Facial steaming Benefits: స్టీమ్ ఫేషియల్ చేశారంటే ఇంట్లోనే పార్లర్ లాంటి గ్లో పొందచ్చు, ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Best Web Hosting Provider In India 2024

Facial steaming Benefits: స్టీమ్ ఫేషియల్ చేశారంటే ఇంట్లోనే పార్లర్ లాంటి గ్లో పొందచ్చు, ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Ramya Sri Marka HT Telugu
Published Apr 08, 2025 08:30 PM IST

Facial steaming Benefits: డబ్బులు ఖర్చు చేయకుండానే పార్లర్ లాంటి మెరుపును పొందాలనుకుంటున్నారా? ఇందుకు స్టీమ్ ఫేషియల్ బెస్ట్ అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఇది చర్మాన్నిఆరోగ్యంగా మార్చి సహజంగా మెరిసేలా చేస్తుంది. స్టీమ్ ఫేసియల్ ఎలా చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

స్టీమ్ ఫేషియల్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
స్టీమ్ ఫేషియల్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి (freepik)

అందమైన, మెరిసే చర్మం కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బయటికి చెప్పుకోకపోయినా ఇది అందరి కల. కానీ కొద్దిమందికి మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది. చాలా మంది మహిళలు అందంగా, ఆకర్షనీయంగా కనిపించడం కోసం పార్లర్లలో ఖరీదైన ఫేషియల్స్ చేయించుకుంటారు. రకరకాల క్రీములు, లోషన్లు వాడతారు. కానీ కాంతివంతమైన మెరుపు పోందలేరు. మీరు కూడా సౌందర్య ప్రియులే అయితే చర్మం విషయంలో సహజమైన పద్ధతులు, పదార్థాలను ఎంచుకోవాలనుకుంటే ఫేషియల్ స్టీమింగ్ మీకు చాలా ాగా సహాయపడుతుంది.

షేషియల్ స్టీమింగ్ అంటే ముఖానికి ఆవిరి పట్టడం. ఇది ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండానే ఇంట్లోనే పార్లర్ లాంటి మెరుపు తీసుకొస్తుంది. చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచే సులభమైన, సహజమైన మార్గం ఇది. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఇంట్లోనే స్టీమ్ ఫేషియల్ ఎలా చేయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

స్టీమ్ ఫేషియల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. రంధ్రాల శుభ్రత

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. లోపల ఉన్న మట్టి, మురికి, నూనెతో పాలు చనిపోయిన మృతకణాలన్నీ బయటకు వస్తాయి. చర్మం లోతుల్లోకి ఆరోగ్యంగా మారుతుంది. ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటుంది.

2. మెరిసే చర్మం

ఆవిరి పట్టడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. స్టీమ్ ఫేషియల్ తర్వాత చర్మం చాలా తాజాగా, తేలికగా, ప్రకాశవంతంగా మారుతుంది.

3. మొటిమల నుండి ఉపశమనం

మొటిమలు, నల్ల మచ్చలు ఉన్నవారికి ఫేషియల్ స్టీమింగ్ చాలా బాగా పని చేస్తుంది. వీటికి కారణమైన బ్యాక్టీరియాను స్టీమింగ్ పద్ధతి నశింపజేస్తుంది. రంధ్రాలలో చేరిన బ్యాక్టీరియా శుభ్రం కావడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

4. హైడ్రేషన్

ఆవిరి పట్టడం వల్ల చర్మానికి కావలసిన తేమ అందుతుంది. ఇది చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. తేమ, రక్త ప్రసరణ మెరుగవడం వల్ల చర్మం మెత్తగా, మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గిపోయి, యవ్వనంగా కనిపిస్తుంది.

5. యాంటీ-ఏజింగ్

స్టీమ్ వల్ల చర్మంలో కోలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఫిర్మ్‌గా, యవ్వనంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఆవిరి పట్టడం వల్ల చర్మం సాగతీత తగ్గుతుంది. స్థితిస్థాపకత పెరిగి ముడతలు తగ్గుతాయి.

6. ఒత్తిడి తగ్గుతుంది:

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అయి చర్మపు ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు.. స్టీమింగ్ వల్ల శరీరం, మనసుకు కూడా రిలాక్సేషన్ లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గడం కోసం అప్పుడప్పుడూ ఆవిరి పట్టుకుంటే మంచిది.

స్టీమ్ ఫేషియల్ చేసే విధానం

  • స్టీమ్ ఫేషియల్ చేయడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
  • తరువాత ఒక పాత్రలో నీటిని మరిగించండి. ఈ నీటిలో తులసి, వేప లేదా గ్రీన్ టీ వంటివి వేయండి.
  • నీరు మరిగి రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పట్టుకోండి.
  • స్టీమింగ్ చేసేటప్పుుడు ముఖానికి పాత్రకు మధ్య కనీసం 8-10 అంగుళాల దూరం ఉండేలా చేసుకోండి.
  • ఆవిరి బయటికి పోకుండా ఏదైనా క్లాత్ లేదా టవల్ లో ముఖాన్ని ఆవిరి గిన్నెను కప్పి ఉంచడం మర్చిపోకండి. తద్వారా ఆవిరి వృథాగా బయటకు పోకుండా పూర్తిగా ముఖంపై పడుతుంది.
  • ఈ విధంగా 5-10 నిమిషాల పాటు ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగండి.
  • తర్వాత ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

సలహా

స్టీమ్ ఫేషియల్ చేసేటప్పుడు చాలా సేపు ఆవిరి పట్టకండి. ఎక్కువ సేపు స్టీమింగ్ చేయడం వల్ల చర్మం పొడిగా మారే ప్రమాదముంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024