




Best Web Hosting Provider In India 2024

Onion Biryani: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు రెండు ఉల్లిపాయలతో ఇలా బిర్యాని చేసేయండి, అదిరిపోతుంది
Onion Biryani: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆనియన్ బిర్యానీ ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా కూడా చేసేయవచ్చు. ఆనియన్ బిర్యానీ రెసిపీ తెలుసుకోండి.

ఇంట్లో కూరగాయలు ఒక్కోసారి నిండుకుంటాయి. అలాంటప్పుడు మీరు సింపుల్ గా రెండు ఉల్లిపాయలతో కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ బిర్యాని సులువుగా ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. వేడివేడిగా దీన్ని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఆనియన్ బిర్యాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఉల్ల బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు – రెండు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
నూనె – ఒక స్పూను
నెయ్యి – ఒక స్పూను
బిర్యాని ఆకులు – రెండు
అనాస పువ్వులు – రెండు
లవంగాలు – మూడు
యాలకులు – మూడు
షాజీరా – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
సోంపు – అర స్పూను
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
కారం – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
పెరుగు – అరకప్పు
పుదీనా ఆకులు – పావు కప్పు
కొత్తిమీర తరుగు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
ఉల్లిపాయ బిర్యాని రెసిపీ
1. ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు ఉండవు. అలాంటప్పుడు బయటకు వెళ్లి తినడానికి కూడా కాస్త బద్ధకంగా అనిపిస్తుంది.
2. ఆ సమయంలో రెండే ఉల్లిపాయలతో బిర్యాని చేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది.
3. దీనికోసం ముందు మీరు బాస్మతి బియ్యాన్ని నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
4. స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టి నూనె, నెయ్యి వేయాలి.
5. అవి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, సోంపు, అనాసపువ్వు, జాపత్రి వంటివన్నీ వేసి వేయించుకోవాలి.
6. ఇవి వేగాక సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
7.ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.
8. ఆ తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇవి బాగా వేగాక ఒక స్పూను కారం, అర స్పూను గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
10. అందులోనే అరకప్పు పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
11. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.
12. పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలపాలి.
13. ఆ బియ్యం ఉడికేందుకు సరిపడా నీటిని వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
14. తర్వాత మూత పెట్టి అన్నం ఉడికే దాకా చిన్న మంట మీద ఉడికించాలి.
15. తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే ఉల్లిపాయ బిర్యానీ రెడీ అయిపోతుంది.
16. వండుతున్నప్పుడే దాని సువాసనకు తినాలన్న కోరిక పుడుతుంది.
ఉల్లిపాయ బిర్యానీని లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగించుకోవచ్చు. రాత్రిపూట డిన్నర్ గా కూడా తినవచ్చు. పక్కన పెరుగు పెట్టుకుని ఈ ఉల్లిపాయ బిర్యానీని ఆస్వాదిస్తే అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కారాన్ని తగ్గిస్తే పిల్లలు చాలా సులువుగా దీన్ని తింటారు. స్పైసీగా కావాలనుకుంటే మీరు కారం లేదా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ బిర్యానీ చేయడానికి ప్రయత్నించండి. ఇది కచ్చితంగా మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
సంబంధిత కథనం