




Best Web Hosting Provider In India 2024

Ntr – Prashanth Neel Movie: ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ జాయినయ్యేది అప్పుడే -అనౌన్స్‌చేసిన మేకర్స్ -ట్వీట్ వైరల్
ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ జాయినయ్యేది ఎప్పుడన్నది కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 22 నుంచి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్‌ను ఎన్టీఆర్ మొదలుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించింది.

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ బుధవారం గుడ్‌న్యూస్ వినిపించారు.ఏప్రిల్ 22 నుంచి ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ లేకుండానే…
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. ఎన్టీఆర్ లేకుండా సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌ను హైదరాబాద్‌లో ప్రశాంత్ నీల్ షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ బళ్లారి పరిసర ప్రాంతాల్లో జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీరియాడికల్ కథాంశంతో…
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఈ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా సప్త సాగరాలు దాటి ఫేమ్, కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఇదివరకే మేకర్స్ అనౌన్స్‌చేశారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ మూవీ విడుదలకాబోతుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
రవి బస్రూర్ మ్యూజిక్…
ప్రశాంత్ నీల్ మూవీలో గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇప్పటివరకు చేయనటువంటి మాస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన ఓ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
వార్ 2తో బిజీ…
వార్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు ఎన్టీఆర్. స్పై యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌లో సాగుతుందని సమాచారం. ఈ ఏడాది ఆగస్ట్ 14న వార్ 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్