




Best Web Hosting Provider In India 2024

Good Bad Ugly OTT: అజిత్ కుమార్ యాక్షన్ కామెడీ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే!
Good Bad Ugly OTT: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేటర్లలో రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే, ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ డీల్ జరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై చాలా హైప్ ఉంది. ఈ సినిమా రేపే (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ యాక్షన్ కామెడీ మూవీలో అజిత్ మళ్లీ సక్సెస్ ట్రాక్ పడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మంచి క్రేజ్ ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓటీటీ డీల్ ఇప్పటికే జరిగింది.
ఓటీటీ పార్ట్‌నర్ ఇదే
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. నెట్‍ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. మే నెలలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెడ్ డ్రాగన్ అనే మాజీ గ్యాంగ్‍స్టర్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కుమార్ నటించారు. తన కుమారుడు కిడ్నాప్ అయి ప్రమాదంలో ఉండటంతో మళ్లీ గ్యాంగ్‍స్టర్‌గా మారతాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటించారు. ప్రభు, రాహుల్ దేవ్, ఉషా ఉతప్, కింగ్‍స్లే, రోడీస్ రఘు, ప్రతీప్ కాబ్రా, హ్యారీ జోష్, కేజీఎఫ్ అవినాశ్, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.
విదాముయర్చి నిరాశ తర్వాత..
అజిత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విదాముయర్చి ఈ ఏడాది ఫిబ్రవరి 6న విడుదలైంది. హైప్ మధ్య వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్లాఫ్‍గా నిలిచింది. ఆ సినిమా ఫలితం సరిగా రాకపోయినా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై ఆరంభం నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీకి అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
అజిత్‍కు వీరాభిమాని అయిన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవి శంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.200కోట్లకు పైగా బడ్జెట్ అయినట్టు అంచనా. రేపు ఏప్రిల్ 10న తమిళం, తెలుగు, హిందీలో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీతో మళ్లీ అజిత్ బ్లాక్‍బస్టర్ బాట పడతారేమో చూడాలి.
సంబంధిత కథనం