతో పాపులర్ అయిన నటి పాయల్ రాజ్‌పుత్. తాజాగా తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారంటూ ఆమె ఓ పోస్ట్ చేసింది. మంగళవారం (ఏప్రిల్ 8) నుంచే కీమోథెరపీ కూడా ప్రారంభించినట్లు చెప్పింది. ఈ క్లిష్ట సమయంలో అందరి మద్దతు తనకు కావాలని కోరింది.
పాయల్ రాజ్‌పుత్ తండ్రికి క్యాన్సర్
పాయల్ రాజ్‌పుత్ తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమెనే తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి ఆయనను బయటపడేయడానికి కిమ్స్ లో చికిత్స మొదలుపెట్టినట్లు కూడా చెప్పింది. అయితే ఇది తనను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నట్లు కూడా పాయల్ తెలిపింది. మంగళవారం (ఏప్రిల్ 8) ఆమె చేసిన ఓ సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
“అందరికీ నమస్కారం, మా నాన్న ఈ మధ్యే అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించాలని మేము నిర్ణయించాం. ఇవాళ తొలి కీమో థెరపీ సెషన్ ఉంది. రాబోయే కఠినమైన ప్రయాణాన్ని తలచుకుంటే నాకు కాస్త భయంగా ఉంది. కానీ ఇది తప్పదు కదా.
మా నాన్న చాలా స్ట్రాంగ్. కోలుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ చాలెంజింగ్ సమయంలోనూ నేను నా పనిపై దృష్టి సారించాలని మా నాన్న చెబుతున్నారు. ఈ క్లిష్ట ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నాను. మీ ప్రేమ, మద్దతు, పాజిటివ్ వైబ్స్ నాకు ఇప్పుడు ఎంతో అవసరం. ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాం. క్యాన్సర్ పై పోరాడే క్రమంలో ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అవసరం” అని పాయల్ పోస్ట్ చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
ఈ పోస్ట్ చివర్లో తన తండ్రి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. పాయల్ షేర్ చేసిన ఈ పోస్టుపై చాలా మంది అభిమానులు స్పందించారు. సిమ్రత్ కౌర్, రాయ్ లక్ష్మిలాంటి సెలబ్రిటీలు కూడా పాయల్ తండ్రి త్వరగా కోలుకువాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా ఉంటామని, ఆయన కోలుకుంటారంటూ పాయల్ కు ధైర్యం చెప్పారు.
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ తమిళంలో రెండు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తమిళంలో గోల్‌మాల్, ఏంజిల్.. తెలుగులో కిరాతక సినిమాల్లో ఆమె నటిస్తోంది. చివరిగా ఆమె గతేడాది వచ్చిన రక్షణ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.
సంబంధిత కథనం