


Best Web Hosting Provider In India 2024
New Aadhar app: ఈ కొత్త ‘ఆధార్ యాప్’ తో మీ వివరాలు మరింత సేఫ్
New Aadhar app: పౌరుల సున్నితమైన వివరాలకు మరింత రక్షణ అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్ ను రూపొందించింది. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఆధార్ యాప్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.

New Aadhar app: పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను రూపొందించింది. ఈ కొత్త ఆధార్ యాప్ ఫేస్ ఐడీ, క్యూఆర్ స్కానింగ్ ఉపయోగించి సురక్షిత డిజిటల్ ధృవీకరణకు వీలు కల్పిస్తుంది. ఫిజికల్ గా ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. పౌరుల గోప్యత, నియంత్రణలను మెరుగుపరుస్తుంది. ఇది వినియోగదారులు ఆధార్ కార్డుల ఒరిజినల్స్ లేదా ఫోటోకాపీలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఆధార్ వివరాలను డిజిటల్‌గా ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.
బీటా పరీక్ష దశలో
ఈ కొత్త ఆధార్ యాప్ వివరాలను కేంద్ర సమాచార మరియు సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్, Xలో షేర్ చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. ఫేస్ ఐడీ ద్వారా నిర్ధారణ, వినియోగదారు సమ్మతితో డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం వంటి లక్షణాలు ఈ యాప్ లో ఉన్నాయి. ఈ యాప్ ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్, ఆధార్ ధృవీకరణను సరళీకృతం చేయడం, ఆధార్ దుర్వినియోగం నుండి రక్షణ కల్పించడం.. వంటి వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త ఆధార్ యాప్ ముఖ్యమైన ఫీచర్లు
- పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను తీసుకోవడం కుదరదు. వారి సమ్మతితో అవసరమైన డేటాను మాత్రమే సురక్షితంగా పంచుకోవచ్చు. దీనివల్ల వ్యక్తిగత సమాచారంపై నియంత్రణ లభిస్తుంది.
- యూపీఐ చెల్లింపుల సమయంలో క్యూఆర్ కోడ్ ను ఉపయోగించిన విధంగానే, ఆధార్ ధృవీకరణను క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు.
- ఆధార్ ఫొటో కాపీలను, లేదా ఆధార్ ఒరిజినల్ కాపీలను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.
- మెరుగైన భద్రత కోసం మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి ప్రామాణీకరణను అందిస్తుంది.
- హోటళ్ళు, దుకాణాలు లేదా ప్రయాణ చెక్‌పాయింట్‌లలో ఆధార్ ఫోటోకాపీలను అందజేయాల్సిన అవసరం లేదు.
- 100 శాతం డిజిటల్, సురక్షితమైన గుర్తింపు ధృవీకరణను నిర్ధారిస్తుంది.
- ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా, సున్నితమైన డేటా లీక్ కాకుండా వినియోగదారులను రక్షిస్తుంది.
- ఆధార్ సమాచారం యొక్క ఫోర్జరీ లేదా సవరణలను నిరోధిస్తుంది.
- త్వరిత మరియు సులభమైన వెరిఫికేషన్ ప్రక్రియతో వినియోగదారులకు సురక్షితమైన సేవలను అందిస్తుంది.
- సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వినియోగదారుడికి మరింత సమర్ధవంతమైన ప్రైవసీ లభిస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link