Brahmamudi Today Episode: అదిరిపోయిన కావ్య ట్విస్ట్ -యామినితో అప‌ర్ణ గొడ‌వ -సాక్ష్యాలు చూపించిన సుభాష్ -రాజ్ క‌న్ఫ్యూజ్‌

Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: అదిరిపోయిన కావ్య ట్విస్ట్ -యామినితో అప‌ర్ణ గొడ‌వ -సాక్ష్యాలు చూపించిన సుభాష్ -రాజ్ క‌న్ఫ్యూజ్‌

Nelki Naresh HT Telugu
Published Apr 09, 2025 07:36 AM IST

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 9 ఎపిసోడ్‌లో రాజ్‌, కావ్య‌ల‌కు పెళ్లైన సంగ‌తి గుర్తుచేసేందుకు అప‌ర్ణ ప్ర‌య‌త్నిస్తుంది. కానీ రాజ్ మాత్రం క‌ళావ‌తి త‌న‌కు ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని అంటాడు. రాజ్ త‌మ కొడుకే అన‌డానికి సుభాష్ సాక్ష్యాలు చూపిస్తాడు.

బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 9 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 9 ఎపిసోడ్‌

యామినితో క‌లిసి గుడికి వ‌చ్చిన రాజ్‌ను చూస్తుంది రుద్రాణి. రాజ్ బ‌తికే ఉన్న సంగ‌తి కుటుంబ‌స‌భ్యుల‌కు చెబుతుంది. రాజ్‌ను చూడ‌గానే అప‌ర్ణ ఎమోష‌న‌ల్ అవుతుంది. కానీ రాజ్ మాత్రం త‌ల్లిని గుర్తుప‌ట్ట‌డు. మిమ్మ‌ల్ని ఇదే మొద‌టిసారి చూస్తున్నాన‌ని, ఎవ‌రు మీరు అని అంటాడు.

అత‌డు రాజ్ కాద‌ని, త‌న బావ రామ్ అని యామిని బుకాయిస్తుంది. చిన్న‌త‌నంలోనే రాజ్ అమ్మ‌, నాన్న చ‌నిపోయార‌ని,మా బావ మా ద‌గ్గ‌రే పెరిగాడ‌ని, త్వ‌ర‌లోనే మేమిద్ద‌రం పెళ్లిచేసుకోబోతున్నామ‌ని అప‌ర్ణ‌తో గొడ‌వ‌ప‌డుతుంది యామిని.

నాకు కాబోయే భార్య‌…

రాజ్ కూడా యామిని త‌న‌కు కాబోయే భార్య అని అంటాడు. రాజ్ మాట‌లు, ప్ర‌వ‌ర్త‌న చూసి అప‌ర్ణ‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ షాక‌వుతారు. నీకు ఆల్రెడీ పెళ్లైపోయింద‌ని, పెళ్లాంతో ఏడాదిన్న‌ర కాపురం చేశావు…ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి ఏంటి అని రాజ్‌పై ఫైర్ అవుతుంది అప‌ర్ణ‌. నేను చెబితే నువ్వు న‌మ్మ‌డం లేదా…అని కావ్యను చూపిస్తుంది అప‌ర్ణ‌. క‌ళావ‌తిని చూసి రాజ్ షాక‌వుతాడు.

రాజ్‌ బ‌తికి ఉన్నాడ‌ని ఇన్నాళ్లు చెప్పింది నువ్వే క‌దా…ఇప్పుడు నీ భ‌ర్త క‌ళ్ల ముందుకు వ‌స్తే ఎందుకు దూరంగా నిల‌బ‌డ్డావ‌ని కావ్య‌ను తీసుకొచ్చిరాజ్ ముందు నిల‌బెడుతుంది అప‌ర్ణ‌. త‌ను ఎవ‌రో నీకు తెలియ‌దా…నీ భార్య కావ్య అని రాజ్‌తో అంటుంది అప‌ర్ణ‌.

