AP Mega DSC Update: జూన్‌లోపు విద్యాశాఖలో సంస్కరణల పూర్తి చేయాలి.. మెగా డిఎస్సీపై లోకేష్ సూచనలు..

Best Web Hosting Provider In India 2024

AP Mega DSC Update: జూన్‌లోపు విద్యాశాఖలో సంస్కరణల పూర్తి చేయాలి.. మెగా డిఎస్సీపై లోకేష్ సూచనలు..

Sarath Chandra.B HT Telugu Published Apr 09, 2025 07:58 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Apr 09, 2025 07:58 AM IST

AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జూన్‌లోగా విద్యాశాఖలో అన్ని రకాల సంస్కరణలు పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా డిఎస్సీని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మెగా డిఎస్సీపై సమీక్ష నిర్వహించిన నారా లోకేష్
మెగా డిఎస్సీపై సమీక్ష నిర్వహించిన నారా లోకేష్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

AP Mega DSC Update: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సీ, ఎస్ఎస్ సి, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై అధికారులతో లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పూర్తిస్థాయి సంస్కరణల తర్వాత రాబోయే నాలుగేళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని అన్నారు.

నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్‌ అధికారులకు కీలక సూచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఎస్ ఎస్ సి, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాంప్రదాయ ప్రసార మాధ్యమాలతోపాటు ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన మన మిత్ర యాప్ లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్రమంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపినందున, అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డ్యాష్ బోర్డును మే నెలకల్లా సిద్ధం చేయాలని ఆదేశించారు.

విద్యార్థులు లీప్ యాప్ ను అపార్ ఐడితో లాగిన్ అయి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు అపార్ ఐడి నమోదు 85శాతం పూర్తయిందని, సాంకేతిక సమస్యలను అధిగమించి పూర్తిస్థాయి అపార్ ఐడి పూర్తిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ ఉండకూడదని, అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని అన్నారు.

సర్వశిక్ష నిర్వహణలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత సెలవుల్లో కెజిబివిల్లో టీచర్ల బదిలీలు పూర్తిచేసేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.

అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ అకాడమీ, ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే అధునాతన సాంకేతికతతో కూడిన క్లిక్కర్స్ ను తొలుత 9వతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, పనితీరును బట్టి రాబోయే రోజుల్లో 6నుంచి 10తరగతులకు అమలు చేయాలని సూచించారు.

జిఓ నెం.117కు ప్రత్యామ్నాయ జిఓను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని అన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే రోజుకే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 48శాతం పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎటువంటి పైరవీలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శక చర్యలు చేపట్టాలని అన్నారు

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్స్ లర్ జీపీ రాజశేఖర్ తో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకను నిర్వహించనున్నట్లు వీసీ వివరించారు. 1926లో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించారు. 2026, ఏప్రిల్ 26వ తేదీ వరకు ఏడాదిపాటు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విజన్ ను వీసీ జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు.

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ టాప్-100లో స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap Dsc 2024Government Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024