




Best Web Hosting Provider In India 2024

Hydra Commissioner : మచ్చబొల్లారం పరిధిలో స్మశానవాటిక కబ్జాపై ఫిర్యాదులు, రంగంలోకి హైడ్రా కమిషనర్
Hydra Commissioner : సికింద్రాబాద్ జోన్ పరిధిలోని మచ్చబొల్లారం మోతుకుల కుంట హిందూ స్మశానవాటిక కబ్జాకు గురైందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మచ్చబొల్లారంలో పర్యటించారు. రామ్ కీ సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రయించినట్లు ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ తెలిపారు.

Hydra Commissioner : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారం మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశానవాటికను మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. హిందూ స్మశాన వాటికను రామ్‌కీ సంస్థ కబ్జాచేసి.. అందులో చెత్త డంపింగ్ చేయడంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్వే నంబరు 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలాన్ని హిందూ స్మశానవాటికకు కేటాయించగా.. ఆ స్థలంలో రామ్‌కీ సంస్థ చెత్త డంపింగ్ చేయడాన్ని , అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులతో కలిసి కమిషనర్ రంగనాథ్ పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్దయెత్తున వచ్చి కమిషనర్‌కు సమస్యలను వివరించారు. ఈ విషయంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి మంత్రి శ్రీధర్ బాబు చెప్పారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
తక్షణమే నిర్మాణాలు ఆపేయాలని ఆదేశాలు
“రామ్‌కీ సంస్థకు ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందని.. అయితే ఇక్కడున్న ప్రభుత్వ భూమి మూడు నాలుగు ఎకరాల వరకూ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాం. తక్షణమే నిర్మాణాలను ఆపేయాలని రామ్‌కీ సంస్థను ఆదేశించాం. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తాం. అలాగే జనావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డును నిర్వహిస్తుండడంతో ఇబ్బందికర పరిస్ఙితులను గమనించాం” – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. దుర్గంధంతో.. ఇబ్బందులు పడుతున్నామని తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి.. చెత్త డంపింగ్ యార్డును పరిశీలించిన కమిషనర్‌ను స్థానికులు అభినందించారు.
సంబంధిత కథనం
టాపిక్