



Best Web Hosting Provider In India 2024

Daily one Clove: వేసవిలో రోజుకో లవంగం తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఊహించడం కష్టమే
Daily one Clove: వేసవి వచ్చిందంటే ప్రత్యేకంగా ఆ సీజన్ ఆహారాన్ని తినాలి. రోజుకు ఒక ఒకటి లేదా రెండు లవంగాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది ఆయుర్వేదం.

లవంగాలు ఆరోగ్యానికి మంచివని ఆయుర్వేదం వివరిస్తోంది. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముందుంటుందని ఆయుర్వేదం వివరిస్తుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన అధ్యయనం ప్రకారం వేసవిలో ఒకటి లేదా రెండు లవంగాలు నోట్లో వేసుకొని నమలడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని అధికంగా తింటే వేడి చేస్తుంది. కాని ఒకటి లేదా రెండు తింటే ఎలాంటి వేడి చేయదు. ఇలా లవంగాలను ఒకటి లేదా రెండు నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిని అధికంగా తింటే మాత్రం వేడి చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వేసవిలో ఒకటి లేదా రెండు లవంగాలు తినండి చాలు.
పరిశోధనలు చెబుతున్న ప్రకారం లవంగాలలో యూజినాల్ అని పిలిచే మూలకం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను ఇది పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువగానే తినాలి. ఎక్కువగా తింటే ఎసిడిటీ పెరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం వంటివి వస్తాయి.
లవంగాలు ఇలా తినండి
వేసవిలో లవంగాలు వాడడం ఉత్తమమే, కానీ మితంగా వాడాల్సిన అవసరం ఉంది. టీ లో ఒకటి లేదా రెండు లవంగాలు వేసుకొని మసాలా టీగా చేసుకొని తాగవచ్చు. ఇలా తాగడం వల్ల వేసవిలో వచ్చే గొంతు నొప్పి, నోటి దుర్వాసన, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. అలాగే సోంపు, లవంగాలు కలిపి నమలవచ్చు. లేదా పంచదార లవంగాలు కలిపి నమిలిన ఎంతో మంచిది. ఇది వేడిని చాలా వరకు తగ్గిస్తుంది. లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరాన్ని అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి కాపాడతాయి.
గుండె ఆరోగ్యానికి కూడా లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. గుండెల్లో వచ్చే మంటను తగ్గించడంలో ఇవి ముందుంటాయి. లవంగాలను నమలడం వల్ల దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం కూడా డిటాక్స్ఫికేషన్ కు గురవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది మెరుగుపడుతుంది.
భోజనం తిన్నాక
భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే లవంగాలలో ఉండే ఎంజైమ్‌లు, జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఆహారం కూడా త్వరగా జీర్ణం అయ్యేందుకు వీలుంటుంది.
బలహీనమైన ఎముకలు ఉన్నవారు ప్రతిరోజూ లవంగాలు తినేందుకు ప్రయత్నించండి. అలాగే ఆర్థరైటిస్ వంటి కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా లవంగాలను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను కాపాడుతుంది.
లవంగం డ్రింక్
బరువు తగ్గే ప్రయాణంలో కూడా లవంగం ఉపయోగించవచ్చు. లవంగం నీటిని తయారు చేసి ప్రతిరోజు తాగడం వల్ల మీరు బరువు త్వరగా తగ్గుతారు. లవంగాలను నాలుగైదు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. అలాగే అల్లం, దాల్చిన చెక్కను కూడా తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. 10 నిమిషాల తర్వాత దాన్ని వడకట్టి ఒకటి కప్పులో వేసుకోవాలి. అందులో తేనె లేదా నిమ్మరసం కలుపుకొని సిప్ చేయాలి. అంతే లవంగం నీరు తయారైనట్టే. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం