




Best Web Hosting Provider In India 2024

వంట గదిలో ఈ వస్తువులకు ఎప్పటికీ లోటు రానివ్వకండి, లేకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు
లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే వాస్తు పరంగా కూడా కొన్ని పనులు చేయాలి. వంటగదిలో ఎల్లప్పుడూ ఉంచాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి కిచెన్ ఎల్లప్పుడు నిండుగా ఉండేలా చూసుకోండి. లోటు రానివ్వకండి.

హిందూ ధర్మంలో ఇంటిలోని వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కడ అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుందని చెప్పుకుంటారు. అన్నపూర్ణాదేవి ఎవరో కాదు లక్ష్మీదేవికి మరో రూపమే. అన్నపూర్ణాదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం.
వంటగది పరిశుభ్రంగా ఉండడమే కాదు, వంటగదిలో వాస్తు ప్రకారం ఏమీ లేకపోయినా లక్ష్మీదేవి బాధ పడుతుందని సంపద, శ్రేయస్సు లేకుండా ఆ ఇల్లు పేదరికంలోకి మారుతుందని చెప్పుకుంటారు.
వంట గదిలో కొన్ని వస్తువులు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వాటికి ఎలాంటి లోటు రాకూడదు. వంట గదిలో ఆ వస్తువులు లోపిస్తే కుటుంబ ఆదాయం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ కుటుంబం కొత్త సమస్యలు చిక్కుకోవడం మొదలవుతుంది. కాబట్టి ఏ వస్తువులు వంటగదిలో నిండుగా ఉండాలో తెలుసుకోండి.
చక్కెర
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చక్కెర ఎప్పుడూ నిండుగా ఉండాలి. దానికి చక్కెర ఉండే సీసా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. చక్కెర ఆహారాన్ని తీపిగా చేస్తుంది. అంటే మన జీవితంలో కూడా తీపిని నింపుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం, ఆనందం, శాంతి ఉండాలంటే వంటగదిలో చక్కెర నిండుగా ఉండాలి.
ఉప్పు
పండితులు చెబుతున్న ప్రకారం వంటగదిలో ఉప్పు ఎల్లప్పుడూ ఉండాలి. దీని రంగు తెలుపుగా ఉంటుంది. అంటే ఇది చంద్రుడిని సూచిస్తుంది. చంద్రుడు సంపద, శ్రేయస్సుకు కారకం. కాబట్టి ఉప్పు కొరత ఉన్న ఇంట్లో ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి.
పసుపు
పసుపు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. వంట గదిలో పసుపు కూడా ఎప్పుడూ ఉండాలి. వంటగదిలో పసుపు అధికంగా ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెప్పుకుంటారు. ఇది కుటుంబ సభ్యుల అదృష్టాన్ని మరింత పెంచుతుంది. ఇంట్లో జరిగే కీడును కూడా అడ్డుకుంటుంది. కాబట్టి ఎప్పటికీ పసుపు వంటగదిలో నిండుగా ఉండేలా చూసుకోండి. కొరత రానివ్వకండి.
నీరు
నీరే లేకపోతే జీవరాశే లేదు. ఒక ప్రదేశంలో నీరు లేకపోతే అక్కడ జీవం లేదని అర్థం. అందుకే వంటగదిలో కూడా మీరు పుష్కలంగా ఉండేలా చూసుకోండి. వంటగదిలో నీరు లేకపోతే ప్రాణాలకే ముప్పని చెప్పుకుంటారు. కాబట్టి వంట గదిలో కచ్చితంగా నీరు ఉండాలి. మీరు ఈ జాగ్రత్తలు వాస్తు పరంగా తీసుకుంటే మీ ఇల్లు నందనవరంగా మారుతుంది.
(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.)
సంబంధిత కథనం