



Best Web Hosting Provider In India 2024

TG School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఈ నెలలో వరుసగా 3 రోజులపాటు సెలవులు..!
తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ వీకెండ్ లో వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 12న రెండో శనివారం ఉండగా… మరునాడు ఆదివారం ఉంది. ఇక 13వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉండటంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

వేసవి సెలవులు రాకముందే… తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త వచ్చేసింది. ఈ ఏప్రిల్ నెలలో వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు అని తెలియటంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు.
వరుస సెలవులు…
ఈ ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు పిల్లలకు సెలవులు ఉండనున్నాయి. 12వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు ఉంది. మరునాడు ఆదివారం కావడంతో మరో హాలిడే వచ్చింది. ఇలా రెండు కాకుండా…. సోమవారం రోజు బీఆర్ అంబేద్కర్ జయంతి ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పిల్లలకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లు అయింది.
ఇక ఈ ఏప్రిల్ నెలలో చూస్తే…. ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. మధ్యాహ్నం 12. 30 గంటలకు వరకు పని చేస్తాయి. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లలకు వేసవి సెలవులు రానున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో భాగంగా… మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈ 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 27 సాధారణ సెలవులు ఉన్నాయి. 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
టాపిక్