



Best Web Hosting Provider In India 2024

Malayalam OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం అవార్డ్ విన్నింగ్ మూవీ – ప్రాంక్ వీడియో వికటిస్తే!
Malayalam OTT: మలయాళం అవార్డ్ విన్నింగ్ మూవీ నీలముడి థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా రన్‌టైమ్ 80 నిమిషాలే కావడం గమనార్హం. నీలముడి మూవీలో మజీద్ హనీఫా, శ్రీనాథ్, సుబ్రమణియన్ కీలక పాత్రలు పోషించారు.

మలయాళం అవార్డ్ విన్నింగ్ మూవీ నీలముడి ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మ్యాక్స్ ఓటీటీలో విడుదలైంది. కుల వర్ణ వివక్షపై సెటైరికల్ కామెడీగా నీలముడి సినిమాను దర్శకుడు శరత్‌కుమార్ రూపొందించారు.
వ్లోగ్ వీడియోస్ ఫార్మెట్‌లో…
నీలముడి మూవీలో మజీద్ హనీఫా, శ్రీనాథ్, సుబ్రమణియన్, అచ్యుతానందన్ కీలక పాత్రలు పోషించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వ్లోగ్ వీడియోస్ ఫార్మెట్‌లో చేస్తున్నట్లుగా ప్రయోగాత్మకంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
80 నిమిషాలు..
నీలముడి మూవీ రన్‌టైమ్ 80 నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. కోటి రూపాయల లోపే బడ్జెట్‌తో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించారు.
సోషల్ మీడియా మిస్‌యూజ్…
ప్రాంక్‌ల పేరుతో యూట్యూబర్లు చేసే వీడియోలు హద్దులు దాటితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే కాన్సెప్ట్‌తో దర్శకుడు శరత్‌కుమార్ ఈ మూవీని రూపొందించారు. సోషల్ మీడియాను ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారన్నది ఈ మూవీలో చూపించాడు.
కథ ఇదే…
ఓ యూట్యూబర్. ప్రాంక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతాడు. ఇండిపెండెన్స్ డే రోజున తన స్నేహితుడు కన్నన్‌పై సిద్ధు ఓ ప్రాంక్ వీడియో చేయాలని అనుకుంటాడు. కానీ అది కాస్త మిస్ ఫైర్ అవుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంక్ వీడియో సంచలనంగా మారుతుంది. గొడవలకు దారితీస్తుంది. ఇంతకీ ఈ ప్రాంక్ వీడియోలో ఏముంది? ఈ వీడియో కారణంగా సిద్దు ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్…
లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడుఅచ్యుతానందన్ మినహా ఈ సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్టులకు ఇదే తొలి మూవీ కావడం గమనార్హం. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలోనే రిలీజైంది.
సంబంధిత కథనం