మేమిద్ద‌రం ఫ్రెండ్స్‌…

త‌ను నాకు తెలుసు. త‌న పేరు క‌ళావ‌తి అని, మేమిద్ద‌రం ఫ్రెండ్స్ అని రాజ్ అంటాడు. రీసెంట్‌గానే త‌ను నాకు ప‌రిచ‌య‌మైంది అని రాజ్ చెబుతాడు. వేద‌మంత్రాల సాక్షిగా నువ్వు తాళి క‌ట్టిన భార్య… కావ్య అని అప‌ర్ణ కోపంగా అంటుంది. త‌న పేరు క‌ళావ‌తి కాదా అని రాజ్ అంటాడు. అది నువ్వు పెట్టుకున్న పేరు అని అప‌ర్ణ బ‌దులిస్తుంది. కావ్య నా భార్య అయితే…ఎవ‌రో తెలియ‌న‌ట్లు నాకు ఫ్రెండ్‌గా ఎందుకు ప‌రిచ‌య‌మైంది. మాకు పెళ్లి జ‌రిగిన విష‌యం నాకు ఎందుకు చెప్ప‌లేద‌ని రాజ్ అంటాడు. మీరు నా భార్య అయితే ఫ్రెండ్‌గా నా జీవితంలోకి ఎందుకు వ‌చ్చారు అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌.

ట్విస్ట్ అదిరిపోయింది…

అస‌లు ఏం జ‌రిగింది. ఇన్ని రోజులు రాజ్‌తో మాట్లాడుతున్నా…ఈ విష‌యం నువ్వు మా ద‌గ్గ‌ర ఎందుకు దాచావు అని కావ్య‌ను ప్ర‌శ్నిస్తుంది ఇందిరాదేవి. రాజ్ చెప్పేది నిజ‌మేన‌ని, ఆయ‌న‌కు మ‌నం ఎవ‌రో తెలియ‌ద‌ని కావ్య అంటుంది. ట్విస్ట్ అదిరిపోయింది అని రుద్రాణి అంటుంది. త‌ను రాజ్ కాద‌న్న మాట, నీ భ‌ర్త‌లా ఉన్నాడ‌ని రామ్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావా అంటూ కావ్య‌ను అవ‌మానిస్తుంది రుద్రాణి.

గ‌తం మ‌ర్చిపోయాడు…

ఆయ‌న రామ్ కాదు త‌న భ‌ర్త రాజ్ అని కావ్య అంటుంది. రాజ్ అయితే మ‌న‌ల‌ను ఎందుకు గుర్తుప‌ట్ట‌డం లేద‌ని రుద్రాణి అంటుంది. రాజ్ మ‌న‌ల‌ను ప‌రాయి వాళ్ల‌లా ఎందుకు చూస్తున్నాడు, రాజ్ ఏద‌న్న త‌ప్పు చేశాడా? అది దాచ‌డానికే నువ్వు మౌనంగా ఉన్నావా అని కావ్య‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ.

రాజ్ గ‌తం మ‌ర్చిపోయిన సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది కావ్య‌. ఏదో ఒక రోజు ఆయ‌న్ని మామూలు మ‌నిషిని చేసి మీ అంద‌రికి చూపించాల‌ని అనుకున్న‌…అప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యం దాచాల‌ని అనుకున్నాన‌ని అంటుంది.

క‌ట్టు క‌థ‌లు బాగున్నాయి…

కావ్య మాట‌ల‌ను అడ్డుకుంటుంది యామిని. మీ క‌ట్టుక‌థ‌లు చాలా బాగున్నాయ‌ని, వెళ్లి ఏదైనా సినిమా వాళ్ల‌కు చెప్పుకుంటే డ‌బ్బులు వ‌స్తాయ‌ని అంటుంది. రామ్ నా బావ అని, ఆరు నెల‌ల క్రితం జ‌రిగిన యాక్సిడెంట్‌లో గ‌తం మ‌ర్చిపోయాడ‌ని, దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని నాట‌కం ఆడుతున్నారా అంటూ కావ్య‌పై ఫైర్ అవుతుంది. డ్రామాలు ఆడుతుంది నువ్వు అంటూ స్వ‌ప్న కోపంగా అంటుంది.

మా రాజ్ ఎవ‌రో మాకు తెలియ‌దా అని అప‌ర్ణ అంటుంది. రాజ్ గ‌తం మ‌ర్చిపోయినంత మాత్రానా రామ్‌గా మారిపోడు. వాడిని మ‌భ్య‌పెట్టాల‌ని చూడొద్ద‌ని అంటుంది.

