




Best Web Hosting Provider In India 2024

Moong dal Namkeen: మూంగ్ దాల్ బయట కొంటున్నారా? ఇంట్లోనే ఇలా సులువుగా చేసేయొచ్చు
Moong dal Namkeen: పిల్లలకు మూంగ్ దాల్ అంటే చాలా ఇష్టం. మూంగ్ దాల్ రెసిపీ ఎంతో సులువు. దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకోండి.

మూంగ్ దాల్ చూస్తే చాలు తినాలన్న కోరిక పుడుతుంది. క్రిస్పీగా ఉండే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. నిజానికి మూంగ్ దాల్ కొనుక్కోవలసిన అవసరం లేదు. పెసరపప్పు ఇంట్లో ఉంటే చాలు వాటిని సులువుగా చేసేయొచ్చు. శుచిగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. మూంగ్ దాల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయితే మీ ఇంట్లో టేస్టీ మూంగ్ దాల్ స్నాక్ రెడీ అయిపోతుంది.
మూంగ్ దాల్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు – ఒక కప్పు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
బేకింగ్ సోడా – పావు స్పూను
మూంగ్ దాల్ రెసిపీ
1. స్నాక్స్ చేయడానికి మీరు పెసరపప్పును ఎంపిక చేసుకోవాలి.
2. పెద్దపెద్ద బద్దలు ఉన్న పెసరపప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టాలి.
3. అందులోనే బేకింగ్ సోడా వేసి బాగా కలిపి రాత్రంతా వదిలేయాలి.
4. ఉదయం లేచాక ఆ పప్పును వడకట్టి నీళ్లు పడేయాలి.
5. నానిపోయిన పెసరపప్పును ఒక క్లాత్ పై పరిచి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టాలి.
6. కాస్త తడి పొడిగా పెసరపప్పు ఎండుతుంది.
7. అప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి నూనెను వేయాలి.
8. నూనె బాగా వేడెక్కాక ఈ పెసరపప్పును అందులో వేసి వేయించాలి.
9. అది మాడిపోక ముందే తీసి ఒకటి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి.
10. ఇలా పప్పు మొత్తం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
11. టిష్యూ పేపర్ అందులోని అదనపు నిపుణులను పీల్చేస్తుంది.
12. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును ఈ పప్పుపై జల్లి బాగా కలుపుకోవాలి.
13. అంతే టేస్టీ మూంగ్ దాల్ స్నాక్ రెడీ అయినట్టే. దీన్ని బయటకొనే కన్నా ఇంట్లోనే ఇలా చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పప్పు రెడీ అవుతుంది.
పిల్లలు క్రిస్పీగా, క్రంచీగా ఉండే స్నాక్స్ ని అధికంగా ఇష్టపడతారు కాబట్టి మూంగ్ దాల్ మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ మేము చాలా సులువైన పద్ధతి చెప్పాము. పెసరపప్పు ఒక కిలో తెచ్చుకుంటే చాలు మీకు పిల్లలకు ప్రతిరోజు స్నాక్స్ గా వీటిని ఇవ్వవచ్చు. వారికి కూడా ఇది ఎంతో బాగా నచ్చుతుంది.
సంబంధిత కథనం