CBN House Foundation: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటికి శంకుస్థాపన, 5 ఎకరాల్లో ఇంటి నిర్మాణం

Best Web Hosting Provider In India 2024

CBN House Foundation: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటికి శంకుస్థాపన, 5 ఎకరాల్లో ఇంటి నిర్మాణం

Sarath Chandra.B HT Telugu Published Apr 09, 2025 09:58 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Apr 09, 2025 09:58 AM IST

CBN House Foundation: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుటుంబ సభ్యులు, రాజధాని ప్రాంత రైతుల సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు.

రాజధాని కోర్‌ క్యాపిటల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
రాజధాని కోర్‌ క్యాపిటల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

CBN House Foundation: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో సీఎం ఇంటికి బుధవారం ఉదయం శంకుస్థాప‌న‌ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ‌స‌భ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో భూమి పూజ‌ నిర్వహించారు. వెల‌గ‌పూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. సొంతింటి నిర్మాణం కోసం గత ఏడాది రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 5 ఎకరాల రిటర్నబుల్‌ ఫ్లాట్‌ను ముఖ్యమంత్రి కొనుగోలు చేశారు.

బుధవారం భూమి పూజతో రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్‌ దంపతులు ఈ భూమి పూజలో పాల్గొన్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు… ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు… 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైనే దృష్టిపెట్టారు.

ఈ క్రమంలో చంద్రబాబు నాడు సొంతి ఇంటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. అమారవతిలో నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలు ఎక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి…. నిర్మాణాలు ప్రారంభించారు.

అమరావతికి సరికొత్త శోభ

అమరావతి పనులు గాడిన పడడం, మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంతి ఇంటి వ్యవహారంపైనా దృష్టిపెట్టారు. దీని కోసం వెలగపూడి సచివాలయం సచివాలయం వెనక E9 రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. నేడు ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి బుధ‌వారం ఉద‌యం సీఎం త‌న కుటుంబ సభ్యులతో క‌లిసి భూమి పూజ నిర్వహించారు.

అమరావతిలో స్వయంగా ముఖ్యమంత్రి సొంత ఇంటి నిర్మాణం చేపడడంతో…. ఈ ప్రాంతం ప్రజలతో పాటు…. అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్‌పై భరోసా కలగనుంది. రాజధాని ఎంపిక నాటినుంచి తరువాత జరిగిన ప్రతి పరిణామంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు.

అమరావతిపై కుట్రలు జరిగిన సమయంలో…. రాజధాని రైతులకు, ప్రజలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు స్వయంగా ఇదే ప్రాంతంలో సొంతిల్లు నిర్మించుకోవడంతో రాజధాని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కేంద్ర నిధులు, రాజధాని ప్రాంతంలో ప్రముఖ సంస్థల ఏర్పాటు, టెండర్లు పూర్తి చేసుకుని జోరందుకున్న నిర్మాణ పనులతో…. ఈ ప్రాంతం అంతటా ఇప్పుడు ఒక సానుకూల వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం ముఖ‌్యమంత్రి ఉండవల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వచ్చే ఏడాది చివరికి సొంతింటి నిర్మాణం పూర్తి చేసి అందులోకి వెళ్లనున్నారు.వెలగపూడి సచివాలయం వెనుక హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయానికి నడుమ సీఎం చంద్రబాబు నివాసం నిర్మిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduTdpNara LokeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024