




Best Web Hosting Provider In India 2024

Murder Mystery OTT: మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సెబాస్టియన్ పీసీ 524 థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సెబాస్టియన్ పీసీ 524 థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే చూడొచ్చు.
నువేక్ష హీరోయిన్….
సెబాస్టియన్ పీసీ 524 మూవీలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నువేక్ష హీరోయిన్‌గా నటించింది. కోమలి ప్రసాద్‌తో పాటు రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.
యావరేజ్ టాక్…
2022లో థియేటర్లలో రిలీజైన సెబాస్టియన్ పీసీ 524 మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్ కొత్తదే అయినా దానిని తెరపై ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తడబడటంతో ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఈ మూవీలో రేచీకటి సమస్యతో బాధపడే పోలీస్ కానిస్టేబుల్‌గా కిరణ్ అబ్బవరం నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.
సెబాస్టియన్ పీసీ 524 కథ ఇదే…
సెబాస్టియన్‌కు రేచీకటి సమస్య ఉంటుంది. కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి పోలీస్ జాబ్‌లో జాయిన్ అవుతాడు. తనకున్న సమస్య బయటపడకుండా తెలివిగా మ్యానేజ్ చేస్తుంటాడు. సెబాస్టియన్ చేసిన పొరపాటు కారణంగా నీలిమ అనే అమ్మాయి దారుణంగా హత్యకు గురువుతుంది.
హంతకుడికి సంబంధించిన ఆధారాలు కూడా సెబాస్టియన్ వల్లే మిస్పవుతాయి. దాంతో సెబాస్టియన్ సస్పెండ్ అవుతాడు. నీలిమను హత్య చేసిన వ్యక్తిని పట్టుకొని తన ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకున్న సెబాస్టియన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? నీలిమను చంపింది ఎవరు? ఈ పోరాటంలో సెబాస్టియన్‌కు ప్రియురాలు హేలి ఎలా అండగా నిలిచింది అన్నదే సెబాస్టియన్ పీసీ 524 కథ.
యాభై కోట్లు…
గత కొన్నేళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌ను ఎదుర్కొన్న కిరణ్ అబ్బవరం క మూవీతో తిరిగి విజయాల బాట పట్టాడు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. క తర్వాత చేసిన దిల్‌రుబా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. దిల్ రుబా తర్వాత కే ర్యాంప్ పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు కిరణ్ అబ్బవరం. అలాగే క మూవీ సీక్వెల్ కూడా రాబోతోంది.
సంబంధిత కథనం