Pawan Son MarkShankar: మరో మూడు రోజులు సింగపూర్ ఆస్పత్రిలోనే పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌

Best Web Hosting Provider In India 2024

Pawan Son MarkShankar: మరో మూడు రోజులు సింగపూర్ ఆస్పత్రిలోనే పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌

Sarath Chandra.B HT Telugu Published Apr 09, 2025 12:12 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Apr 09, 2025 12:12 PM IST

Pawan Son MarkShankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ మరో మూడు రోజులు సింగపూర్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నట్టు జనసేన మీడియా విభాగం ప్రకటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని పవన్ కళ్యాణ్‌, చిరంజీవి దంపతులు పరామర్శించారు.

సింగపూర్‌లో పవన్ కుమారుడు చదువుతున్న కిచెన్ స్కూల్‌లో అగ్నిప్రమాదం
సింగపూర్‌లో పవన్ కుమారుడు చదువుతున్న కిచెన్ స్కూల్‌లో అగ్నిప్రమాదం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Pawan Son MarkShankar: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు జనసేన మీడియా విభాగం ప్రకటించింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. కుమారుడు మార్క్ ను చూశారు.

మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నట్టు వైద్యులు పవన్‌ కళ్యాణ్‌కు వివరించారు.

భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.

అగ్ని ప్రమాదంలో మార్క్‌కు గాయాలు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్ సింగపూర్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురయ్యారు. మార్క్‌ శంకర్ చదువుకుంటున్న కిచెన్‌ పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయపడినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌ చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో పవన్‌ కుమారుడుతో పాటు మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా గాయపడ్డారు.

సింగపూర్‌లో చిన్నారులకు కిచెన్‌ లెసన్స్‌ చెప్పే పాఠశాలలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ పాఠశాలలో ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రివర్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న టమోటో కిచెన్ స్కూల్‌‌లో నిర్వహిస్తున్న ఈస్టర్‌ క్యాంప్‌లో పవన్ కుమారుడు శిక్షణ పొందుతున్నారు. ఈస్ట్ సింగపూర్‌లోని జూ ఛాట్‌ రోడ్డులో ఈ పాఠశాల ఉంది.

మార్చి 3 నుంచి మే 15వ తేదీ వరకు ఆరు నుంచి 12ఏళ్ల లోపు చిన్నారులకు ఈస్టర్‌ కుకింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. సింగపూర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న క్యాంపస్‌లలో ఈ తరగతులు నిర్వహిస్తున్నట్టు స్కూల్ వెబ్‌సైట్‌ పేర్కొంది.పవన్ కళ్యాణ్‌ కుమారుడు మార్క్ శంకర్‌ 2017 అక్టోబర్ 10వ తేదీన జన్మించారు. ఎనిమిదేళ్ల మార్క్‌ శంకర్‌ అగ్ని ప్రమాదంలో చిక్కు కోవడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. 2022లో హెచ్‌టీలో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

JanasenaPawan KalyanFire AccidentTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024