Karthika Deepam Today Episode April 9: దీపకు అంతా చెప్పిన కావేరి.. జ్యోత్స్నకు తాత ట్విస్ట్.. తండ్రికి కాంచన మొర

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode April 9: దీపకు అంతా చెప్పిన కావేరి.. జ్యోత్స్నకు తాత ట్విస్ట్.. తండ్రికి కాంచన మొర

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 09, 2025 07:23 AM IST

Karthika Deepam 2 Serial Today Episode April 9: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న చేసిన కుట్రలను దీపకు చెప్పేస్తుంది కావేరి. తాను చాటుగా విన్న విషయాలన్నీ చెబుతుంది. దీంతో దీపలో ఆగ్రహం పెరుగుతుంది. తండ్రి శివన్నారాయణ ఇంటికి కాంచన వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today Episode April 9: దీపకు అంతా చెప్పిన కావేరి.. జ్యోత్స్నకు తాత ట్విస్ట్.. తండ్రికి కాంచన మొర
Karthika Deepam Today Episode April 9: దీపకు అంతా చెప్పిన కావేరి.. జ్యోత్స్నకు తాత ట్విస్ట్.. తండ్రికి కాంచన మొర

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 9) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్ తనను బెదిరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది దీప. రెస్టారెంట్‍లో కోపంగా కూరగాయలు తరుగుతూ ఉంటుంది. “వాడికి ఎంత ధైర్యం కాకపోతే.. తప్పు చేసింది కాక నాకే వార్నింగ్ ఇస్తాడా” అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఎందుకు కోపంగా ఉన్నావని అడుగుతాడు. కానీ గౌతమ్ ఇంటికి వచ్చి బెదిరించిన విషయాన్ని దీప చెప్పదు. ఏం లేదు కార్తీక్ బాబు అంటుంది. మరి ఎందుకు ఇలా ఉన్నావని కార్తీక్ బాబు అడుగుతాడు.

గులాబీ ఇచ్చిన కార్తీక్

ప్రేమ భాషను నేర్పాలని దీపను కార్తీక్ అడుగుతాడు. తనకు ఆ భాష రాదంటుంది దీప. కోనేటి దగ్గర నిన్ను హగ్ చేసుకోవాలని అనిపించింది దీప అని కార్తీక్ అంటాడు. నువ్వే ప్రాణదాతవు అని చెప్పిన తర్వాత ప్రేమగా హగ్ చేసుకొని, నా ఫీలింగ్స్ బాగా చెప్పాలనుకున్నానని చెబుతాడు. ఒకటి ఇవ్వాలని వచ్చానని అంటాడు. కూరగాయలా అని దీప అంటే.. అవి తప్ప ఏం గుర్తు రావావా అని కార్తీక్ అంటాడు. గులాబీ పువ్వును దీపకు ఇస్తాడు కార్తీక్. తలలో పెట్టుకోవాలని అంటాడు. రోజుకో రోజా ఇస్తానని చెబుతాడు. ఎవరికి దీప అడుగుతుంది. ప్రేమ.. ప్రాణదాతలో ఉన్న నా భార్యకు.. నా భార్యలో ఉన్న ప్రాణదాతకు అని కార్తీక్ చెబుతాడు.

జ్యోత్స్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు దీప!

కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటే కావేరి అక్కడికి వస్తుంది. దీపతో మాట్లాడాలని అంటుంది. దీంతో మీరు మాట్లాడుకోండని అక్కడి నుంచి కార్తీక్ వెళతాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నారని కావేరిని దీప అడుగుతుంది. అంతా విన్నాక భయమేస్తోందని కావేరి అంటుంది. తాను చాటుగా విన్న జ్యోత్స్న మాటలను దీపకు చెప్పేస్తుంది. “జ్యోత్స్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు దీప. నీ ద్వారా ఆపేలా చేసింది. సత్తిపండుతో అబద్ధం చెప్పించింది గౌతమ్ పని కాదు. తన పనే” అని కావేరి చెబుతుంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని దీప అడుగుతుంది. జ్యోత్స్న గురించి అని కావేరి చెబుతుంది. ఈ కుట్రలు పన్నింది జ్యోత్స్ననే అని వివరిస్తుంది. దీంతో దీప షాక్ అవుతుంది.