మా ఇంటికి ఎందుకు వ‌చ్చింది…

త‌ప్పు చేయాల్సిన అవ‌స‌రం మాకు లేద‌ని యామినికి స‌పోర్ట్ చేస్తుంది వైదేహి. అస‌లు మోసం చేయాల‌ని చూస్తుంది మీరు..మీ కోడ‌లు అని అంటుంది. నిజంగా కావ్య భార్య అయితే…ఫ్రెండ్‌గా మా ఇంటికి ఎందుకు వ‌చ్చింది వైదేహి వాదిస్తుంది. వీళ్ల క ట్టుక‌థ‌లు న‌మ్మొద్ద‌ని రాజ్‌తో అంటుంది యామిని. ఎవ‌రు క‌ట్టుక‌థ‌లు అల్లు తున్నారో ఇప్పుడు తేలుస్తాన‌ని అప‌ర్ణ అంటుంది.

రాజ్‌ను వ‌దిలిపెట్టి రాను…

రాజ్ ఎక్కువ‌గా ఆలోచిస్తే అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని కావ్య అంటుంది. ఈ గొడ‌వ‌ను ఆప‌మ‌ని అంటుంది. ఆ మాట డాక్ట‌ర్ల‌తో యామినినే చెప్పించి ఉంటుంద‌ని, తాను న‌మ్మ‌న‌ని అప‌ర్ణ అంటుంది. రాజ్‌ను వ‌దిలిపెట్టి ఎక్క‌డికి రాన‌ని అంటుంది. తాను వెళ్ల‌డం అంటూ జ‌రిగితే అది రాజ్‌తోనే అని ఖ‌రాఖండిగా చెబుతుంది. వీళ్ల‌ను చూస్తుంటే పెద్ద మోస‌గాళ్ల‌లా ఉన్నార‌ని, రాజ్‌ను వీళ్ల ద‌గ్గ‌ర వ‌దిలిపెట్ట‌డం క‌రెక్ట్ కాద‌నిపిస్తుంది ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి అంటారు.

అప‌ర్ణ ఎమోష‌న‌ల్‌…

యామిని చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మ‌ని, నిన్ను నవ‌మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిని నేను…నా బాధ నీకు క‌నిపించ‌డం లేదా రాజ్‌ను అడుగుతుంది అప‌ర్ణ‌. మీ తాత‌య్య‌ను నువ్వు గుర్తుప‌ట్ట‌డం లేదా అని అంటుంది. ఇంట్లో అంద‌రూ నీపై ఆశ‌లు పెట్టుకొని బ‌తుకుతున్నార‌ని, వాళ్ల‌ను అంత సులువుగా ఎలా మ‌ర్చిపోయావ‌ని క‌న్నీళ్ల‌తో రాజ్‌ను అడుగుతుంది అప‌ర్ణ‌.

సాక్ష్యాలు చూపించిన సుభాష్‌…

వీళ్లంతా మాయ‌గాళ్ల‌లా క‌నిపిస్తున్నార‌ని, ఈ క‌ట్టుక‌థ‌ల‌ను న‌మ్మొద్ద‌ని రాజ్‌తో అంటుంది యామిని. అస‌లు ఇక్క‌డ ఉండాల్సిన ప‌నిలేద‌ని వెళ్ల‌బోతుంది. రాజ్ మా కొడుకు అన‌డానికి మా ద‌గ్గ‌ర అన్ని సాక్ష్యాలు ఉన్నాయ‌ని, పాన్‌కార్డ్‌, ఆధార్‌తో పాటు మ‌రికొన్ని ఆధారాలు చూపిస్తాడు సుభాష్.

రాజ్ పుట్టిన‌ప్ప‌టినుంచి పాతికేళ్ల వ‌ర‌కు ప్ర‌తి దానికి మా ద‌గ్గ‌ర సాక్ష్యం ఉంద‌ని అంటాడు. ఊళ్లో రాజ్ గురించి అంద‌రికి తెలుసున‌ని, వీడు రామ్ ఊళ్లో ఒక్క‌రితోనైనా చెప్పించ‌గ‌ల‌రా అని సుభాష్ ఛాలెంజ్ చేస్తాడు.ఇలాంటి సాక్ష్యాలు సృష్టించ‌డం ఈ రోజుల్లో సుల‌భ‌మ‌ని యామిని అంటుంది.

