




Best Web Hosting Provider In India 2024

OTT Psychological Thriller: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి తమిళ సైకలాజికల్ థ్రిల్లర్.. అమ్మాయిని చంపి కుక్కకు వేసే కిల్లర్..
OTT Psychological Thriller: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అందులో ఒకరిని చంపి కుక్కలకు వేసే కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

OTT Psychological Thriller: సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఏడాదిన్నర తర్వాత ఓ తమిళ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ పేరు వెబ్ (Web). ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని బుధవారం (ఏప్రిల్ 9) ఆహా తమిళం ఓటీటీ వెల్లడించింది.
వెబ్ ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వెబ్. ఈ సినిమా ఆగస్ట్, 2023లో రిలీజైంది. అయితే ఇన్నాళ్లూ డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోని ఈ మూవీ.. మొత్తానికి ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్వాలిటీ థ్రిల్లర్ మూవీ కావాలా.. అయితే ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ చూడండి అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.
వెబ్ మూవీ స్టోరీ ఏంటంటే?
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వెబ్ ఆగస్ట్ 4, 2023లో రిలీజైంది. హరూన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నట్టి సుబ్రమణ్యం, శిల్పా మంజునాథ్, రాజేంద్రన్ నటించారు. వేలన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మునివేలన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఐదుగురు అమ్మాయిలు, ఓ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది.
రేవ్ పార్టీలో ఫుల్లుగా మందుకొట్టి ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న ఐదుగురు అమ్మాయిలను ఓ వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను ఓ పాడుబడిన బంగ్లాలో బంధిస్తాడు. వాళ్లలో ఓ అమ్మాయిని చిత్ర హింసలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఓ అమ్మాయిని చంపి తన కుక్కలకు వేస్తాడు. ఆ కిడ్నాపర్ కు సాయపడుతున్న ఓ అమ్మాయి.. ఆ నలుగురికి అతని కథేంటో చెబుతుంది.
ఇలాగే ఓ ర్యాష్ డ్రైవింగ్ లో అతని చెల్లెలు చనిపోతుంది. అందుకే ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్లందరికీ ఇలాంటి గతే పడుతుందని ఆ కిడ్నాపర్ హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఆ నలుగురు అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్లు తప్పించుకుంటారా లేదా అన్నది ఈ వెబ్ మూవీలో చూడాలి. ఈ సినిమాలో నట్టి సుబ్రమణ్యం.. వీరా అనే పాత్రలో నటించాడు. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆహా తమిళం ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
సంబంధిత కథనం