


Best Web Hosting Provider In India 2024

Netflix Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఇక ఈ సినిమాలు కనిపించవు.. చూడకపోతే వెంటనే చూసేయండి
Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు తమ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇందులో భాగంగా కొన్ని సినిమాలు జోడించడం, మరికొన్నింటిని తీసేయడం చేస్తుంటారు. తాజాగా ఏప్రిల్లో అలా కొన్ని సినిమాలు తీసేస్తున్నారు. ఆ సినిమాలేంటో చూడండి.

Netflix Movies: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకొస్తూనే ఉంటుంది. దీనికోసం చాలాసార్లు సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వస్తుంటాయి. అలానే, కొన్నిసార్లు సినిమాలు, సిరీస్‌లు తీసేస్తూ ఉంటారు.
ఈసారి ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేశారు. ఇంకా కొన్ని తీసేయబోతున్నారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 26 వరకు ఏ సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోతాయో ఒకసారి తెలుసుకోండి.
ఈ సినిమాలకు ఇదే చివరి రోజు
నెట్‌ఫ్లిక్స్ లో ఏప్రిల్ 8 వరకు 60కి పైగా సినిమాలు, సిరీస్‌లను తీసేశారు. ఇప్పుడు ఏప్రిల్ 9, 10 మధ్యలో ఇంకో 12కి పైగా సినిమాలు, సిరీస్‌లు వెళ్లిపోనున్నాయి. ఎల్ఏ ఒరిజినల్స్ (2020) ఏప్రిల్ 9న నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేస్తారు. దీంతోపాటు ఘోస్ట్‌బస్టర్స్ ఆఫ్టర్‌లైఫ్ కూడా ఇవాళే అంటే ఏప్రిల్ 9నే వెళ్లిపోనుంది.
ఏప్రిల్ 15న తొలగించేవి ఇవే
నెట్‌ఫ్లిక్స్.కామ్/టుడుమ్ ప్రకారం.. ఎ క్వైట్ ప్లేస్ 2 ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనుంది. 2018లో వచ్చిన హెరిడిటీ, జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్‌డమ్, జురాసిక్ పార్క్ (ది లాస్ట్ వరల్డ్) కూడా ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేస్తారు.
ఇవి కాకుండా, హారర్ సినిమా స్క్రీమ్ మూడు పార్ట్‌లు ఏప్రిల్ 17న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనున్నాయి. మీరు ఇంకా ఈ మూడు సినిమాలు చూడకపోతే, వెంటనే చూసేయండి. ప్రియాంక చోప్రా సినిమా బేవాచ్ ను ఏప్రిల్ 24న నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేస్తారు. దీంతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్స్ (రైజ్ ఆఫ్ ది బీస్ట్స్) ఏప్రిల్ 25 తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో కనిపించదు.
లిస్ట్‌లోని బాలీవుడ్ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్ తొలగిస్తున్న సినిమాల జాబితాలో హిందీ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో అభిషేక్ బచ్చన్ సినిమా ఢిల్లీ 6 కూడా ఏప్రిల్ 30న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనుంది. ఈ మూవీ 2009లో వచ్చింది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో పాటు సోనమ్ కపూర్ నటించింది.
ఇక షాహిద్ కపూర్ మూవీ హైదర్ ను కూడా ఏప్రిల్ 30న నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేయనున్నారు. దీంతోపాటు అతడు నటించిన మరో మూవీ కమీనేను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరు. రణబీర్ కపూర్ సినిమా జగ్గా జాసూస్ కూడా ఈ జాబితాలో ఉంది.
లైఫ్ ఇన్ ఎ మెట్రో మూవీకి కూడా ఏప్రిల్ 30 చివరి రోజు. ఇవే కాకుండా దిస్ ఈజ్ ది ఎండ్, బర్ఫీ, అండర్‌వరల్డ్ బ్లడ్ వార్స్, వి ఆర్ ఫ్యామిలీ, ఆల్ఫా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కై పో చే, ది వెడ్డింగ్ గెస్ట్, చిల్లర్ పార్టీ, టూ ఫర్ ది మనీ సినిమాలు ఏప్రిల్ 30 వరకు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటాయి.
సంబంధిత కథనం