OTT Thriller Movie: ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. మొబైలే మన జీవితాలను కంట్రోల్ చేస్తోందా?

Best Web Hosting Provider In India 2024

OTT Thriller Movie: ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. మొబైలే మన జీవితాలను కంట్రోల్ చేస్తోందా?

Hari Prasad S HT Telugu
Published Apr 08, 2025 09:40 PM IST

OTT Thriller Movie: ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే సిద్ధమవుతున్న ఈ సినిమా ఈ కాలం యువత మొబైల్, సోషల్ మీడియాకు ఎంతలా బానిసలవుతున్నారో చూపించే ప్రయత్నం చేసింది.

ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. మొబైలే మన జీవితాలను కంట్రోల్ చేస్తోందా?
ఓటీటీలోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. మొబైలే మన జీవితాలను కంట్రోల్ చేస్తోందా?

OTT Thriller Movie: దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలుసు కదా. అతని తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ లాగౌట్ (Logout). ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. మరో పది రోజుల్లో మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

లాగౌట్ మూవీ ట్రైలర్

మొబైల్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా ఈ కాలం యువత ఒక్క క్షణం కూడా గడపడం లేదు. అయితే తెలియకుండానే వీటికి బానిసలైపోతూ.. తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ యువకుడి కథే ఈ లాగౌట్ మూవీ.

ఇందులో ప్రత్యూష్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా బాబిల్ ఖాన్ నటించాడు. మొబైల్ ఫోన్ పూర్తిగా బానిసగా మారిపోయిన వ్యక్తి అతడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు.

10 లక్షల మంది ఫాలోవర్లే లక్ష్యంగా పని చేస్తుంటాడు. తనను అందరూ గుర్తించాలని అనుకుంటాడు. అయితే ఓరోజు అనుకోకుండా అతని మొబైల్ కనిపించకుండాపోతుంది. అతని ఫ్యానే ఒకరు ఆ ఫోన్ ను దొంగిలిస్తారు. అక్కడి నుంచీ అతని జీవితం తలకిందులవుతుంది.

లాగౌట్ ఓటీటీ రిలీజ్ డేట్

లాగౌట్ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. “మనం ఏం చేస్తున్నామో, మనల్ని ఎవరు చూస్తున్నారో.. వీటి మధ్య ఉన్న వాక్యాలు బ్లర్ కాబోతున్నాయి. లాగౌట్ ఏప్రిల్ 18 నుంచి కేవలం మీ జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ లాగౌట్ సినిమాను అమిత్ గొలానీ డైరెక్ట్ చేశాడు. బిశ్వపతి సర్కార్ కథ అందించాడు. బాబిల్ ఖాన్ తోపాటు రసికా దుగల్, గంధర్వ్ దివాన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. గతేడాది 21వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టట్‌గార్ట్ లో ఈ మూవీ ప్రదర్శించారు. లాగౌట్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది.

లాగౌట్ మూవీ ఏప్రిల్ 18 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొబైల్, సోషల్ మీడియాకు అడిక్ట్ కావడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న కాన్సెప్ట్ తో గతంలో నెట్‌ఫ్లిక్స్ లో ఖోగయే హమ్ కహా అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లాగౌట్ కూడా అలాంటిదే.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024