


Best Web Hosting Provider In India 2024
VITEEE 2025 : వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్- రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్..
VITEEE 2025 registration: వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వారికి అప్డేట్. వీఐటీఈఈఈ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. పూర్తి వివరాలు..

వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీఈఈ 2025) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (వీఐటీఈఈఈ 2025) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ విండో ఏప్రిల్ 7తో ముగియనుది. ఇప్పటి వరకు పరీక్షకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు viteee.vit.ac.in అప్లై చేసుకోవచ్చు.
వీఐటీఈఈఈ 2025: దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జులై 1, 2003 తర్వాత జన్మించిన అభ్యర్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైస్కూల్ సర్టిఫికేట్లను ఉపయోగించి పుట్టిన తేదీని విద్యాసంస్థ నిర్ధారిస్తుంది.
వీఐటీఈఈఈ 2025: ఇలా అప్లై చేసుకోండి..
1. vit.ac.in వీఐటీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న వీఐటీఈఈఈ 2025 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. రిక్వెస్ట్ చేసిన సమాచారాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
6. ఫామ్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
బీటెక్ కోసం వీఐటీఈఈఈ 2025 దరఖాస్తు ఫీజు రూ.1,350.
వీఐటీఈఈఈ ప్రవేశ పరీక్షను 2025 ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు.
ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. ఇవి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. (ఎంసీక్యూలు) నాలుగు ఆప్షన్లతో ఉంటాయి: ఏ, బీ, సీ, డీ. నాలుగు ఆప్షన్లలో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్.
మ్యాథ్స్/బయాలజీ (40 ప్రశ్నలు), ఫిజిక్స్ (35 ప్రశ్నలు), కెమిస్ట్రీ (35 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ (10 ప్రశ్నలు), ఇంగ్లిష్ (5 ప్రశ్నలు) విభాగాలుగా విభజించి మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి.
వీఐటీఈఈఈ 2025 అడ్మిట్ కార్డు ఎగ్జామ్ షెడ్యూల్‌కి 48 గంటల ముందు అందుబాటులో ఉంటుంది. ఈ-అడ్మిట్ కార్డులో, పరీక్ష వేదిక చిరునామా, అప్లికేషన్ నంబర్, విద్యార్థి ఫొటో, పరీక్ష తేదీ, అభ్యర్థి ఎంచుకున్న సమయం వంటివి ఉంటాయి.
వీఐటీఈఈఈ 2025 ఫలితాలను ఏప్రిల్ 30న ప్రకటించి, 2025 మేలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ని తరచూ చెక్ చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link