కావ్య క‌ల‌…

రాజ్ పెళ్లి ఎలా జ‌రిగిందో వివ‌రిస్తుంది స్వ‌ప్న‌. రాజ్‌ను తీసుకొని యామిని వెళ్ల‌బోతుంది. రాజ్‌కు గ‌తం గుర్తొచ్చే వ‌ర‌కు ఇక్క‌డి నుంచి ఎవ‌రు క‌దిలేది లేద‌ని అప‌ర్ణ అంటుంది. రాజ్‌ను తిరిగి మ‌న ఇంటికి తీసుకెళ్లాల్సిందేన‌ని కోపంగా అంటుంది. ఆ గొడ‌వ‌కు రామ్ క‌ళ్లు తిరిగి ప‌డిపోతాడు.

అపర్ణ పిలుపుతో కావ్య క‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇదంతా నా భ్ర‌మ‌…ఒక్క‌సారిగా గుండె ఆగిపోయింద‌ని అనుకుంటుంది. యామిని, రాజ్ ఇక్క‌డే ఉంటే నేను అనుకున్న‌దే జ‌రుగుతుంద‌ని అనుకుంటుంది. యామినికి తాను ఎదురుప‌డితే రాజ్‌ను ఇక్క‌డి నుంచి తీసుకెళుతుంద‌ని కావ్య ప్లాన్ వేస్తుంది. అక్షింత‌లు అంద‌రికి పంచ‌డానికి కావ్య లేస్తుంది.

యామిని టెన్ష‌న్‌…

ఆమెను చూడ‌గానే క‌ళావ‌తి అని యామిని అంటుంది. ఆ పేరు విన‌గానే రాజ్ ముఖంలో ఆనందం క‌నిపించ‌డం యామిని గ‌మ‌నిస్తుంది. కావ్య‌ను ప‌ల‌క‌రిస్తాడు రాజ్‌. మీరు ఈ గుడికే వ‌చ్చారా…భ‌లేగా క‌లిశామ‌ని రాజ్ అంటాడు. మీరు ఒక్క‌రే వ‌చ్చారా కావ్య‌ను అడుగుతాడు రాజ్‌.

ఫ్యామిలీ మొత్తం క‌లిసి వ‌చ్చామ‌ని త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను రాజ్‌కు చూపిస్తుంది కావ్య‌. వారిని చూడ‌గానే యామిని కంగారు. రాజ్‌ను అత‌డి ఫ్యామిలీ చూస్తే ప్ర‌మాద‌మ‌ని భ‌య‌ప‌డుతుంది. వారు రాజ్‌ను చూడ‌క‌ముందే అత‌డిని అక్క‌డి నుంచి తీసుకెళ్లాల‌ని ఫిక్స‌వుతుంది.

రూమ్‌లో బందీగా మారిన రాజ్ కావ్య‌…

పూజ‌లో ఉన్న కావ్య‌….రాజ్‌ను క‌ల‌బ‌డానికి బ‌య‌ట‌కు వ‌స్తుంది. రాజ్ కూడా యామినికి తెలియ‌కుండా కావ్య‌ను క‌ల‌సుకొని మాట్లాడాల‌ని అనుకుంటాడు. ఇద్ద‌రు ఓ రూమ్‌లోకి వెళ‌తారు. రాజ్‌, కావ్య లోప‌ల ఉన్న విష‌యం తెలియ‌క ఓ వ్య‌క్తి బ‌య‌ట‌కు నుంచి లాక్ వేస్తాడు.

సీతారాముల క‌ళ్యాణం మిస్స‌వుతున్నాన‌ని కావ్య బాధ‌ప‌డ‌టంతో…రూమ్‌లో ఉన్న ఫొటోల‌తో సీతారాముల క‌ళ్యాణం ఏర్పాట్లు చేస్తాడు రాజ్‌. ఇద్ద‌రు క‌లిసి పూజ జ‌రిపిస్తారు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024