ఈ పెళ్లే పెద్ద అబద్ధం

ఆరోజు నిశ్చితార్థం ఆగిపోవడం పెద్ద అబద్ధం, నిన్ను తప్పించి కార్తీక్ జీవితంలోకి రావాలనేది జ్యోత్స్న ప్లాన్ అని కావేరి చెబుతుంది. అందుకోసం ఈ పెళ్లిని జ్యోత్స్న వాడుకుంటోందని అంటుంది. పెళ్లి ఆగిపోయింది కదా అని దీప అడుగుతుంది. లేదు దీప.. ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు అని కావేరి అసలు విషయం చెబుతుంది. జ్యోత్స్నకు గౌతమ్ గురించి తెలిస్తే ఎందుకు పెళ్లికి ఒప్పుకుంటుందని దీప అడుగుతుంది. ఈ పెళ్లి అనేదే పెద్ద అబద్ధం దీప, ఇదంతా నీకోసం పన్నిన కుట్ర అని మొత్తం చెప్పేస్తుంది కావేరి.

రెస్టారెంట్‍కు మీ మామయ్య తీసుకెళ్లారని, అక్కడికి జ్యోత్స్న గౌతమ్ వచ్చారని కావేరి చెబుతుంది. ముహూర్తాలు జరిగినా పెళ్లి జరగదని, రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమ్ కాబట్టి అని పారిజాతం చెప్పిన మాటను దీపతో కావేరి చెబుతుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదని, దీపనే ఆపుతుందని జ్యోత్స్న అన్న మాటలని వివరిస్తుంది. నిశ్చాతార్థం సమయంలో చేసిన కుట్ర గురించి దీపకు కావేరి చెబుతుంది.

గౌతమ్‍ను నీ మీదకు పంపింది జ్యోత్స్ననే

గౌతమ్ అందరినీ మోసం చేస్తుంటే.. అలాంటి వాడిని జ్యోత్స్న మోసం చేస్తోందని కావేరి చెబుతుంది. గౌతమ్‍ను రెచ్చగొట్టి నీ మీదకు పంపింది జ్యోత్స్ననే అని దీపతో అంటుంది. దీంతో దీపలో ఆగ్రహం పెరిగిపోతోంది. చివరికి గౌతమే బాకరా అవుతాడని అంటుంది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నిన్ను జ్యోత్స్న వదలిపెట్టదని కావేరి చెబుతుంది. “జ్యోత్స్న పెళ్లి ఆగిపోయేలా చేయడానికి, అలా ఆగిపోవడానికి, కార్తీక్ జీవితం నుంచి దూరం అవడానికి ఏదో లింక్ ఉంది. అది మాత్రం పారిజాతంకు చెప్పలేదు. ఇదంతా జ్యోత్స్న ప్లానే. ఇప్పుడు పారిజాతం కూడా తోడైంది. తను ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది దీప” అని కావేరి చెబుతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కావేరిని దీప కోరుతుంది. ఏదో ఒకటి చెయ్, ఆ జ్యోత్స్నను వదిలిపెట్టవద్దని కావేరి అంటుంది.

దీపలో పెరిగిన ఆగ్రహం

నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధగా జ్యోత్స్న మాట్లాడిన మాటలు నాటకమే అని దీపకు అర్థమవుతుంది. “ఎంత తెలివిగా నన్ను ఈ గొడవలో ఇరికించావ్.. ఇప్పుడు పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించావా.. ఎందుకో అర్థమైంది. వెంటనే నీ పరుగును ఆపాలి” అని ఆగ్రహంగా అనుకుంటుంది దీప. కార్తీక్ బాబు ఈ నిజం తెలియకూడదని ఆలోచిస్తుంది. ఈరోజు నీ పెళ్లి జరుగుతుంది జ్యోత్స్న అని కోపంగా అనుకుంటుంది.

ఫారిన్‍లో పెళ్లి.. వద్దన్న జ్యోత్స్న

జ్యోత్స్న, పారిజాతం ఇంటికి వస్తారు. అప్పటికే శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్ కూర్చొని ఉంటారు. ఏ ఉపద్రవం వస్తుందో అని భయపడడం కంటే.. దూరంగా వెళ్లి పెళ్లి చేసుకొని రావడం ప్రశాంతం అని అనుకుంటున్నానని శివన్నారాయణ అంటాడు. ఈ పెళ్లికి ఒప్పుకుందే దీపను బావకు దూరం చేసేందుకు, ఆకాశంలో పెళ్లి చేస్తానంటేనే నేను అనుకున్నది ఎలా జరుగుతుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. వచ్చే వారంలో ముహూర్తం ఉందని దశరథ్, సుమిత్ర అంటారు. పెళ్లి ఫారిన్‍లో చేసుకున్నా ఇక్కడ రిసెప్షన్ చేసుకుందామని సుమిత్ర అంటుంది.

