


Best Web Hosting Provider In India 2024

Rana Naidu 2 Update: రానానాయుడు సీజన్ 2 కొత్త అప్‌డేట్ చెప్పిన డీజే టిల్లు – వెంకటేష్ వెబ్‌సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే?
Rana Naidu 2: రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్ 2 కొత్త అప్‌డేట్‌ను సిద్దు జొన్నలగడ్డ రివీల్ చేశాడు. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి తన పాత్రకు రానా డబ్బింగ్ చెబుతున్నాడట. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రానా నాయుడు 2 సిరీస్ జూన్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Rana Naidu 2: రానానాయుడు సీజన్ 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ రివీల్ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ వేడుకలో మాత్రం రానా దగ్గుబాటి కనిపించలేదు.
వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్…
రానా దగ్గుబాటి మిస్సవ్వడంపై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు. రానా ముంబాయిలో రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉన్నాడని సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు. డబ్బింగ్ పూర్తిచేసి హైదరాబాద్ రావాలని అనుకున్నాడని, కానీ ఫ్లైట్ మిస్సవ్వడంతో పాటు మరో పంచాయితీ ఉండటం వల్ల రాజా జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడని సిద్దు జొన్నలగడ్డ చెప్పాడు.
జూన్‌లో రిలీజ్…
రానా నాయుడు సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్‌తో పాటు రానా తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతోన్నట్లు తెలిసింది. మే నెలలోగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం కంప్లీట్ చేసి జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్…
రానా నాయుడు సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో వెంకటేష్, రానాతో పాటు అర్జున్ రాంపాల్, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇమేజ్ డ్యామేజ్…
రానానాయుడు సీజన్ వన్ 2023 మార్చిలో రిలీజైంది. బోల్డ్ అంశాలతో దర్శకద్వయం ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ పాళ్లుగా బాగా తగ్గించినట్లు సమాచారం.
సీజన్ వన్ కథ ఇదే…
ముంబాయిలో సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య ఎదురైన పరిష్కరిస్తుంటాడు రానా నాయుడు( రానా). భార్యాపిల్లలే అతడి ప్రపంచం. అతడిని తేజ్‌నాయుడు (సుశాంత్ సింగ్) జఫ్ఫానాయుడు (అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముళ్లు ఉంటారు. రానా నాయుడు తండ్రి నాగనాయుడు (వెంకటేష్) పదిహేనేళ్లు జైలు శిక్షను అనుభవించి విడుదలవుతాడు. తండ్రి జైలు నుంచి విడుదల కావడం రానా నాయుడుకు నచ్చదు. నాగనాయుడిని అనుక్షణం ద్వేషిస్తుంటాడు. చివరికి నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడడు. అందుకు గల కారణమేమిటి? చేయని తప్పుకు నాగనాయుడికి ఎందుకు శిక్ష పడింది?
సూర్య (ఆశీష్ విద్యార్థి) అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కారణంగా రానా నాయుడికి ఎదురైన సమస్యను నాగనాయుడు ఎలా పరిష్కరించాడు? ఆ గ్యాంగ్ స్టర్ బారి నుంచి తన కుటుంబాన్ని రానా నాయుడు ఏ విధంగా కాపాడుకున్నాడు అన్నదే ఈ సిరీస్ కథ.
సంబంధిత కథనం