



Best Web Hosting Provider In India 2024

Inter after Courses : ఇంటర్ పూర్తయిందా…? ఇంజినీరింగ్, మెడికల్ కాకుండా ఈ 10 కోర్సులు చూడండి
ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఇంజినీరింగ్ లేదా మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. కేవలం ఈ కోర్సులు మాత్రమే కాకుండా… మరిన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి….

ప్రతి విద్యార్థి దశలోనూ ఇంటర్ తర్వాత తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఇంటర్ తర్వాత ఎటువైపు వెళ్లాలి…? ఏ కోర్సు చదివితే అవకాశాలు ఉంటాయి..? ఏ విధంగా ముందుకెళ్తే భవిష్యత్తులో రాణించవచ్చు..? వంటి ప్రశ్నలు మదిని తొలచివేస్తుంటాయి. అయితే చాలా మంది విద్యార్థులు… ఇంజినీరింగ్ లేదా మెడికల్(ఎంబీబీఎస్, డెంటల్) వైపు ఆసక్తి చూపుతుంటారు.
ప్రస్తుత కాలంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ మాత్రమే కాకుండా చాలా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తు కాలానికి అనుగుణంగా… కొత్త కొత్త కోర్సులతో పాటు వాటికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. అయితే ఇంటర్మీడియత్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాకుండా…మరికొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేయండి….
ఫార్మసీ (బి.ఫార్మా):
ఫార్మసీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఫార్మా రంగంలో అవకాశాలు దొరుకుతాయి. స్వదేశంతో పాటు విదేశాల్లో ఈ రంగంలోని నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫార్మసిస్ట్, డ్రగ్ థెరపిస్ట్, హెల్త్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ లేదా డ్రగ్ టెక్నీషియన్ గా పని చేయవచ్చు.
బి.ఎస్సీ. నర్సింగ్:
మెడికల్ విభాగంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సుతో పాటు శిక్షణ పూర్తి చేసిన వారికి… నర్సులుగా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు లేదా నర్సింగ్ హోమ్స్ లో ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
బి.ఎస్సీ (ఆనర్స్):
సాధారణ బీఎస్సీ కాకుండా ఇందులోనే ఆనర్స్ ఉంటుంది. సైన్స్ కోర్సులో ఆనర్స్ చేసిన వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా పరిశోధన రంగంలో అవకాశాలు ఉంటాయి. రీసెర్ట్ ఫెలో లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పని చేయవచ్చు. టీచింగ్ రంగంతో పాటు ఫార్మాస్యూటికల్, రసాయన పరిశ్రమ లేదా ONGC వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు.
బి.ఎస్సీ. (ఆంత్రోపాలజీ):
బీఎస్సీలో అంత్రోపాలజీ కూడా ఉంటుంది. ముఖ్యంగా మానవుని పుట్టక తో పాటు పరిణామ క్రమాన్ని గురించి చెబుతోంది. ఇందులో ఉన్నత విద్యను అభ్యసిస్తే… క్యూరేటర్, కల్చర్ రిసోర్స్ మేనేజర్, టూర్ గైడ్, అర్బన్ ప్లానర్ లేదా రిసెర్చర్ గా అవకాశాలు ఉంటాయి
బి.ఎస్సీ. ఆక్యుపేషనల్ థెరపీ:
బీఎస్సీలోనే ఆక్యుపేషనల్ థెరపీ (BOT) అనే కొత్త కోర్సు ఉంది. ఈ కోర్సు పూర్తి చేస్తే ఆర్థోపెడిక్, మానసిక, నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సేవలు అందించవచ్చు.వైద్య రంగంలో ఈ సేవలకు మంచి గుర్తింపు ఉంది. అవకాశాలు కూడా ఉంటాయి.
బి.ఎస్సీ. ఫిజియోథెరపీ:
ప్రస్తుతం కాలంలో ఫిజియోథెరఫిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో లేదా సొంతంగా కూడా ఫిజియోథెరఫిస్ట్ గా పని చేయవచ్చు.
బీఎస్సీ ఆర్క్ టెక్చర్:
డ్రాయింగ్ పై ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సు చదువొచ్చు. ఇందులో డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సును పూర్తి చేస్తే మార్కెట్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా డ్రాయింగ్ టీచర్లను రిక్రూట్ చేస్తున్నారు.
బీబీఏ:
బీబీఏ అంటే బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. గణితం, ఇంగ్లీష్ కోర్ సబ్జెక్టులుగా ఉంటే ఈ కోర్సు చదువొచ్చు. ఈ కోర్సు కూడా మంచి డిమాండ్ ఉంది.
బీఎస్సీ మైక్రోబయాలజీ:
బీఎస్సీలో మైక్రోబయాలజీ పూర్తి చేసిన వారికి వైద్య, ఫార్మా రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. బయోఇన్ఫర్మేటిక్స్, జెనోమిక్స్ మరియు జెనెటిక్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.
బీఎస్సీ బయోటెక్నాలజీ :
బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన వారికి డయాగ్నస్టిక్ పరిశ్రమ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి.
టాపిక్