Odela 2 OTT: తమన్నా ఓదెల 2 మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Odela 2 OTT: తమన్నా ఓదెల 2 మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Published Apr 08, 2025 08:34 PM IST

Odela 2 OTT: తమన్నా భాటియా లీడ్ రోల్లో నటించిన ఓదెల 2 మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో తేలిపోయింది. మంగళవారమే (ఏప్రిల్ 8) ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమన్నా ఓదెల 2 మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
తమన్నా ఓదెల 2 మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Odela 2 OTT: తమన్నా నటించిన ఓదెల 2 మూవీ వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ పై స్పష్టత వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తోంది.

ఓదెల 2 ఓటీటీ

ఓదెల 2 మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ సినిమా హక్కుల కోసం రూ.11 కోట్లు చెల్లించినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. మూవీ టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) ట్రైలర్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.

2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఈ ఓదెల 2 వస్తోంది. ఇందులో తమన్నా.. శివ శక్తి పాత్రలో నటిస్తోంది. ఓ అఘోరలాగా ఆమె లుక్ ఉంది. ఓదెల 2 థియేటర్లలో రిలీజైన తర్వాత కనీసం నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఆ లెక్కన మే మూడో వారంలో ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా రావచ్చు.

ఓదెల 2 ట్రైలర్ ఎలా ఉందంటే?

ఓదెల 2 ట్రైలర్ మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ఇది ఓదెల గ్రామంపై పొంచి ఉన్న ముప్పును సూచిస్తూ.. ఒక దుష్ట శక్తి గురించి చెబుతుంది. ఈ చెడు శకునాలు కనిపించడం ప్రారంభించగానే, గ్రామస్తులు భయంతో వణికిపోతారు.

చీకటి నెమ్మదిగా తమ జీవితాలను ఆవహిస్తోందని గ్రహిస్తారు. అదే సమయంలో ఓ నాగ సాధువు వస్తుంది. అచంచలమైన దృఢ సంకల్పంతో ఆమె చెడును ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది. నాగ సాధువుగా తమన్నా భాటియా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై డి. మధు నిర్మిస్తున్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024