పెళ్లి ఇంట్లోనే జరగాలని, అది నా కోరిక అని జ్యోత్స్న కోరుతుంది. ఎప్పుడు దూరంగా పోయి పెళ్లి చేసుకుంటే జనం ఏమనుకుంటారని కొత్త డ్రామా మొదలుపెడుతుంది. తనకు కొంత టైమ్ కావాలని, అప్పుడే ముహూర్తాలు వద్దని అంటుంది. ఎంగేజ్‍మెంట్‍లో జరిగింది ఇంకా మర్చిపోలేదని, మెంటల్‍గ్రా ప్రిపేట్ అవ్వాలి కదా అని చెబుతుంది. శివన్నారాయణ కూడా ఓకే అంటాడు. గౌతమ్‍తోనే జ్యోత్స్న పెళ్లి జరుగుతుందని అంటాడు. “జ్యోత్స్న పెళ్లి గౌతమ్‍తో కాదు తాత.. కార్తీక్‍తో జరుగుతుంది” అని మనసులో అనుకుంటుంది జ్యో.

కాంచనకు చెప్పిన దీప

జ్యోత్స్న కుట్రల గురించి కావేరి చెప్పిన విషయాలను కాంచనకు చెబుతుంది దీప. ఏదైనా చేసే ముందు మీకు చెప్పాలని మాట తీసుకున్నారు కదా.. అందుకే జ్యోత్స్న దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికే వచ్చానని దీప అంటుంది. నా మేనకోడలు ఇంత దారుణంగా తయారైందేంటి అని కాంచన ఫీల్ అవుతుంది. తప్పులు అన్నీ తాను చేసి, నిందలు నా కోడలిపై వేసిందని అంటుంది. పెళ్లి ఆపేందుకు ఎన్ని నాటకలు ఆడుతుందో అని భయపడుతుంది. నేను జ్యోత్స్న ఇంటికి వెళతానని దీప అంటే వద్దని, మళ్లీ సాక్ష్యాలు అడుగుతారని అనసూయ అడ్డుకుంటుంది. తానే వాళ్ల ఇంటికి వెళతానని కాంచన చెబుతుంది. నాన్న కాళ్ల మీద పడైనా ఈ పెళ్లి ఆపాలని అడుగుతానని అంటుంది. జ్యోత్స్న చేసింది విన్న తర్వాత భయమేస్తోందని చెబుతుంది. అనసూయను తీసుకొని తండ్రి శివన్నారాయణ ఇంటికి కాంచన బయలుదేరుతుంది. “వీళ్ల మాట విని పెళ్లి ఆపుకుంటే నీ అదృష్టం జ్యోత్స్న. మాట వినలేదో ఈసారి నేను వస్తా” అని మనసులో అనుకుంటుంది దీప.

జ్యోత్స్నకు ట్విస్ట్

సుమిత్రను శివన్నారాయణ పిలుస్తాడు. ఇంతలో పారిజాతం కూడా వస్తుంది. పెళ్లి విషయం మాట్లాడేందుకు పెళ్లి కొడుకు ఇంటికి వెళుతున్నానని సుమిత్రతో శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న అప్పుడే పెళ్లి వద్దంది కదా అని పారు అంటే.. చెప్పేది విను అని కసురుకుంటాడు. పెళ్లి వాయిదాలు వేస్తే ఏదైనా జరగొచ్చని, మనసులు మారొచ్చని శివన్నారాయణ అంటాడు. అందుకే ఆలస్యం చేయకుండా త్వరగానే ముహూర్తాలు పెట్టిస్తానని చెబుతాడు. లేట్ చేయాలని అనుకుంటున్న జ్యోత్స్నకు ట్విస్ట్ ఇస్తాడు. ఒకవేళ జ్యోత్స్న కాదంటే.. తాను బుజ్జగించి ఒప్పిస్తానని చెబుతాడు.

