



Best Web Hosting Provider In India 2024

TG SSC Exam Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు 2025 ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి.…?
TG SSC Exam Result 2025 Updates : తెలంగాణ టెన్త్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 15వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేస్తున్నారు. ఈనెలాఖారులోగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ అన్నీ పూర్తి కాగా…. ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈనెలాఖారులోపే ఫలితాలను వెల్లడిస్తారు.
పకడ్బందీగా ‘స్పాట్ వాల్యుయేషన్’…!
జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా చేస్తున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. చీఫ్ ఎగ్జామినర్లు(సీఈలు), అసిస్టెంట్ ఎగ్జామినర్లే కాకుండా స్పెషల్ అసిస్టెంట్లు కూడా విధుల్లో ఉన్నారు. అన్ని దశల్లో జవాబు పత్రాలను పరిశీలించి… మూల్యాంకనం పూర్తి చేస్తున్నారు.
ఏప్రిల్ 15వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ పూర్తి అయితే… ఆ వెంటనే కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను కూడా పూర్తి చేస్తారు. ఇందుకోసం పది రోజుల పాటు సమయం పట్టొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… ఫలితాల వెల్లడి తేదీని ప్రకటిస్తారు.
ఫలితాలు ఎప్పుడు…?
గతేడాది తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. కాబట్టి ఈసారి కూడా ఏప్రిల్ నెలఖారులోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇలా కుదరకపోతే మే మొదటి వారంలో రిజల్ట్స్ వెల్లడిస్తారు.
టెన్త్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి…?
తెలంగాణ పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే పదో తరగతి ఫలితాలు 2025పై నొక్కాలి. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.
ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ పదో తరగతి ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సింగిల్ క్లిక్ తో చెక్ చేసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే తెలంగాణ పదో తరగతి ఫలితాలపై నొక్కాలి. ఇక్కడ విద్యార్థి రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
గతేడాది విడుదలైన ఫలితాల్లో 91శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 89.41శాతం, బాలికలు 92శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయి. 99.06శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 66 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
టాపిక్