




Best Web Hosting Provider In India 2024

Appadam Recipe: కప్పు బియ్యప్పిండితో బోలెడన్ని అప్పడాలు చేసేయొచ్చు, మండే ఎండల్లో ఇలా చేసేయండి
Appadam Recipe: అప్పడాలు, వడియాలు ఉంటే చాలు సాంబార్ తో, పప్పుతో నంజుకుని తినేయొచ్చు. బియ్యప్పిండి అప్పడాలు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

మండే ఎండల్లోనే మనం అప్పడాలు, వడియాలులాంటివి పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుంటే ఇది ఏడాదంతా వస్తాయి. క్రిస్పీగా ఉండే అప్పడాలను పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పడాలు చేయడం కష్టం అనుకుంటారు. కానీ చాలా సులువుగా వీటిని చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మేము ఇచ్చిన రెసిపీని చూడండి. ఇక్కడ మేము బియ్యప్పిండితో ఏడాదికి సరిపడా అప్పడాలను ఎలా చేసుకోవాలో ఇచ్చాము. ఒక కప్పు బియ్యప్పిండి చాలు 100 అప్పడాలు దాకా అవుతాయి. అది ఎలాగో తెలుసుకోండి.
బియ్యప్పిండి అప్పడాల రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి – ఒక పెద్ద కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – అరకప్పు
ఎండుమిర్చి – పది
నీళ్లు – సరిపడినన్ని
బియ్యప్పిండి అప్పడాలు రెసిపీ
- బియ్యప్పిండి అప్పడాలు చేసేందుకు ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టి మరిగించండి.
2. ఆ నీళ్లలో బియ్యప్పిండి కొంచెం కొంచెంగా వేస్తూ అలా కలుపుతూ ఉండండి.
3. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని, కొత్తిమీర తరుగును వేసి కలపండి.
4. ఇప్పుడు ఎండు మిర్చిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి.
5. ఆ ఎండుమిర్చి పౌడర్ ని కూడా అందులో వేసి బాగా కలపండి.
6. ఇది జిగట పాకం లాగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
7. ఒక కాటన్ చీరను ఎండలో కింద పరిచి దానిపై ఈ మిశ్రమం ఒక గరిట తీసి వేయండి.
8. దాన్ని గరిటతోనే అప్పడంలాగా రుద్దుకోండి. దోసెలు ఎలా రౌండ్ గా రుద్దుతామో అలా.
9. ఎర్రటి ఎండలో ఎండాక అప్పడాలు చాలా సులువుగా వచ్చేస్తాయి.
10. ఒక పెద్ద కప్పు బియ్యప్పిండికి 100 అప్పడాలు దాకా అవుతాయి.
మీరు అప్పడాలు వేసే సైజును బట్టి ఎన్ని అప్పడాలు అవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. పెద్దవి వేస్తే 50 అవుతాయి. అదే మీడియం సైజులో ఉన్నవి వేస్తే 100 అప్పడాల దాకా అవుతాయి. పెరుగన్నం, మజ్జిగ అన్నం, పప్పు అన్నం, సాంబార్ వంటివి చేసుకునేటప్పుడు ఈ అప్పడాలను నూనెలో వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
సంబంధిత కథనం
టాపిక్