“నీకు తెలియకుండా అది ప్లాన్ చేస్తే.. దానికి తెలియకుండా మీరు ప్లాన్ వేస్తారా” అని మనసులో అనుకుంటుంది పారిజాతం. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, జ్యోత్స్నకు అసలు తెలియకూడదని పారుకు గట్టిగా చెబుతాడు శివన్నారాయణ. నా నోటికి తాళం వేశావ్ కదా అని అనుకుంటుంది పారిజాతం. ఎదురు రావాలని సుమిత్రను శివన్నారాయణ అడుగుతాడు.

కాంచనను చూసి కోపంలో శివన్నారాయణ

శివన్నారాయణ బయటికి వెళుతుంది ఇంట్లోకి వస్తుంటారు కాంచన, అనసూయ. ఇది చూసి కోపంగా ఇంట్లోకి వెళ్లేందుకు శివన్నారాయణ సిద్ధమవుతాడు. నాన్న.. నాన్న అని కాంచన పిలుస్తుంది. మంచి పనికి వెళ్లేటప్పుడు అపశకునం ఎదురైతే కాసేపు ఆగివెళతారని, కానీ కొందరు ఎదురైతే ఆరోజు ఆపని ఆపుకోవాలని, లేకపోతే నాశనం అవుతుందని నానామాటలు అంటాడు. సుమిత్ర ఎవరో వచ్చారు చూడమ్మా అని వెటకారంగా అంటాడు. నాన్న.. నీ కోసమే వచ్చానని కాంచన చెబుతుంది. వచ్చింది మీ కూతురు, నీ మేనకోడలి మంచి కోసమే వచ్చింది అని అనసూయ అంటుంది.

పెళ్లి జరగకూడదు.. కాంచన మొర

నేనేం తప్పు చేశాను నాన్న అని కాంచన అడుగుతుంది. నిశ్చితార్థంలో నా మనవరాలికి కాబోయే భర్తపై చేయి చేసుకున్నప్పుడు దీప చెంచ పగులగొట్టాల్సిందని, నువ్వు ఆ పని చేయలేదని శివన్నారాయణ అంటాడు. దీప వేసిన నింద నిజమే అని కాంచన అంటుంది. వదినా.. దీప నిన్ను కూడా మార్చేసిందా అని సుమిత్ర అంటుంది. గౌతమ్ మంచోడు కాదని అనసూయ చెబుతుంది. శివన్నారాయణ మాత్రం నానామాటలు అంటూనే ఉంటాడు.

వాడు మంచోడు కాదు

ఒక్కసారి నా మాట విను నాన్న అని కాంచన అడుగుతుంది. గౌతమ్ మంచోడు కాదని, చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడని అంటుంది. మళ్లీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారని తెలిసిందని, అది ఆపేందుకే వచ్చానని చెబుతుంది. చెప్పావు కదా.. ఇక వెళ్లు ఉంటుంది. నా మనవరాలి నిశ్చితార్థం ఆగిపోయింది నీ కోడలి వల్లే, మళ్లీ జ్యోత్స్న జీవితం గురించి మాట్లాడుతున్నావా అని శివన్నారాయణ ఆగ్రహిస్తాడు. ఈ పెళ్లి ఆపు నాన్న అని చేతులు జోడించి అడుగుతుంది కాంచన. నువ్వు చెప్పిన వాడితోనే నా మనవరాలి వెళ్లి చేయాలా అని శివన్నారాయణ విసుగ్గుంటాడు. ఎవరితోనైనా చేయ్.. వాడితో వద్దు అని ఏడుస్తూ అంటుంది కాంచన. వాడు మంచి వాడు కాదు అని గట్టిగా అరుస్తుంది.

కాళ్లు పట్టుకుంటా..

సాక్ష్యం అని అడుగుతాడు శివన్నారాయణ. అన్నింటికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయని అంటుంది కాంచన. “ఈ పెళ్లి ఆపేందుకు నీ కోడలు విశ్వప్రయత్నాలు చేసింది. డబ్బులిచ్చి మరీ దొంగ సాక్ష్యాలను పట్టుకొచ్చింది. ఇంక చేసి ఏమీ లేక మిమ్మల్ని పంపింది. శుభకార్యం ఆపేందుకు మీరు వచ్చారు” అని శివన్నారాయణ అంటాడు. దండం పెడతా.. కాళ్లు పట్టుకుంటా ఈ పెళ్లి ఆపేయ్ అని బాధగా అడుగుతుంది కాంచన. ఆగదు అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 9) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024