



Best Web Hosting Provider In India 2024
Railway Recruitment : రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్.. టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంటే చాలు!
Railway Recruitment 2025 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) నాగ్‌పూర్ డివిజన్ టెన్త్ పాసైన యువతకు బంపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వే 1007 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలను నింపనుంది.

మీరు టెన్త్-ఐటీఐ ఉత్తీర్ణత సాధించి రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. మీకు గుడ్‌న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ఆర్ఆర్సీ నాగ్‌పూర్ డివిజన్ టెన్త్ పాసైన యువతకు బంపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వే 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ 5 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమైంది. apprenticeshipindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి మీ దరఖాస్తు ఫారాన్ని సమర్పించండి. దరఖాస్తుకు చివరి తేదీ 4 మే 2025. అలాగే దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 4 మే 2025 అని గుర్తుంచుకోండి.
అర్హతలు
ఈ నియామక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులకు నియమిస్తారు. అభ్యర్థుల కనీస వయస్సు గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2025 ఏప్రిల్ 5 ఆధారంగా లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్లు సడలింపు ఇస్తారు. దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ ఎస్ఎస్సీ, తత్సమాన విద్యార్హత ఉండాలి. పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
స్టైఫండ్
రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసిన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.8050 స్టైఫండ్ ఇస్తారు. ఏడాది ఐటీఐ కోర్సు చేసిన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.7,700 స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో రిక్రూట్‌మెంట్ అర్హత, విద్యార్హతలను సరిచూసుకోవాలి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link